Begin typing your search above and press return to search.

'స‌ర్‌'పై.. జ‌గ‌న్ స‌ర్ స్టాండేంటి.. !

సో సర్ ప్రక్రియ కనుక కొనసాగితే.. అది వైసీపీకి నష్టం చేకూరుస్తుందా అనే సందేహాలు ఆ పార్టీలో వ్యక్తమవుతున్నాయి.

By:  Garuda Media   |   9 Dec 2025 7:00 AM IST
స‌ర్‌పై.. జ‌గ‌న్ స‌ర్ స్టాండేంటి.. !
X

కేంద్ర ఎన్నికల సంఘం తీసుకువచ్చిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్..(సర్) ప్రక్రియపై వైసీపీ స్టాండ్ ఏంటి? జగన్ ఏ విధంగా ఈ సర్ ప్రక్రియను చూస్తారు.. అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియ అనేక వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ ప్రక్రియను తీవ్రంగా తప్పుపడుతు న్నాయి. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం, ఎన్నిక‌ల సంఘం కూడా ఈ ప్రక్రియను ముందుకు తీసుకు వెళ్తోంది.

దీనిలో ప్రధానంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ లేదా బిజెపీయేత‌ర‌ పార్టీలు చేస్తున్న వాదన ఏంటంటే బిజెపి వ్యతిరేక పార్టీ లు లేదా బిజెపి ప్రత్యర్థి పార్టీల ఓట్లను ఈ ప్రక్రియ ద్వారా తొలగిస్తున్నారన్నది ప్రధాన ఆరోపణ. దీంతో దేశవ్యాప్తంగా సర్ ప్రక్రియ వివాదంలో చిక్కుకుంది. అయినప్పటికీ ఈ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక రాష్ట్రం విషయానికి వస్తే ఇక్కడ కూడా సర్ ప్రక్రియ త్వరలోనే అధికారికంగా ప్రారంభం కానుంది. ఇక్కడ బిజెపిని వ్యతిరేకించే పార్టీలు ఏవి లేకపోయినా అధికారికంగా చూసుకున్నప్పుడు వైసిపి బిజెపికి దూరంగా ఉంది.

సో సర్ ప్రక్రియ కనుక కొనసాగితే.. అది వైసీపీకి నష్టం చేకూరుస్తుందా అనే సందేహాలు ఆ పార్టీలో వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ సహా అనేక రాష్ట్రాల్లో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ను ఆయా రాష్ట్రాల్లోని విపక్షాలు, అధికార పక్షాలు(స్థానిక పార్టీలు) కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్న క్రమంలో ఇప్పుడు జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు దీనిపై ప్రాధాన్యం సంత‌రించుకుంది. అదేవిధంగా ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.

గతంలో రాహుల్ గాంధీ సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ చేపట్టిన కార్యక్రమాలకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని జగన్ తోసిపచ్చారు. మరి ఇప్పుడు ఏపీలో ఏం చేస్తారు అనేది చూడాలి. ఇదిలా ఉంటే గత ఎన్నికల సమయంలో తాము ఓడిపోవడానికి కారణం ఎన్నికల విధానమే అన్నట్టుగా జగన్ చూచాయగా సంకేతాలు ఇచ్చారు. మరి దీనిని బట్టి ఇప్పుడు ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. కాగా.. త్వ‌ర‌లోనే ఏపీలోనూ స‌ర్ ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంద‌ని తాజాగా కేంద్ర ఎన్నిక‌ల సంఘం తెలిపింది. త‌ద్వారా.. ఓట‌ర్ల జాబితాలు మార్చ‌నున్నారు. దీనికి టీడీపీ, జ‌న‌సేన‌లు ఇప్ప‌టికే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాయి.