Begin typing your search above and press return to search.

జగన్ షర్మిల మధ్యలో యలహంక ప్యాలెస్‌ !

ఇదిలా ఉంటే యలహంక ప్యాలెస్‌ లో షర్మిలకూ భాగం ఉంది అంటున్నారు. అందుకే ఆమె తన కుమార్తె వివాహాన్ని అక్కడ చేయాలని తలపెట్టింది అని అంటున్నారు.

By:  Satya P   |   23 Oct 2026 12:02 AM IST
జగన్ షర్మిల మధ్యలో యలహంక ప్యాలెస్‌ !
X

ఏమిటీ యలహంక ప్యాలెస్‌, జగన్ షర్మిల మధ్యలో ఎందుకు ఈ ప్యాలెస్ వచ్చింది. ఏమా కధ, అసలు ఏమిటి మ్యాటర్ అంటే చాలానే ఉంది. యలహంక ప్యాలెస్‌ అంటే జగన్ గుర్తుకు వస్తారు. గతంలో లోటస్ పాండ్ అంటే జగన్ అనేవారు. అది హైదరాబాద్ లో ఉంటే ఇది బెంగళూర్ లో ఉంది. ఇక జగన్ 2024లో ఓటమి తరువాత నివసించేది యలహంక ప్యాలెస్‌ లోనే. వారంలో నాలుగు రోజుల పాటు ఏపీలో తాడేపల్లికి జగన్ వస్తారు అన్నది తెలిసిందే. ఇవన్నీ పక్కన పెడితే ఈ యలహంక ప్యాలెస్‌ తోనే అన్నా చెల్లెళ్ళ మధ్య కొత్త వివాదం చెలరేగిందా అన్నది ఇపుడు సాగుతున్న ప్రచారంగా ఉంది.

కూతురు పెళ్ళి కోసం :

ఇదిలా ఉంటే యలహంక ప్యాలెస్‌ లో షర్మిలకూ భాగం ఉంది అంటున్నారు. అందుకే ఆమె తన కుమార్తె వివాహాన్ని అక్కడ చేయాలని తలపెట్టింది అని అంటున్నారు. అయితే దీని మీద జగన్ కి అది ఇష్టం లేదని అందుకే వద్దు అని చెల్లెలుకు చెప్పారని రకరకాలైన కధనాలు సోషల్ మీడియాలోనూ అలాగే టీడీపీ అనుకూల మీడియాలోనూ పెద్ద ఎత్తున వస్తున్నాయి. జగన్ షర్మిల మధ్యలో యలహంక ప్యాలెస్‌ అన్నది నిజమే కానీ మొత్తం మ్యాటర్ మాత్రం సోషల్ మీడియాలో కధనాల మాదిరి కాదని అంటున్నారు. నిజానికి చూస్తే ఈ కధనాలు అన్నీ చెల్లెలుకు అన్న జగన్ అన్యాయం చేస్తున్నారు అని చిత్రీకరిస్తూ వస్తున్నాయి. తన కుమార్తె అంజ్లీరెడ్డి వివాహాన్ని యలహంక ప్యాలెస్‌ లో చేయాలని అనుకుంటే వద్దు అని జగన్ తీవ్రంగా వ్యతిరేకించారు అన్న ఈ కధనాలు నిజం కాదని అంటున్నారు.

షర్మిలకు జగన్ లేఖ :

ఇదిలాఉంటే ఈ తరహా కధనాలలో కొంత వాస్తవం ఏమిటి అంటే యలహంక ప్యాలెస్‌ లో మేనకోడలు వివాహానికి జగన్ నో చెప్పడం. అయితే దానికి ఉన్న అసలైన కారణాలు ఏమిటి అన్నది వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. యలహంక ప్యాలెస్‌ లో మేనకోడలి వివాహం భద్రాతపరమైన కారణాల వల్లనే వద్దు అని చెబుతున్నట్లుగా జగన్ రెండు వారాల క్రితమే షర్మిలకు లేఖ రాశారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. పెళ్ళి జరిగితే అక్కడకు పెద్ద ఎత్తున ప్రజల రాకపోకలు ఉంటాయని, ఇక యలహంక ప్యాలెస్‌ ప్రాంగణానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు బయటకు రావడం వల్ల తనకు భద్రతా పరమైన ముప్పు ఏర్పడవచ్చన్న ఆందోళనను జగన్ ఆ లేఖలో వ్యక్తం చేశారు అని అంటున్నారు.

