Begin typing your search above and press return to search.

హీటెక్కిన వేళ జగన్ దూరంగా ఎక్కడో !

కల్తీ మద్యం మీద వైసీపీ చేస్తున్న ఆరోపణలలోనే కల్తీ ఉందని టీడీపీ అంటోంది. అంతా వైసీపీయే దీని వెనక ఉందని చెబుతోంది.

By:  Satya P   |   14 Oct 2025 9:35 AM IST
హీటెక్కిన వేళ జగన్ దూరంగా ఎక్కడో !
X

ఏపీ రాజకీయం ప్రస్తుతం హీటిక్కిపోతోంది. ఒక వైపు చూస్తే కల్తీ లిక్కర్ మీద వాడి వేడిగా డిబేట్లు సాగుతున్నాయి. నిన్నటి దాకా టీడీపీ మీద నిందలేసిన వైసీపీకి ఇపుడు మీదే తప్పు అని టీడీపీ నుంచి సరైన కౌంటర్ రావడం దానికి నిందితుడు జనార్ధనరావు వీడియో క్లిప్ ఆధారం కావడంతో జోరు చేస్తోంది. కల్తీ లిక్కర్ స్కాం లో సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన వైసీపీ ఇపుడు డిఫెన్స్ లో పడినట్లు అయింది. మాజీ మంత్రి జోగి రమేష్ ఈ మొత్తం ఇష్యూ నకిలీ మద్యం విషయంలో ఉన్నారని ఈ వీడియో క్లిప్ ద్వారా బయటపడింది అని టీడీపీ అంటోంది. వైసీపీని పూర్తిగా కార్నర్ చేస్తోంది. ఒక విధంగా వైసీపీకి ఇది ఇరకాటంగా మారింది.

కీలక సమయంలో అలా :

ఏపీలో ఇంతటి కీలకమైన రాజకీయం సాగుతున్న వేళ వైఎస్ జగన్ దూరంగా విదేశాలలో ఉన్నారు. అఫ్ కోర్స్ ఆయన ముందే నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం లండన్ టూర్ పెట్టుకున్నారు అనుకోండి. కానీ ఏపీలో ఇపుడు టఫ్ ఆఫ్ వార్ గా వ్యవహారం సాగుతోంది కల్తీ మద్యం విషయంలో వైసీపీ ఆరోపణలను తుత్తునియలు చేస్తూ టీడీపీ దూకుడు చేస్తోంది సిట్ ని ఒక వైపు ఏర్పాటు చేయడమే కాకుండా మరో వైపు వైసీపీ మాజీ మంత్రి దీని వెనక ఉన్నారని నిందితుడు జనార్ధనరావు ఇచ్చిన ఆధారాలతో ఆరోపిస్తోంది. దాంతో వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి.

జోరు చేయాల్సిన చోట :

కల్తీ మద్యం మీద వైసీపీ చేస్తున్న ఆరోపణలలోనే కల్తీ ఉందని టీడీపీ అంటోంది. అంతా వైసీపీయే దీని వెనక ఉందని చెబుతోంది. మరి ఇంతలా ఈ ఇష్యూలో వైసీపీ విమర్శలు బూమరాంగ్ అవుతున్న వేళ వైసీపీ కౌంటర్ యాక్షన్ ప్లాన్ ని రూపొందించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో విపక్ష నేత జగన్ రాష్ట్రంలో ఉంటే వేరేగా వైసీపీ యాక్షన్ ఉండొచ్చు కదా అన్నది కూడా ఉంది. కానీ వైసీపీ అధినేత సరైన సమయంలో లేకుండా పోయారు అన్నది కూడా పార్టీ వర్గాలలో వినిపిస్తున్న మాట.

అప్పటికి ఏమవుతుందో :

జగన్ ఈ నెల 23 తరువాత కానీ ఏపీకి రారు. ఈలోగా ఈ ఇష్యూలో జరగాల్సినవి అన్నీ జరిగిపోతాయని అంటున్నారు. అంతే కాదు వైసీపీ గత కొన్ని రోజులుగా సాధించిన అప్పర్ హ్యాండ్ ఇపుడు హఠాత్తుగా చేతులు మారింది. టీడీపీ తన సౌండ్ పెంచేసింది. నిందితుడు జనార్ధన రావు ఆరోపణలకు జోగి రమేష్ ఖండిస్తూ వివరణ ఇచ్చారు. సవాల్ కూడా చేస్తున్నారు అయితే ఇదంతా డిఫెన్స్ మెకానిజం కిందకే వస్తుంది. అఫెన్స్ మోడ్ లో ఉండాల్సిన వైసీపీ రెండు రోజుల తేడాలో ఇలా డిఫెన్స్ లో పడిపోవడం సమయానికి అధినేత కూడా దేశంలో లేకపోవడం ఒక విధంగా వైసీపీ డీలా పడేలాగానే ఉన్నాయని అంటున్నారు. ఏది ఏమైనా విపక్షాలకు అవకాశాలు వచ్చినపుడు వాడుకోవాలి. అదే సమయంలో తమ మీద నిందలు పడకుండా పడినా అవి నిజాలు కావని నిరూపించుకునేలా మెకానిజం ఉండాలి, ఎత్తులు పై ఎత్తులు కూడా అవసరం అయిన వేళ కీలక అంశాలను కూడా లైట్ తీసుకునేలా వ్యవహరిస్తే మాత్రం పార్టీ సీరియస్ ఇష్యూస్ ని ఎన్ని టేకప్ చేసినా అవి ఎక్కడో అక్కడ తేలిపోతాయనే అంటున్నారు.