అటామిక్ పవర్ గా ఎదగడంలో ఇజ్రాయెల్ స్కెచ్ మామూలు కాదుగా..
గత నెలలో అరబ్ కంట్రీ అయిన సౌదీ అరేబియా- పాకిస్తాన్ డిఫెన్స్ డీల్ కుదుర్చుకున్నాయి. కారణం ప్రపంచం మొత్తానికి తెలిసిందే.
By: Tupaki Political Desk | 6 Oct 2025 4:00 PM ISTగత నెలలో అరబ్ కంట్రీ అయిన సౌదీ అరేబియా- పాకిస్తాన్ డిఫెన్స్ డీల్ కుదుర్చుకున్నాయి. కారణం ప్రపంచం మొత్తానికి తెలిసిందే. సౌదీ కంట్రీస్ లో ఏ కంట్రీకి కూడా ఆటామిక్ పవర్ (అణుబాంబు) లేదు.. ముస్లిం కంట్రీ అయిన పాకిస్తాన్ వద్ద మాత్రమే అణు శక్తి ఉంది కాబట్టి డిఫెన్స్ డీల్ కుదుర్చుకుంది. ఈ డీల్ కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది. కానీ ఇటీవల మాత్రమే కార్యరూపం దాల్చింది. కారణం ఇరాక్ పై ఇజ్రాయెల్ దాడి. ఇజ్రాయిల్ సమీపంలోని శత్రుదేశాలపై తీవ్ర ఆగ్రహంతో ఉంది. గాజా, ఇరాక్, ఇరాన్ ఇలా రాను రాను అది అరబ్ దేశాలకు కూడా పాకే ప్రమాదం ఉంది. కాబట్టి డీల్ కుదుర్చుకుంది.
ఇప్పటికీ ఇజ్రాయెల్ తమ వద్ద అణుబాంబు ఉందని ప్రకటించలేదు. ఏ దేశం కూడా ఇజ్రాయెల్ అణు బాంబును కలిగి ఉందని చెప్పలేదు. కానీ సమీపంలోని సౌదీ దేశాలకు ఈ విషయం తెలుసు ఇజ్రాయెల్ తలుచుకుంటే అణు బాంబు ప్రయోగించగలదని, దానికి అమెరికా సపోర్టుగా ఉంటుందని.
దేశం చిన్నది.. శక్తి పెద్దది
ఇజ్రాయెల్ ప్రపంచంలో అత్యంత చిన్న దేశాల్లో ఒకటి. కానీ, సాంకేతికత, గూఢచారి ఆపరేషన్లలో ఇది అన్నింటికంటే ముందనే చెప్పాలి. సాధ్యం కాని ఆపరేషన్లు చేపట్టినా.. దేశాలతో యుద్ధాలను తట్టుకొని శక్తివంతంగా మారడం ఇజ్రాయెల్ విజయానికి ప్రధాన కారణాలు. 1948లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పటి నుంచి పొరుగున ఉన్న అరబ్ దేశాల నుంచి ఈ దేశానికి ముప్పు ఉంది. వాటితో చేసే యుద్ధాల్లో అమెరికా సాయం చేస్తున్నా.. భవిష్యత్తులో అమెరికా సాయం నిలిపేస్తే ఎలా అన్న ప్రశ్న ఆ దేశ ప్రధాని డేవిడ్ బెన్ గురియన్ కలిగింది. దీంతో ఆయన అణు శక్తి ఉండాలని, ఆ దిశగా అడుగులు వేశాడు.
టెక్ట్స్ టైల్స్ ఫ్యాక్టరీగా చూపుతూ..
