Begin typing your search above and press return to search.

జగన్ మకాం ...కడపలో కొత్త రాజకీయం

అలాగే క్యాడర్ కి పార్టీని నెగ్గించాలని ఉంది కానీ అధినాయకత్వం తమను పట్టించుకోవడం లేదు అన్న బాధ ఉంది. ఈ గ్యాప్ ని తగ్గించుకుంటేనే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లు అని అంటున్నారు.

By:  Satya P   |   25 Nov 2025 6:00 AM IST
జగన్  మకాం ...కడపలో కొత్త రాజకీయం
X

వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడప నుంచే నరుక్కు రావాలని చూస్తున్నారు. మొత్తం పది అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 2024 ఎన్నికల్లో ఏకంగా ఆరు సీట్లు వైసీపీ కోల్పోయింది. దాంతో పాటుగా ఇటీవల జరిగిన పులి వెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సైతం వైసీపీకి డిపాజిట్ పోయింది. ఈ పరిణామాలు వైఎస్సార్ అభిమానులను తీవ్ర కలవరపాటుకు గురి చేశాయి. వైఎస్సార్ ఫ్యామిలీ మీద అభిమానం ఉంది. అలాగే క్యాడర్ కి పార్టీని నెగ్గించాలని ఉంది కానీ అధినాయకత్వం తమను పట్టించుకోవడం లేదు అన్న బాధ ఉంది. ఈ గ్యాప్ ని తగ్గించుకుంటేనే వైసీపీకి మంచి రోజులు వచ్చినట్లు అని అంటున్నారు.

మూడు రోజుల క్యాంప్ :

ఈ నేపధ్యంలో జగన్ మూడు రోజుల పాటు పులివెందులలో మకాం వేశారు. ఆయన పులివెందులలోని భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో క్యాడర్ కి ప్రజలకు పూర్తిగా అందుబాటులోకి వచ్చారు నిజానికి జగన్ పులివెందుల ఈ మధ్య కాలంలో పెద్దగా వస్తున్నది లేదు, తండ్రి వైఎస్సార్ జయంతి వర్ధంతులకు వస్తున్నారు. అలాగే క్రిస్మస్ వేడుకలకు హాజరవుతున్నారు కానీ తన సొంత నియోజకవర్గం సొంత జిల్లాకు ఆయన పెద్దగా రావడం లేదు అన్న చర్చ ఉంది. దానిని భర్తీ చేయడానికి అన్నట్లుగా జగన్ పులివెందులలో ఈసారి ఏకంగా మూడు రోజుల పాటు గడుపుతున్నారు.

మొత్తం ఫోకస్ :

ఇదిలా ఉంటే ఈ పర్యటనలో ప్రజలతో మమేకం కావడం క్యాడర్ కి భరోసా ఇవ్వడమే కాకుండా పార్టీ పరంగా చేయాల్సిన రిపేర్లు ఆయన చేస్తారు అని అంటున్నారు ఇప్పటికే జమ్మలమడుగు ఇంచార్జిగా ఎమ్మెల్సీ రామసుబారెడ్డిని నియమించారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారు. మరో వైపు మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డికి మరింత ఎక్కువగా బాధ్యతలు ఇవ్వనున్నారు అని అంటున్నారు. అలాగే తన కుటుంబానికే చెందిన ఒకరికి పులివెందుల బాధ్యతలు అప్పగిస్తారు అని వినిపిస్తోంది. ఇక కడప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి మీద భారాలను బాగా తగ్గిస్తారు అని అంటున్నారు.

కడప ఎంపీ సీటు పరిధిలో :

వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కసరత్తు సాగుతోంది అని అంటున్నారు. కడప ఎంపీ సీటు మీద కూడా జగన్ ఈసారి కొత్త ఆలోచనలు చేస్తారు అని అంటున్నారు అవినాష్ రెడ్డి సేవలను ఎలా ఉపయోగించుకుంటారు అన్నది కూడా ఆలోచిస్తారు అని అంటున్నారు. ఇంకో వైపు ఇతర అసెంబ్లీ నియోజకవర్గాలలో కూడా భారీ మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు మొత్తం మీద చూస్తే పోయిన చోట వెతుక్కోవాలని సామెత ఉంది. రాజకీయాలకు ఆ సామెత బాగా పనికి వస్తుంది. జగన్ కూడా అదే పని చేస్తున్నారు అని అంటున్నారు. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలని అనుకుంటున్నారు. ఇప్పటిదాకా అవినాష్ రెడ్డి మీద ఎక్కువగా ఆధారపడ్డారు అని అంటున్నారు. ఫ్యూచర్ లో అలా కాకుండా మరిన్ని కొత్త నాయకత్వాలని ప్రోత్సహించాలని చూస్తున్నారు. మరీ ముఖ్యంగా వైఎస్సార్ ఫ్యామిలీకి ప్రజలకు క్యాడర్ కి ఎక్కడా గ్యాప్ లేకుండా చూసుకోవడం కోసం పార్టీ యంత్రాంగాన్ని ఆ దిశగా తీర్చిదిద్దుతారని అంటున్నారు. చూడాలి మరి జగన్ పులివెందుల పర్యటన తరువాత ఏ కీలక నిర్ణయాలు వెలువడతాయో.