Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో జగన్... అవును నిజమే !

శాసనమండలిలో ఇదే విషయం మీద లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అని మమ్మల్ని ఎంత సేపు విమర్శిస్తారు.

By:  Satya P   |   26 Sept 2025 4:00 PM IST
అసెంబ్లీలో జగన్... అవును నిజమే !
X

వైసీపీ ఏపీ అసెంబ్లీకి దూరం పాటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. 2024 ఎన్నికల తరువాత వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు అయితే హాజరవడం లేదు. జగన్ ఆయన ఎమ్మెల్యేలు రెండు సార్లు మాత్రం హాజరయ్యారు. అది బడ్జెట్ సెషన్ కి ముందు గవర్నర్ చేసే ప్రసంగానికి మాత్రమే. ఇక ఏపీ అసెంబ్లీ గత ఏడాది నాలుగు సార్లు జరిగింది. ఈసారి ఆర్థిక సంవత్సరంలో తొలిసారి భేటీ అయింది. వర్షాకాల సమావేశాలతో ఎనిమిది రోజుల పాటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ యధాప్రకారం దూరంగానే ఉండిపోయింది. అయింతే అసెంబ్లీలో జగన్ అంటూ వార్తలు మాత్రం వస్తున్నాయి. ఏమిటి ఇదంతా అంటే అదే తమాషా అని అంటున్నారు.

ఇష్యూ ఏదైనా :

అసెంబ్లీలో ఏ ఇష్యూ మీద చర్చ జరిగినా గత ప్రభుత్వం అంటూ అంతా మాట్లాడుతున్నారు. అదే సమయంలో జగన్ మీద నేరుగానే విమర్శలు చేస్తున్నారు. అది వ్యవసాయం కావచ్చు, జల వనరులు కావచ్చు, సంక్షేమం కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, సినీ పరిశ్రమ అభివృద్ధి కావచ్చు, టూరిజం కావచ్చు, ఫీజు రీయింబర్స్ మెంట్, తల్లికి వందనం మెగా డీఎస్సీ ఇలా ఏ అంశం మీద మాట్లాడినా జగన్ నే నేరుగా నిందిస్తున్నారు. ఒక విధంగా జగన్ సభలో విపక్షం సీట్లో ఆసీనులు అయి ఉన్నారనుకునే ఈ విధంగా మాట్లాడుతున్నారు అనిపిస్తోంది అంటున్నారు.

కౌంటర్ చేసిన బొత్స :

శాసనమండలిలో ఇదే విషయం మీద లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అని మమ్మల్ని ఎంత సేపు విమర్శిస్తారు. మీరు అధికారంలోకి వచ్చి ఏకంగా 16 నెలలు అయింది కదా ప్రభుత్వం చేసేది చెప్పుకోవాలి కానీ ప్రతీ దాని మీద జగన్ ని వైసీపీని విమర్శించడం దేనికి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విపక్షంగా ఆయన తమ వైపు నుండి డిఫెండ్ చేసుకున్నా అధికార పక్షం మాత్రం అదే వైఖరి కొనసాగిస్తోంది అని అంటున్నారు.

ప్లస్ అయ్యేది ఎవరికి :

రాజకీయాల్లో ఒకరి మీద పదే పదే విమర్శలు చేస్తే అది వారికే సానుభూతి తెచ్చిపెడుతుంది అన్నది గతంలో రుజువు అయిన విషయం. వైసీపీ అధినేతను పట్టుకుని సైకో అని మూర్ఖుడని నేరస్థుడు అని ఇలా తమకు తోచిన విధంగా సభ్యులు మాట్లాడడం వల్ల జగన్ మీదనే ఫోకస్ జనాలకు ఎక్కువగా వెళ్తుందని అంటున్నారు. అంతే కాదు ఆయనకు మరో విధంగా ఇది సింపతీ యాంగిల్ లో ప్లస్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు. కానీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అధికార పక్షం వైపు నుంచి ఇదే విషయం ఎక్కువగా మాట్లాడుతున్నారు. దానికి కారణం పెద్దల గుడ్ లుక్స్ లో పడడానికేనా అన్న చర్చ కూడా ఉంది.

జగన్ అన్నది నిజం చేస్తూ :

తాము అసెంబ్లీకి వస్తే మాట్లాడేందుకు కనీసం మైక్ ఇవ్వరని జగన్ తరచూ చెబుతున్నారు. తాము మాట్లాడేందుకు చాన్స్ ఇవ్వకపోతే సభకు వచ్చినా ఏమి లాభం అని ఆయన అంటున్నారు. ఇపుడు చూస్తూంటే జగన్ లేకపోయినా ఆయన మీద విరుచుకుపడుతూ విమర్శలు చేస్తున్న వారు తీరా ఆయనే సభలోకి వచ్చి ఎదురుగా కనబడితే ఇంతకు మరెన్ని విమర్శలు చేస్తారో అన్నది కామన్ మాన్ మనసులో భావం ఏర్పడేలా చేస్తున్నారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా కూటమి పాలన మీద తాము చేసిన అభివృద్ధి మీద ఎంత సేపు అయినా చెప్పుకోవచ్చు కానీ సింగిల్ పాయింట్ అజెండా మాదిరిగా ప్రత్యర్థిని తలుస్తూ విమర్శిస్తూ పోతే జనాల మూడ్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా ఆలోచించాలి అని అంటున్నారు. అంతే కాదు ప్రజలు గత అయిదేళ్ళ వైసీపీ తప్పులకు దారుణంగా శిక్షించేశారు అయినా మేము వైసీపీ బాధితులమని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉందని అంటున్నారు.