Begin typing your search above and press return to search.

USA : $25 కేసులో వృద్దురాలి దేశ బహిష్కరణ

అమెరికాలో పరిస్థితులు స్థానికేతరులకు అత్యంత భయాందోళనకు గురి చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న విదేశీయుల పట్ల ట్రంప్‌ వైకరి ఇప్పటికే వెళ్లడి అయింది.

By:  Ramesh Palla   |   19 Nov 2025 3:00 AM IST
USA : $25 కేసులో వృద్దురాలి దేశ బహిష్కరణ
X

అమెరికాలో పరిస్థితులు స్థానికేతరులకు అత్యంత భయాందోళనకు గురి చేస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఉన్న విదేశీయుల పట్ల ట్రంప్‌ వైకరి ఇప్పటికే వెళ్లడి అయింది. ఆయన స్థానికులు ఫస్ట్‌ అంటూ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అందుకే బయటి దేశం నుంచి ఉద్యోగాల పేరిట వస్తున్న వారిని ఆపేందుకు చాలా చట్టాలు తీసుకు వచ్చాడు. అంతే కాకుండా ఇప్పటికే దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను బయటకు పంపేందుకు పెద్ద ఆపరేషన్‌ మొదలు పెట్టాడు. ఇక చట్ట ప్రకారం దేశంలో ఉంటున్న వారిని కూడా చాలా ఇబ్బందులు పెట్టే విధంగా ఆయన కొత్త చట్టం తీసుకు వచ్చారు అనే విమర్శలు ఉన్నాయి. తమ దేశంకు మంచి చేయడం కోసం, తమ దేశస్తులకు మంచి చేయడం కోసం ఆయన చాలా దూరం వెళ్తున్నాడు అనేది చాలా మంది చెబుతున్న మాట.

అమెరికాలో చట్టాలు కఠినంగా..

గ్రీన్‌ కార్డ్‌, హెచ్‌1 బి వీసాపై ఉంటున్న వారిపై కఠినంగా వ్యవహరించేందుకు తీసుకు వచ్చిన చట్టం అమలులోకి వచ్చింది. వారు చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష వేసేందుకు గాను కొత్త చట్టాలను ట్రంప్‌ తీసుకు వచ్చాడు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పటి వరకు ఆ చట్టం ఎక్కువ ప్రభావం చూపించలేదు అనుకున్నారు. కానీ ఒక వృద్దురాలి ఈ చట్టం కారణంగా ఏకంగా దేశ బహిష్కరణకు గురి అయింది. కేవలం 25 డాలర్ల చెక్‌ బౌన్స్ అయిన కేసు విషయంలో గ్రీన్‌ కార్డ్‌ తో అమెరికాలో సుదీర్ఘ కాలంగా ఉంటున్న డొన్నా హ్యూస్-బ్రౌన్ అనే ఐరిష్‌ వృద్ద మహిల దేశం నుంచి గెంటి వేయబడింది అంటూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఐరిష్ నుంచి దాదాపు 47 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లిన ఆ మహిళ ఇప్పుడు దేశం నుంచి డిపోర్ట్‌ చేయబడింది.

25 డాలర్ల చెక్‌ కేసు లో మహిళ దేశ బహిష్కరణ

డొన్నా హ్యూస్-బ్రౌన్ అనే మహిళ పదేళ్ల క్రితం 25 డాలర్ల చెక్‌ ను ఇవ్వడం జరిగింది. ఆ చెక్ బౌన్స్ అయింది, ఆ కేసు లో ఆమె నష్టపరిహారం చెల్లించడంతో పాటు, ఇతర చెల్లింపులు అన్ని చేసింది. అయినా కూడా కేసు మాత్రం అలాగే ఉండి పోయింది. ఇటీవల ఈమె ఫ్యామిలీతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లి వస్తున్న సమయంలో ఆమెను ఎయిర్‌ పోర్ట్‌ లో అధికారులు గుర్తించారు. ఆ సమయంలో ఆమె పాస్‌ పోర్ట్‌, గ్రీన్‌ కార్డ్‌ను పరిశీలించి, దేశంలో ఆమె పై ఉన్న కేసులను వివరాలను బయటకు తీసిన సమయంలో పదేళ క్రితం నమోదు అయిన చెక్ బౌన్స్ కేసు బయట పడింది. దాంతో ఆమెను వెంటనే డిపోర్ట్‌ చేసే విధంగా చట్టం ఉండటంతో అదే పని వారు చేశారు.చట్టబద్దంగా సుదీర్ఘ కాలంగా అమెరికాలో ఉంటున్న ఆమెను ఇప్పుడు డిపోర్ట్‌ చేయడం అనేది అత్యంత దారుణమైన విషయం అంటూ ఆమె కుటుంబ సభ్యులు అంటున్నారు.

ట్రంప్ ఇంకా ఎప్పటి వరకు ఉంటాడో...

అమెరికాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ఇది అద్దం పడుతుందని, అందుకే హెచ్‌ 1 బి వీసాపై వచ్చే వారు, ఇప్పటికే అమెరికాలో గ్రీన్‌ కార్డ్‌ కలిగి ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలని, వారిపై చిన్న కేసు పడ్డా కూడా దేశ బహిష్కరణ కాబడుతారు అనే విషయంను అంతా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒకసారి దేశం విడిచి బయటకు వెళ్తే, మళ్లీ వెళ్లే వరకు నమ్మకం లేదు అంటూ అమెరికాలో ఉంటున్న విదేశీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే చాలా మంది అమెరికా లో ఉన్న విదేశీయులు అత్యవసరం అయితే దేశం విడవడం లేదు. ఇండియా నుంచి అత్యధికులు అమెరికాలో ఉన్నారు. వారంతా కూడా బిక్కు బిక్కు మంటూ ఉన్నారు. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత విదేశీయులు అంతా ఆందోళనతో ఉన్నారు. ట్రంప్‌ ఎప్పుడు పోతాడా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఆయన మాత్రం మళ్లీ అధికారంలోకి రావడానికి ఏకంగా చట్ట సవరణ చేసేందుకు రెడీ అవుతున్నాడనే వార్తలు వస్తున్నాయి.