1950లో ఇజ్రాయిల్ అటామిక్ ఎనర్జీ కమిషన్ ఏర్పాటైంది. 1956లో సుయజ్ సంక్షోభం తర్వాత, అమెరికాపై నిరాశతో, ఫ్రాన్స్‌తో సఖ్యత ఏర్పడి, డిమోనా అణు రియాక్టర్ నిర్మాణానికి ఒప్పందం జరిగింది. ఫ్రాన్స్ సాంకేతిక నిపుణులు బ్లూప్రింట్లు అందించగా పరిశోధనలు ప్రారంభమయ్యాయి. డిమోనా భూగర్భ బంకర్లలో ప్లూటోనియం ఉంది. దీన్ని అణు విద్యుత్ కోసం ఉపయోగించాలని అమెరికా ఆదేశించింది. కానీ ఇజ్రాయిల్ మాత్రం అటామిక్ బాంబు ఏర్పాటు చేసేందుకు పరిశోధనలు చేసింది. ఇజ్రాయిల్ ‘టెక్సైల్ ఫ్యాక్టరీ’గా చూపించి ఇతర దేశాల తనిఖీల నుంచి తప్పించుకుంది. ఆ దేశ అత్యంత గుఢచార సంస్థ మొస్సాద్ నకిలీ గోడలు, నిర్మాణాలు ఏర్పాటు చేసి అంతర్జాతీయ దృష్టిని మరల్చింది. 1967 యుద్ధం తర్వాత ఇజ్రాయిల్ కు ఫ్రాన్స్ యురేనియం సరఫరాను నిలిపివేసింది. దీంతో ఇజ్రాయిల్‌కు కొత్త మార్గం అవసరమైంది.
షిప్ కింది భాగంలో ముడి యురేనియం..
ఫ్రాన్స్ చర్యతో డిఫెన్స పడింది ఇజ్రాయిల్. దీంతో మొస్సాద్ రంగంలోకి దిగింది. ‘ఆపరేషన్ ప్లమ్ బాట్‘ నిర్వహించింది. బెల్జియం యూనియన్ మైన్స్ కంపెనీ నుంచి 200 టన్నుల ముడి యురేనియంను ఒక జర్మన్ కంపెనీ పేరుతో కొని పెట్టుకుంది. లైబీరియాలో షిప్పింగ్ కంపెనీ ఏర్పాటు చేసి, సముద్ర మధ్యలో ఇజ్రాయెల్ నౌకకు అమర్చింది. 8 రోజుల తర్వాత సదరు నౌక టర్కీ వద్ద కనిపించడం మొసాద్ విజయం అనే చెప్పాలి.
యూఎస్, ఆస్ట్రేలియా పరిశీలించినా.. పట్టించుకోలే..
1979లో దక్షిణాఫ్రికా సమీపంలోని ప్రిన్స్ ఎడ్వర్డ్ దీవుల్లో రెండు కాంతి మెరుపులను అమెరికా ఉపగ్రహం గుర్తించింది. గామా కిరణాలు, ఎక్స్ రేఖలు, న్యూట్రాన్ ఉద్గారాలు అణు పేలుడని సూచించాయి. బ్రిటన్, ఆస్ట్రేలియా కూడా దీన్ని అణు పరీక్షగా గుర్తించాయి. కానీ, ఏ దేశం దీనిపై దర్యాప్తు చేయలేదు.
అరబ్ కంట్రీస్ కు తెలిసిన నిజం..
ఇజ్రాయెల్ ఎప్పుడూ ‘అణుశక్తి దేశం’ అని ప్రకటించకపోయినా, దాని అణు సామర్థ్యం అరబ్ ప్రపంచాన్ని భయపెట్టే అత్యంత ప్రభావవంతమైన ఆయుధంగా నిలిచింది. మొసాద్ నిఘా, మోసపూరిత ఆపరేషన్లు, రాజకీయ కచ్చితత్వం, సాంకేతిక నైపుణ్యం ఇవన్నీ ఈ దేశాన్ని రహస్య అణుశక్తిగా నిలిపాయి. చిన్న దేశం, గూఢచారి నైపుణ్యం, వ్యూహాత్మక దృష్టి కలిపి, ఇజ్రాయిల్ ప్రపంచ రాజకీయాల్లో భయాందోళన కలిగించే శక్తిగా ఎదిగింది.
