అటు జగన్...ఇటు క్యాడర్...మధ్యన పోలీస్ !
ఇదిలా ఉంటే జగన్ పర్యటనల విషయంలో కానీ చూస్తే కనుక ఇప్పటిదాకా జరిగిన వాటిలో క్యాడర్ దూసుకుని వచ్చింది.
By: Satya P | 30 July 2025 6:30 PM ISTవైసీపీ అధినేత మాజీ సీఎం పర్యటనలు అంటే పోలీసులకే తలనొప్పిగా మారుతున్నాయా అన్న చర్చ వస్తోంది. జగన్ టూర్లకు ఆంక్షలు విపరీతమవుతున్నాయి. పైనుంచి ఆదేశాలు ఒత్తిళ్ళు ఉన్నాయని ప్రచారం ఉంది. దాంతో పది మందితో స్వాగతం, ముగ్గురితో ములాఖత్ ఇలా పరిమితులతో నెల్లూరులో జగన్ పర్యటనకు అనుమతులు ఇచ్చారు. అంతే కాదు పార్టీ నాయకులను ఇళ్ళ వద్దనే ఉండాలని ముందస్తు నోటీసులు జారీ చేశారు. జగన్ ఇలా వచ్చామా అలా ములాఖత్ చేశామా వెళ్ళిపోయామా అన్నట్లుగా టూర్ ఉండాలని చెబుతున్నారు
ఇదంతా అయ్యేపనేనా :
ఇదిలా ఉంటే జగన్ పర్యటనల విషయంలో కానీ చూస్తే కనుక ఇప్పటిదాకా జరిగిన వాటిలో క్యాడర్ దూసుకుని వచ్చింది. మధ్యలో జనాలు కూడా చాలా మంది ఎగబడ్డారు. వెరసి తొక్కిసలాట అయింది. అది గుంటూరు మిర్చీ యార్డుతో మొదలెట్టి, తెనాలి, పొదిలి, రెంటపాళ్ళ, బంగారుపాళ్యెం దాకా ఇదే సీన్ కనిపిస్తోంది. ఈ మధ్యలో పోలీసులు ఎన్ని ఆన్స్ఖలు పెట్టినా వచ్చే వారు వస్తూనే ఉన్నారు, జరిగే తొక్కిసలాట జరుగుతూనే ఉంది.
నెల్లూరు టెన్షన్ :
ఇక చూస్తే కనుక జగన్ నెల్లూరు టూర్ ఖరారు అయింది. జగన్ నెల్లూరు పర్యటన మీద ఆంక్షలు ఉన్నాయి. దాని మీద వైసీపీ నేతలు అయితే గుస్సా అవుతున్నారు కేవలం జగన్ పర్యటనల మీదనే ఎందుకు ఈ షరతులు అని మండిపడుతున్నారు. తమ నాయకుడికి అవసరం అయిన సెక్యూరిటీ ఇవ్వకుండా పైగా ఆంక్షలు పెట్టడమేంటి అని కూడా గుస్సా అవుతున్నారు. ఈ ప్రభుత్వం జగన్ విషయంలోనే ఇలా చేస్తోంది అని అంటున్నారు. ఆయన బయటకు రావద్దా ఏ కార్యక్రమంలో పాల్గొనవద్దా అంటోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు పర్యటనలో ఏమి జరుగుతుంది అన్న టెన్షన్ అయితే ఉంది.
సెక్షన్ 30 అమలులో :
ఇక జగన్ పర్యటన నేపధ్యంలో సెక్షన్ 30ని పోలీసులు అమలు చేస్తున్నారు. అంటే గుమిగూడడాలు జనాలు ఎక్కువగా కనిపించడాలు చేయరాదు. అయితే వీటి విషయం ఎలా ఉన్నా తమ పార్టీ వారిని తాము ఏ మాత్రం అదుపు చేయలేమని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ షెడ్యూల్ చూస్తే ముందుగా నెల్లూరు జైలులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని పరామర్శిస్తారు. ఆ తరువాత ఆయన మరో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వచ్చి ఆయనను పరామర్శిస్తారు అని అంటున్నారు.
మొత్తం పోలీస్ సమూహం :
మరో వైపు చూస్తే నెల్లూరులో జగన్ పర్యటన ఉండడంతో జిల్లాలోని మొత్తం పోలీసు బలగాలని నెల్లూరుకు పంపిస్తున్నారు. అంతే కాదు జగన్ హెలిపాడ్ వద్ద అక్కడ నుంచి నెల్లూరు జైలు వద్ద, ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి వద్ద పోలీసులు పెద్ద ఎత్తున మోహరిస్తూ చర్యౌ తీసుకుంటున్నారు. జగన్ పర్యటనలో పోలీసు ఆదేశాలు కచ్చితంగా అమలు అవుతాయని ఏ మాత్రం అతిక్రమించినా చర్యలు చట్టప్రకారం తప్పవని పోలీసులు అంటున్నారు. నిబంధనలు ఆంక్షలు ఉల్లంఘిస్తే కనుక కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడికి నోటీసులు సైతం జారీ చేసినట్లుగా చెబుతున్నారు.
భారీ ఉద్రిక్తతల మధ్యనే :
ఇదిలా ఉంటే జగన్ నెల్లూరు జిల్లా పర్యటన భారీ ఉద్రిక్తలు మధ్యనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు. గత నెలలో ఒకసారి జగన్ పర్యటన వాయిదా పడడంతో క్యాడర్ కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వార్ని తాము అడ్డుకోలేమని వైసీపీ నేతలు చెబుతున్న క్రమంలో జగన్ పర్యటన ఎలా సాగుతుంది అన్నదే చర్చగా ఉంది. ఒక వైపు పోలీసులు ఆంక్షలు గట్టిగానే ఉనాయి. మరో వైపు జగన్ టూర్ లో క్యాడర్ పెద్ద ఎత్తున తరలివస్తే ఏమి జరుగుతుంది అన్న టెన్షన్ తో మొత్తం జిల్లా అంతటా ఆవరించి ఉంది. చూడాలి మరి.
