జగన్ అంతపెద్ద పోస్టు పెట్టినా.. వంద మందికి కూడా చేరలేదు
నాయకుడన్నాక.. ప్రజల మధ్యకు రావాలి. వారితోనే ఉండాలి. ఇది పొలిటికల్‌గా నాయకులు చేయాల్సిన పని.
By: Garuda Media | 4 Aug 2025 5:45 PM ISTనాయకుడన్నాక.. ప్రజల మధ్యకు రావాలి. వారితోనే ఉండాలి. ఇది పొలిటికల్‌గా నాయకులు చేయాల్సిన పని. కానీ.. వైసీపీ అధినేత జగన్.. వ్యవహారం వింతగా ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఆయన ప్రజల మధ్య కు వస్తే.. ఒక పెద్ద ఉపద్రవం వచ్చినట్టు వస్తున్నారు. వివాదాలు, విమర్శలు.. ఘర్షణలకు పెద్దపీట వేస్తు న్నారన్న వాదన.. ప్రజల్లో బలంగా పేరుకుపోయింది. ఇక, ఇంట్లోనే ఉండి కూడా.. ఆయన మీడియా ముందుకు రావడం లేదు. వచ్చినా.. తనదైన శైలిలో మాట్లాడుతున్నారే.. తప్ప.. ప్రజల సమస్యలను పెద్దగా ఫోకస్ చేయడం లేదు.
ఇక, తాజాగా ఆయన మళ్లీ `ఎక్స్`లోనే మాట్లాడుతున్నారు. సుదీర్ఘ పోస్టులు పెడుతున్నారు. రెండు రోజు లు కిందట 14 ప్రశ్నలతో సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అయితే.. దీనిని ఎంత మంది వీక్షించా రు? ఎంత మంది చదవారు? అంటే.. పట్టుమని 100 మంది కూడా లేరు. అంటే.. జగన్ అంతపెద్ద పోస్టు పెట్టినా.. వంద మందికి కూడా చేరలేదు. దీంతో ఆయన ప్రయత్నం ప్రయాసగానే మారిపోయింది. దీనివల్ల ప్రయోజనం లేదన్నది సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు.
ప్రజల మధ్యకు రావాలి. వారి వాదన వినాలి. వారి సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఎక్కడో పనులు చేసుకునేవారు.. పిట్ట పలుకులు ఏమేరకు వింటారు? ఏమేరకు చదువుతారు? అనేది కీలక నేత లు కూడా చెబుతున్నారు. ఒకవేళ బయటకు రావడం ఇబ్బందిఅయితే.. రెండు రోజులకు ఒకసారి తన సొంత మీడియాలోనే ఆయన మాట్లాడే అవకాశం ఉంది. అయినా.. జగన్ దానిని ఎప్పుడూ వినియోగించు కున్న సందర్భాలు లేనే లేవు. సీఎంగా, టీడీపీ అధినేతగా చంద్రబాబు తనకంటూ సొంత మీడియా లేకపోయినా.. మీడియాను వినియోగించుకునే విషయంలో దిట్ట.
మరి సొంత మీడియా ఉండి కూడా.. జగన్ ఎందుకు వెనుకబడుతున్నారన్నది ప్రశ్న. పైగా.. ఆయన ఈ ఎక్స్‌నే నమ్ముకుంటే.. ప్రజలకు చేరువ కాకపోగా.. ప్రత్యర్థుల దూకుడు ముందు అవి విఫలం కూడా అవుతున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. సో.. మొత్తంగా జగన్ వ్యవహార శైలి మారాల్సిన అవసరం ఉందన్నది పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఆయన తన పద్ధతి మార్చుకుని ప్రజలకు చేరువ కాకపోతే.. ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మరి వీటిని ఆయన ఎలా చూస్తారో చూడాలి. చిత్రం ఏంటంటే.. ఇప్పటికీ జగన్ మారలేదన్న టాక్ పార్టీలోనే వినిపిస్తోంది.
