Begin typing your search above and press return to search.

కాక్రోచ్ లతో జగన్... వైసీపీ బిగ్ ట్విస్ట్ !

కాక్రోచ్ జనతా పార్టీ. దీనిని కేరాఫ్ జెన్ జీ గా కూడా పిలుస్తున్నారు. జెన్ జీ అంతా సీజేపీ వెనకాల ఉన్నారా లేరా అన్నది పక్కన పెడితే జంతర్ మంతర్ వద్ద అతి పెద్ద ఉద్యమం నడిపి కేంద్ర మంత్రిని రాజీనామా చేయించిన సక్సెస్ రికార్డుని సీజేపీ సొంతం చేసుకుంది

By:  Satya P   |   15 Oct 2026 7:19 PM IST
కాక్రోచ్ లతో జగన్... వైసీపీ బిగ్ ట్విస్ట్ !
X

కాక్రోచ్ జనతా పార్టీ. దీనిని కేరాఫ్ జెన్ జీ గా కూడా పిలుస్తున్నారు. జెన్ జీ అంతా సీజేపీ వెనకాల ఉన్నారా లేరా అన్నది పక్కన పెడితే జంతర్ మంతర్ వద్ద అతి పెద్ద ఉద్యమం నడిపి కేంద్ర మంత్రిని రాజీనామా చేయించిన సక్సెస్ రికార్డుని సీజేపీ సొంతం చేసుకుంది. దాంతోనే సీజేపీకి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక దేశంలోని రాజకీయ పార్టీలు అన్నీ కూడా సీజేపీకి మద్దతుగా నిలిచేందుకు ఆరాటపడుతున్న నేపథ్యం కనిపిస్తోంది. లేటెస్ట్ గా చూసుకుంటే కనుక సీజేపీ నేతల అరెస్టుని రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీలు ఖండించాయి. తెలంగాణాలో బీఆర్ఎస్ దీని మీద ట్వీట్ చేస్తే ఏపీ నుంచి వైసీపీ కూడా ట్వీట్ చేసింది. అలా సీజేపీ పట్ల సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించారు. దానికి ప్రతిగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నుంచి రీ ట్వీట్ తో థాంక్స్ అన్న స్పందన వచ్చింది.

సీజేపీ ఎంట్రీ :

దాంతో సీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంట్రీ ఇస్తుందా అన్న చర్చ మొదలైంది. మరో వైపు చూస్తే ఈ మధ్యన తరచుగా వైసీపీ అధినేత జగన్ అవసరం అయితే తాను కూడా కాక్రోచ్ అవుతాను అని ప్రకటనలు ఇచ్చారు. జెన్ జీల గురించి కూడా ఆయన తరచూ మాట్లాడుతూ వచ్చారు. ఇపుడు ఓపెన్ గా సీజేపీ నేతల అరెస్టులను తప్పుపడుతూ వారికి మద్దతుగా ట్వీట్ చేశారు. దీంతో సీజేపీ నుంచి సానుకూల రిప్లై రావడంతో ఉత్తరాదిన తమ కార్యక్రమాలను నిర్వహిస్తున్న సీజేపీ రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఫోకస్ పెడతాయా అన్నది అంతా విశ్లేషిస్తున్నారు. ఇక జగన్ సీజేపీ నేతల అరెస్టులు ఖండించడం, ఆయనతో సీజేపీ నేతలు ఉండడం వంటి పరిణామాలు ఏపీ రాజకీయాలలో కొత్త మలుపును తీసుకుని వస్తాయా అన్నది కూడా చర్చిస్తున్నారు.

బీజేపీ ఫైర్ :

సీజేపీకి మద్దతుగా జగన్ ట్వీట్, దానికి సీజేపీ నుంచి రిప్లై ఇవన్నీ కూడా ఏపీలో బీజేపీని ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అయితే జగన్ తీరు మీద విరుచుకుపడ్డారు. జగన్ తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసమే విచ్ఛిన్నకర శక్తులతో చేతులు కలుపుతున్నారని తీవ్ర వ్యాఖ్యలే చేశారు. అలాగే జగన్ తో కలసి ముందుకు అడుగులు వేయాలని చూస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ అజెండా ఏమిటి అన్నది ప్రజలు అర్ధం చేసుకుంటారు అని మాధవ్ విమర్శించారు. వైసీపీ అధికారంలో ఉన్నపుడు అయిదేళ్ళూ జగన్ చేసిన పాలనను జనాలు మరచిపోలేదని ఇబ్బందులు కూడా పడ్డారని ఆయన గుర్తు చేస్తూ జనాలు మళ్లీ వైసీపీకి గుణపాఠం చెబుతారు అన్నారు.

ఓడితే ఈసీదే తప్పు :

జగన్ వైఖరి ని బీజేపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా తప్పు పట్టారు. ఓడితే ఈసీదే తప్పు అన్నట్లుగా జగన్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల సమయంలో జగన్ 151 సీట్లు గెలుచుకున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. 2024లో ఓడగానే ఈసీ మీద విమర్శలు చేస్తున్నారు అని అన్నారు. ఆనాడూ ఈనాడూ అదే కేంద్రం అదే ఈసీ ఉన్నాయని జగన్ తెలుసుకోవాలని ఆయన సెటైర్లు వేశారు. మొత్తం మీద చూస్తే సీజేపీతో జగన్ కలుస్తున్నారా లేదా అన్నది పక్కన పెడితే వారికి మద్దతుగా ట్వీట్ చేయడం ఏపీ రాజకీయాల్లో అతి పెద్ద చర్చకు తావిస్తోంది. కాక్రోచ్ లతో కలసి ఏపీలో వైసీపీ ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.