జగన్ మీద నెల్లూరు రెడ్ల రీ సౌండ్
జగన్ నెల్లూరు పర్యటన కాదు కానీ సింహపురిలో రీసౌండ్ బాగానే వినిపిస్తోంది. జగన్ నెల్లూరు పర్యటన ఆద్యంతం టెన్షన్ గా సాగింది.
By: Satya P | 31 July 2025 11:21 PM ISTజగన్ నెల్లూరు పర్యటన కాదు కానీ సింహపురిలో రీసౌండ్ బాగానే వినిపిస్తోంది. జగన్ నెల్లూరు పర్యటన ఆద్యంతం టెన్షన్ గా సాగింది. పోలీసులు ఆంక్షల నడుమ జరిగింది. జగన్ ఒకటి కాదు రెండు కార్యక్రమాలు పెట్టుకున్నారు. ఇద్దరు రెడ్లను పరామర్శించారు. ఇకరు జైలులో ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి అయితే రెండు బయట ఉన్న నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. అయితే ఈ పరామర్శల మీద విమర్శలు వెల్లువెత్తున్నాయి.
తప్పు చేసిన వారికా ఓదార్పు :
తప్పు చేసి జైలుకు వెళ్ళింది ఒకరు అయితే మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేసింది మరొకరు అని వీరినా జగన్ పరామర్శించేది అని కూటమి నేతలు విరుచుకుపడుతున్నారు. మరో వైపు చూస్తే నెల్లూరు జిలా పర్యటనకు జగన్ వచ్చారు కాబట్టి నెల్లూరు నుంచే ఆయనకు గట్టి షాకింగ్ రియాక్షన్ వచ్చింది. సీనియర్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జగన్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పర్యటనల మీద కూడా విమర్శలు చేశారు.
భక్తుడి ఘాటు కౌంటర్ :
జగన్ ని బావిలో దూకమంటూ ఒకనాటి వైసీపీ భక్తుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. జగన్ పార్టీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే అయిన కోటం రెడ్డి 2024లో టీడీపీ నుంచి గెలిచారు. ఆయన నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అయితే సమాజం తలదించుకునే వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డికి జగన్ పరామర్శా అని ఫైర్ అయ్యారు. జగన్ పరామర్శతో మరింత తలదించుకునేలా చేశారు అని అన్నారు.
అల్టిమేట్ ఆయనేగా :
మరో వైపు చూస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్ మీద అల్టిమేట్ అన్నట్లుగా ఫైర్ అయ్యారు కాకాణి భాగోతాలను రెండు రోజులలో బయటపెడతాను అన్నారు. జగన్ పరామర్శలకు రావడమేంటి అని సెటైర్లు వేశారు ఇలా ఎవరికి వారుగా నలుగురు రెడ్లూ ఒక్కసారి జగన్ మీద కత్తులు దూశారు మాటల తూటాలు పేల్చారు. అయితే వీరంతా మంత్రి పదవి కోసమే చూస్తున్నారు అని అంటున్నారు. మంత్రి పదవిని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆనం రామనారాయణరెడ్డి ఉంటే మంత్రి కావాలని కోటం రెడ్డి చూస్తున్నారు.
ఇక కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పేరు మంత్రి పదవి రేసులో ఉంది. పైగా ఆమె నల్లపురెడ్డి వర్సెస్ అన్నట్లు రాజకీయం చేస్తున్నారు. ఇక సోమిరెడ్డి అయితే ఈసారి మంత్రి కావాల్సిందే అన్నట్లుగా ఉన్నారు. దాంతో వీరంతా జగన్ నెల్లూరు టూర్ తో బిగ్ సౌండ్ చేస్తున్నారు అని అంటున్నారు. చూడాలి మరి వీరిలో ఎవరికి టీడీపీ అధినాయకత్వం వద్ద మార్కులు పడతాయో.
