చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?
పాకిస్థాన్‌లో బంగారం ధరలు భారత్‌తో పోలిస్తే భారీగా తక్కువగా ఉన్నాయనే లెక్కలు ఆసక్తి రేపుతున్నాయి. నవంబర్ 4 నాటి వివరాల ప్రకారం, 24 క్యారెట్ల తులం బంగారం ధర అక్కడ భారత కరెన్సీలో సుమారు రూ.1,21,
By: A.N.Kumar | 5 Nov 2026 5:49 PM ISTచీప్.. వెరీ చీప్.. పాకిస్తాన్లో బంగారం తులం రూపాయిల లెక్క చూస్తే సగం ఉచితంగా ఇస్తున్నట్లే అనిపిస్తోంది కదూ? "అరే.. దేశం ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతుంటే నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతుంటే పెట్రోల్ లీటర్ రూ. 390 దాటేసి సామాన్యుడి జేబుకు కన్నం పెడుతుంటే... ఈ బంగారం మాత్రం ఇంత సరసంగా ఎలా దొరుకుతోంది సామీ?" అని ఆశ్చర్యపోవడం మీ వంతు అవుతుంది. భారత్‌తో పోలిస్తే ఏకంగా తులంపై రూ. 21 వేలకు పైగా తేడా ఉందంటే... విమానం టికెట్ బుక్ చేసుకుని కరాచీ వెళ్ళి నాలుగు తులాల బంగారం కొనుక్కొద్దామా అని ప్లాన్ వేస్తున్నారేమో.. ఆగండి.. అంత తొందరపడి కరాచీ ఫ్లైట్ ఎక్కేయకండి.. అసలు కథ ముందర ఉంది.
నవంబర్ 4 నాటి మార్కెట్ వివరాలు చూస్తే.. 24 క్యారెట్ల తులం బంగారం ధర పాకిస్థాన్‌లో భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ. 1,21,654గా ఉంటే మన భారతదేశంలో అది రూ. 1,43,105 పలుకుతోంది. అంటే వ్యత్యాసం అక్షరాలా రూ. 21,451.. ఇక 22 క్యారెట్ల విషయానికొస్తే అక్కడ రూ. 1,11,516, ఇక్కడ రూ. 1,31,742.. బాబోయ్, ఎంత తేడా.. కానీ ఇక్కడే ఒక చిన్న వింత ఉంది. పాకిస్తానీ రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో ఎంత పడిపోయిందో తెలిస్తే మీ కళ్ళు తిరగడం ఖాయం. మనం చెల్లించే ఒక భారత రూపాయికి.. వారి దేశంలో దాదాపు మూడు పాకిస్తానీ రూపాయలు వస్తాయి.. అంటే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర డాలర్లలో నిర్ణయించ బడినప్పుడు దాన్ని స్థానిక కరెన్సీలోకి మార్చి తిరిగి మన రూపాయిలోకి మారిస్తే వచ్చే ఈ 'మాయాజాలపు తేడా' చూసి జనాలు మోసపోతున్నారు.
పాకిస్థాన్‌లో బంగారం కొనేసి ఇండియాకు తేవడం చాలా ఈజీ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. మన దేశంలో బంగారంపై 3 శాతం జీఎస్టీ.. పక్కా మేకింగ్ ఛార్జీలు ఉంటాయి. సరే సరిహద్దు దాటి అక్కడ కొందామన్నా కస్టమ్స్ అధికారుల పహారా.. పన్నుల మోత మిమ్మల్ని సరిహద్దులోనే పలకరిస్తాయి. మన దేశ రూపాయి బలం ముందు పాకిస్తానీ రూపాయి తేలిపోవడం వల్ల వచ్చే వ్యత్యాసమే తప్ప బంగారం అక్కడ చౌక కాదు. విదేశాల నుండి ఉచితంగానో లేక తక్కువ ధరకో బంగారం తేద్దామంటే కస్టమ్స్ చట్టాలు ఊరుకోవు. అక్కడ లీటరు పాలు, పెట్రోల్ కొనేందుకే సామాన్యుడు అల్లాడుతుంటే బంగారం కొనేంత సీన్ స్థానిక పాకిస్తానీయులకు ఎక్కడిది? కాబట్టి "పాకిస్తాన్లో బంగారం చీప్" అనే మాట కేవలం కాగితపు లెక్కల విన్యాసమే తప్ప నిజంగా అక్కడ లబ్ధి పొందే అవకాశమే లేదు. వార్తల్లో కనిపించే ఆంకెలు చూసి మురిసిపోవడం కన్నా మన ఊరి జ్యువెలరీ షాప్‌లోనే బంగారం కొనుక్కోవడం సర్వత్రా శ్రేయస్కరం.
