Begin typing your search above and press return to search.

అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?

స్థానిక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్, బీజేపీ నుంచి కూడా వైసీపీకి గట్టి పోటీ ఎదురైంది. ప్రశాంతంగా ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లోనూ పార్టీ ప్రభావం కనిపించలేదు. కీలక నేతల వారసులు ఓడిపోవడం, జగన్ సొంత చిన్నమ్మ కూడా గెలవకపోవడంతో వైసీపీ గ్రాఫ్ మరింత పడిపోయిందనే అభిప్రాయం సొంత నేతల్లోనే వ్యక్తమవుతోంది.

By:  Garuda Media   |   5 Nov 2026 11:55 AM IST
అసెంబ్లీ కంటే ఘోర‌మా.. జ‌గ‌న్‌.. నెక్ట్స్ ఏంటి.. ?
X

వైసీపీ ప‌రిస్థితి అసెంబ్లీ ఎన్నిక‌ల కంటే కూడా ఘోర‌మా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తాజాగా స్థానిక ఎన్నిక‌ల కు సంబంధించిన పూర్తిస్థాయి ఫ‌లితం వ‌చ్చేసింది. దీనిలో ఏమాత్రం పెద్ద‌గా ఓటు బ్యాంకు కూడా లేని కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన వారికి కూడా వ‌చ్చిన ఓట్లు వైసీపీ అభ్య‌ర్థులకు కొన్ని కొన్ని చోట్ల ప‌డ‌లేద‌న్న‌ది వాస్త‌వం. ఇక‌, కేవ‌లం 2 శాతం లోపు ఓటు బ్యాంకు మాత్ర‌మే ఉన్న బీజేపీ కూడా వైసీపీ కంటే కూడా బెటైర్ అనే రేంజ్‌లోనే పెర్ఫార్మెన్స్‌ను ప్ర‌ద‌ర్శించింది.

ఒక‌ర‌కంగా చెప్పాలంటే.. బీజేపీకి వ‌చ్చిన స్థానాల‌తో పోల్చుకుంటే.. వైసీపీకి ఒక స్థానం త‌క్కువ‌గానే వ‌చ్చింది. ఈ ప‌రిణామాల‌ను తేలిక‌గానో.. లేక‌.. కూట‌మి స‌ర్కారు ఏదో చేసింద‌నో అనుకుంటే వైసీపీకి మొత్తానికే మోసం జ‌రిగే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. క్షేత్ర‌స్థాయిలో నామినేష‌న్ల ఘ‌ట్టంలో కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదుర య్యాయి. దీనిని ఎవ‌రూ కాద‌న‌రు. కానీ, ప్ర‌శాంతంగా నామినేష‌న్లు, ప్ర‌చారం కూడా జ‌రిగిన ఉత్త‌రాంధ్ర‌, తూర్పు, విజ‌య‌వాడ‌, ప‌శ్చిమ గోదావ‌రి వంటి జిల్లాల్లోనూ వైసీపీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది.

ఒక‌ప్పుడు చొక్కా ఎగ‌రేసిన శ్రీకాకుళం వంటి జిల్లాల్లోనూ కీల‌క నాయ‌కులు అదుపు త‌ప్పారు. పార్టీ చెప్పింది ఒక‌టై తే.. అంతర్గతంగా చేసుకున్న‌ది మ‌రొక‌టి. అయితే.. ఎక్క‌డా కూడా వైసీపీ పుంజుకున్న ప‌రిస్థితి క‌నిపించ‌లేదు. పూర్తిస్థాయిలో ఫ‌లితం క‌ళ్ల‌ముందుకు వ‌చ్చేసిన త‌ర్వాత‌. వైసీపీ నాయ‌కుల‌కు కూడా ఏమీ చెప్ప‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. కీల‌క నాయ‌కుల వార‌సులు కూడా గెలుపు గుర్రం ఎక్క‌లేక పోవ‌డం, జ‌గ‌న్ త‌న సొంత చిన్న‌మ్మ‌ను కూడా గెలిపించుకోలేక పోవ‌డం.. వంటివి ఈ ఎన్నిక‌ల్లో అసెంబ్లీని మించిన పోరును త‌ల‌పించేలా చేసింది.

ఇది ఒక ర‌కంగా జ‌గ‌న్‌కు మ‌నుట‌యా.. లేక‌.. అన్న‌ట్టుగానే ప‌రిస్థితిని మార్చేసింది. ఇప్పటికిప్పుడు పార్టీని సంస్క‌రి స్తారా? ల‌ఏక స‌మ‌యం తీసుకుంటారా? అనేది ప్ర‌శ్న‌. కానీ, ఏం చేసినా.. పార్టీ ప‌రంగా పుంజుకునేందుకు ఆయ‌న ప్ర‌య‌త్నాలు చేయాల‌న్న‌ది మెజారిటీ నాయ‌కుల మాట‌. ఇక‌, సుదీర్ఘ‌కాలంగా రాజ‌కీయాల్లో ఉన్న‌వారు కూడా తాజా ఎన్నిక‌ల వేళ చేతులు ఎత్తేయ‌డం.. స‌హ‌కారం చేయ‌కుండా వ్య‌వ‌హ‌రించ‌డం కూడా వైసీపీని డోలాయ‌మానంలోకి నెట్టాయి. ఎలా చూసుకున్నా.. గ‌త అసెంబ్లీ ఫ‌లితాల‌తో పోల్చి చూసుకుంటే వైసీపీ గ్రాఫ్ త‌గ్గింద‌న్న అభిప్రాయం సొంత నేత‌ల్లోనే వినిపిస్తోంది.