Begin typing your search above and press return to search.

అసెంబ్లీకి జగన్...మళ్ళీ అదే మాట !

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వస్తారు అని ఈ మధ్య దాకా ప్రచారం సాగింది. ఆయన ఈ నెల మూడవ వారంలో జరిగే వర్షాకాల సమావేశాలకు హారై ప్రజా సమస్యల మీద గళం విప్పుతారు అని అంతా అనుకుంటున్నారు.

By:  Satya P   |   2 Sept 2025 11:00 PM IST
అసెంబ్లీకి జగన్...మళ్ళీ అదే మాట !
X

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వస్తారు అని ఈ మధ్య దాకా ప్రచారం సాగింది. ఆయన ఈ నెల మూడవ వారంలో జరిగే వర్షాకాల సమావేశాలకు హారై ప్రజా సమస్యల మీద గళం విప్పుతారు అని అంతా అనుకుంటున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి పదిహేను నెలల కాలం ఇట్టే గడచిపోయిందని దాంతో ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయని వాటిని అసెంబ్లీ వేదికగా చర్చించాలని వైసీపీ అనుకుంటోందని అంతా చెప్పుకున్నారు. కానీ ఇపుడు చూస్తే మళ్ళీ అదే మాట వినిపిస్తోంది అని అంటున్నారు.

సిద్ధమేనా అంటూ బాబు :

ఇక చూస్తే 2024 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి హోదాలో జగన్ సిద్ధం సభలు సమావేశాలు నిర్వహించారు. ఆ సభలలో ఆయన సిద్ధమేనా అని కూడా ప్రజలకు జగన్ ప్రశ్నించేవారు. అయితే ఆ సిద్ధం అన్న మాటను ఇపుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అందిపుచ్చుకున్నారు. సిద్ధం అంటూ ఎగిరెగిరి పడ్డారుగా ఇపుడు అసెంబ్లీకి రావడానికి సిద్ధమేనా అని బాబు సూటిగానే వైసీపీని నిలదీశారు. ప్రెస్ మీట్లు కాదు నేరుగా అసెంబ్లీలోనే చర్చించుకుందామని బాబు జగన్ కి ఓపెన్ చాలెంజ్ చేశారు.

ఆ కండిషన్ అప్లై :

అయితే బాబు సవాల్ కి వైసీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి జవాబు చెప్పారు. మేము సిద్ధమే కానీ జగన్ కి ప్రతిపక్ష హోదా ఇస్తారా అని ఆయన బాబుని తిరిగి ప్రశ్నించడం విశేషం. సభకు జగన్ వస్తారు, ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి అని ఆయన ఎదురు సవాల్ చేశారు. జగన్ సభలో మాట్లాడుతారు అని ప్రజా సమస్యలు ప్రస్తావిస్తారు అని కానీ ప్రతిపక్ష హోదా మాత్రం ఇవ్వాలని సజ్జల కండిషన్ పెట్టారు. ఈ విధంగా పాత డిమాండ్ కే వైసీపీ కట్టుబడి ఉన్నట్లుగా అర్ధం అవుతోంది అని అంటున్నారు.

ఖండితంగా చెబుతున్నా :

అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష హోదా ఇవ్వమని అంటోంది. ఇక స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా అసెంబ్లీ నిబంధనలను చూపిస్తున్నారు. కనీసంగా 18 మంది ఎమ్మెల్యేలు ఉంటేనే తప్ప విపక్ష హోదా దక్కదని రూల్స్ చెబుతున్నాయని కూడా గుర్తు చేస్తున్నారు. అందువల్ల హోదా అయితే వైసీపీ కోరుకున్నట్లుగా ఇవ్వడం కుదరదు అన్నది స్పష్టంగానే ఉంది. అయినా సరే హోదా ఇస్తేనే సభకు అని పట్టుబట్టడం వైసీపీ రాజకీయమా అన్న చర్చ కూడా వస్తోంది.

సభకు హాజరు అయితేనే :

ఇదిలా ఉంటే సభకు హాజరు అయితేనే జగన్ కి వైసీపీకి మేలు జరుగుతుందని పార్టీలో ఉన్న నాయకులతో పాటు అంతా సూచిస్తున్నారు. అసెంబ్లీకి జగన్ తో పాటుగా మరో పది మంది ఎమ్మెల్యేలను ప్రజలు ఎన్నుకున్నారు. తమ నియోజకవర్గం సమస్యలను వారు అక్కడ ప్రస్తావించాలని కూడా కూడా వారు కోరుకుంటున్నారు ఇక జగన్ కి ప్రతిపక్ష హోదా అన్నది పూర్తిగా టెక్నికల్ ఇష్యూగానే అంతా చూస్తారు జనాలకు అయితే వాటితో సంబంధం లేదు అని అంటారు. జగన్ సభకు వెళ్ళి ప్రతిపక్ష పాత్రను నిర్వహిస్తే కనుక ప్రజలలో వైసీపీ ఇమేజ్ కచ్చితంగా పెరుగుతునదని అంటున్నారు. ఈ క్రమంలో సభలో వైసీపీ అధినేతకు అవమానాలు ఎదురైనా వాటి వల్ల ఇబ్బందులు పడినా జనంలో పొలిటికల్ గా గ్రాఫ్ పెరుగుతుందని అంటున్నారు పైపెచ్చు ప్రజాస్వామ్యంలో వైసీపీ తన వంతు ప్రతిపక్ష పాత్రని నిర్వహించాలని అంతా అంటున్నారు. మరి చూడాలి వైసీపీ నిర్ణయంలో ఏమైనా మార్పు ఉంటుందా లేదా అన్నది.