వేరే వేదిక కోసం :

అందువల్ల మేనకోడలు వివాహానికి వేరే వేదికను ఎంచుకోవలని జగన్ అక్టోబర్ 9న షర్మిలకు రాసిన లేఖలో స్పష్టం చేశారు అని అంటున్నారు. భారీ స్థాయిలో వివాహ వేడుకలు జరిగితే క్యాటరింగ్ సిబ్బంది, అలంకరణ బృందాలు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సిబ్బంది, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఎంతో మంది అతిథులు ఇలా అనేక రకాలైన జనాలు ఆ ప్రాంగణంలోకి వచ్చి వెళ్లాల్సి ఉంటుందని జగన్ చెల్లెలుకు గుర్తు చేశారని అంటున్నారు. ఇక ఇలా వచ్చి వెళ్లే వారిలో చాలామంది కుటుంబానికి తెలియని వ్యక్తులు కావడంతో ప్యాలెస్ దాని పరిసర ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బయటకు రావడం తీవ్రమైన భద్రతా ముప్పులకు దారితీయవచ్చని జగన్ ఆ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారని చెబుతున్నారు.

భద్రతాపరంగానే :

కేవలం భద్రతా పరంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా జగన్ షర్మిలకు రాసిన లేఖలో పేర్కొన్నారు అని అంటున్నారు. మేన కోడలు అంజలి రెడ్డి యలహంక ప్యాలెస్‌లోనే పెరగడాన్ని తాను చూశానని ఆమెకు అంతా మంచి జరగాలని మాత్రమే తాను కోరుకుంటున్నాను అని జగన్ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, భద్రత గోప్యతకు సంబంధించిన అంశాలను విస్మరించలేం అని ఆయన స్పష్టం చేశారు. రేపటి రోజున తన కుమార్తెలు హర్ష వర్షల విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంటే తాను కూడా ఇలాగే వ్యవహరించేవాడినని జగన్ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం తాను ఈ ప్రాంగణంలోనే నివసిస్తున్నానని ఇంత భారీ స్థాయిలో కార్యక్రమం జరిగితే అనవసరమైన వారి దృష్టిని ఆకర్షించడమే కాకుండా తనకు భద్రతా పరమైన సమస్యలు కూడా తలెత్తుతాయని ఆ లేఖలో చెల్లెలుకు వివరించినట్లుగా చెబుతున్నారు.

ప్రాధాన్యత అదే :

అంతే కాదు యలహంక ప్యాలెస్‌ ప్రాంగణం తన నివాసమని తన భద్రత తన కుటుంబ సభ్యుల భద్రతను కాపాడుకోవడమే తన ప్రాధాన్యత అని జగన్ షర్మిలకు స్పష్టం చేశారని అంటున్నారు. వివిధ వ్యక్తుల ద్వారా వాస్తవమైన గోప్యత భద్రతాపరమైన ప్రమాదాల గురించి తెలియజేసినప్పటికీ షర్మిల తన అభ్యంతరాలను ఆందోళనలను పట్టించుకోకుండా ముందుకు సాగడం తనను బాధించిందని జగన్ అన్నారని వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన ఆలోచనలను అర్థం చేసుకోవాలని ఆయన షర్మిలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. అంతే కాదు వివాహాన్ని మరో వేదికకు మార్చాలని సూచించారు. అంతే కాదు ప్రత్యామ్నాయంగా తన హైదరాబాద్ లోటస్ పాండ్ ఆస్తిని వాడుకోవడానికి జగన్ ప్రతిపాదించారని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ భద్రత కారణాల వల్లనే యలహంక ప్యాలెస్‌ లో వివాహం వద్దు అంటున్నారని చెబుతున్నారు. మరి నవంబర్ 25న షర్మిల కుమార్తె వివాహం ఎక్కడ జరుగుతుంది, వేదిక ఏమిటి అన్నది చూడాల్సి ఉంది.