Begin typing your search above and press return to search.

వదినతో మరదలి ప్రేమాయణం... ట్విస్ట్ ఏమిటంటే..!

వివరాళ్లోకి వెళ్తే... జబల్పూర్‌ లోని అమర్‌ పతాన్ ప్రాంతానికి చెందిన అశుతోష్.. ఏడు సంవత్సరాల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు.

By:  Raja Ch   |   28 Sept 2025 6:00 PM IST
వదినతో మరదలి ప్రేమాయణం... ట్విస్ట్  ఏమిటంటే..!
X

ప్రియుడి కోసం భర్తను, ప్రియురాలి కోసం భార్యను వదిలేస్తున్న దంపతులకు సంబంధించిన ఘటనలు నిత్యం ఏదో ఒక మూల తెరపైకి వస్తూనే ఉన్నాయి! ఇక ఇవి హత్యలు, అత్యాచారాల వరకూ వెళ్లిన ఘటనలకూ కొదవలేని పరిస్థితి. అయితే తాజాగా మాత్రం ఓ కొత్త వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇది వదిన, మరదలి ప్రేమాయణం.. అనంతరం జంప్!

అవును... మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌ పూర్‌ లోగల ఓ కుటుంబంలో వింత సంఘటన చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఇంట్లో ఉన్న ఒక మహిళ తన భర్త, చిన్న బిడ్డను వదిలి తన వదినతో పారిపోయింది. ఈ ఘటన ఇంటి వారిని, చుట్టుపక్కల వారిని షాక్ కి గురిచేయగా. రంగంలోకి దిగిన పోలిసులు వెతుకులాట ప్రారంభించారు.

వివరాళ్లోకి వెళ్తే... జబల్పూర్‌ లోని అమర్‌ పతాన్ ప్రాంతానికి చెందిన అశుతోష్.. ఏడు సంవత్సరాల క్రితం ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. అశుతోష్ ఇటీవల జబల్పూర్‌ కు వెళ్లి అక్కడే తన భార్యతో కలిసి నివసించాడు. ఈ క్రమంలో అతడి కజిన్.. తరచుగా వారి ఇంటికి వచ్చేది.

అతడి భార్యతో చనువుగా ఉంటూ తరచుగా విహారయాత్రలకు, మార్కెట్‌ కు వెళ్లేది. ఈ క్రమంలో ఆగస్టు 12న అశుతోష్ భార్య అకస్మాత్తుగా ఇంటి నుండి అదృశ్యమైంది. అప్పుడు ఆమెను జబల్పూర్ రైల్వే స్టేషన్‌ లో గుర్తించి తీసుకొచ్చారు. ఆ తర్వాత కొంతకాలం తన భర్త, కొడుకుతో కలిసింది.

అయితే... పది రోజుల తర్వాత ఆగస్టు 22న ఆమె మళ్ళీ అదృశ్యమైంది. ఈసారి తన మొబైల్ ఫోన్‌ ను ఇంట్లోనే వదిలేసి వెళ్లిపోయింది. మళ్లీ తిరిగిరాలేదు. ఆ సమయంలో అశుతోష్ తన భార్య ఫోన్‌ ను చెక్ చేయగా.. తన కజిన్ తో తన భార్యకు ఉన్న ప్రేమ సంబందాన్ని సూచించే మెసేజ్ లను గుర్తించాడు. దీంతో.. ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు!

ఒక మహిళ.. తన భర్త, కుమారుడిని వదిలి మరదలి వరసయ్యే ఆమెతో వెళ్లిపోవడం.. ఈ స్వలింగ సంపర్క సంబంధం స్థానికంగా విస్తృత చర్చకు దారితీసింది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ఇద్దరు మహిళల గురించి గాలిస్తున్నారు!