జగన్ లో ఇంత అనూహ్య మార్పు వెనక మ్యాటర్ ఏంటి... ?
దీనిపై జగన్ ఇంకా అంతర్మథనం చెందుతూనే ఉన్నారు. మనం ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఎన్నో మేలు చేశామని అయినా గత ఎన్నికల్లో వారు ఆదరించలేదనేది జగన్ మరోసారి చెప్పుకొచ్చారు.
By: Garuda Media | 31 July 2025 2:00 AM ISTరాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు తామే అండగా ఉన్నామని తామే కేరాఫ్ గా నిలిచామని పదే పదే చెప్పుకున్న వైసిపి అధినేత జగన్ తాజాగా ఈ విషయాన్ని పక్కన పెట్టారని తెలుస్తోంది. సాధారణంగా గత ఐదు సంవత్సరాల పరిపాలనను పరిగణలోకి తీసుకుంటే జగన్ ఎక్కడ ఎప్పుడు మాట్లాడినా.. ఏ సందర్భం వచ్చినా 'నా.. ఎస్సీ నా ఎస్టి నా మైనారిటీ' అంటూ ప్రసంగాలు దంచి కొట్టిన విషయం తెలిసిందే. ఒక ప్రసంగాల్లోనే కాదు పనులు కూడా అలాగే చేశారు. అయితే అనూహ్యంగా గత ఎన్నికల్లో వచ్చిన వ్యతిరేక ఫలితంతో పాటు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గంలోనూ ఆశించిన విధంగా వైసీపీ పుంజుకోలేకపోయింది.
దీనిపై జగన్ ఇంకా అంతర్మథనం చెందుతూనే ఉన్నారు. మనం ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ఎన్నో మేలు చేశామని అయినా గత ఎన్నికల్లో వారు ఆదరించలేదనేది జగన్ మరోసారి చెప్పుకొచ్చారు. పార్టీ పీఏసీ సమావేశంలో ప్రభుత్వంపై నిప్పులు జరుగుతూనే పోలీసులను విమర్శిస్తూనే అంతర్గతంగా గత ఎన్నికల్లో జరిగిన పరిణామాలను జగన్ ప్రస్తావిస్తూ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలను మాత్రమే మనం నమ్ముకున్నామని తద్వారా కొన్ని వర్గాలు దూరం అయ్యాయని ఇకనుంచి అటువంటి విధానాన్ని పక్కనపెట్టి భవిష్యత్తు అంతా అందరినీ కలుపుకుని పోయేలాగా ముందుకు సాగుదాం అని ఆయన సూచించారు.
ఇది మెరుగైన సూచన. మేలిమి సూచన అనే చెప్పాలి. ఎందుకంటే కొన్ని వర్గాలకే పరిమితం కావడం కొందరిని వెనకేసుకు రావడం అనేది ఏ రాజకీయ పార్టీకి కూడా మంచిది కాదు. అన్ని వర్గాలను సమానంగా చూస్తూ ఒకటి రెండు సామాజిక వర్గాలను కొంతమేరకు హెల్ప్ చేసినా ఇబ్బంది ఉండేది కాదు. కానీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నామైనారిటీ అంటూ జగన్ చేసిన హడావిడి ఫలితంగా అటూ రెడ్లు ఇటు ఇతర సామాజిక వర్గాలు కూడా పార్టీకి, వ్యక్తిగతంగా జగన్‌కు దూరమయ్యాయి. ఇది గత ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించింది. అందరూ కలిసి వచ్చి ఓట్లు వేస్తేనే ఎవరైనా అధికారంలోకి వస్తారు.
ఈ విషయాన్ని నెమ్మదిగా గ్రహించిన జగన్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని పోయేలాగా, ఎవరిని దూరంపెట్టేలాగా వ్యవహరించకుండా నాయకులు ముందుకు సాగాలని ఆయన చెప్పుకొచ్చారు. వాస్తవానికి నాయకులు అందరిని కలుపుకునే వెళ్తున్నారు. ఇటు వచ్చి అధిష్టానం దగ్గరే తేడా కొట్టింది. ఇప్పుడు ఆ మార్పు దిశగా జగన్ అడుగులు వేసేందుకు సిద్ధమయ్యారు.
కాబట్టి భవిష్యత్తులో కోల్పోయిన ఓటు బ్యాంకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా ఉండదా అనేది ఆయన వ్యవహరించే శైలి తీరును బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది. ప్రధానంగా కమ్మ కాపు సామాజిక వర్గాల్లో వైసిపి పట్ల ఏర్పడిన వ్యతిరేకతను సాధ్యమైనంత వరకు తగ్గించడం ద్వారా మాత్రమే జగన్ పుంజుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు తప్పవు.
