Begin typing your search above and press return to search.

ఇరాన్‌ సుప్రీం నేతకు కీలక నేతల రహస్య లేఖ.. దేశం విచ్ఛిన్నం దిశగా సాగుతోందా?

బయటకు పక్కన పెడితే ఇరాన్ లోపల (దేశం ఆర్థిక వ్యవస్థ) తీవ్రంగా బలహీణపడుతుంది. దీని వల్ల అది నేరుగా యుద్ధ క్షేత్రంపై ప్రభావం చూపుతుంది.

By:  Tupaki Political Desk   |   26 April 2026 10:08 AM IST
ఇరాన్‌ సుప్రీం నేతకు కీలక నేతల రహస్య లేఖ.. దేశం విచ్ఛిన్నం దిశగా సాగుతోందా?
X

ఒకవైపు ఇజ్రాయెల్, అమెరికాతో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తరుణంలో.. ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో ఇటువంటి ‘రహస్య లేఖ’ బయటపడడంఆ దేశ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ చరిత్రలో ఇది ఒక అత్యంత అరుదైన, విపత్కర పరిణామం. సాధారణంగా ఇరాన్ నాయకత్వం వెలుపలకి ఎంత ఐక్యంగా కనిపిస్తుందో, లోపల కూడా అంతే అధికార పోరాటం సాగుతోందని రహస్య లేఖ నిరూపిస్తోంది. సుప్రీం నేత మొజ్తాబా ఖమేనీకి రాసిన ఈ లేఖపై స్వయంగా అధ్యక్షుడు పెజెష్కియాన్, పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వంటి అగ్రనేతలు సంతకాలు చేయడం అంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం లేఖ కాదు, ఇరాన్ భవిష్యత్తు మార్చే తిరుగుబాటు సంకేతం.

లేఖలో ఏముంది?

రాజకీయ నాయకత్వం ప్రధానంగా మూడు అంశాలపై తమ అభ్యంతరాలను వ్యక్తం చేసింది. పాశ్చాత్య దేశాల ఆంక్షలు, యుద్ధంపై పెడుతున్న విపరీతమైన ఖర్చుల వల్ల దేశం ఆర్థికంగా కుప్పకూలిపోతోందని హెచ్చరించారు. సామాన్యుడు ఆకలితో అలమటిస్తుంటే, క్షిపణులపై పెట్టుబడి పెట్టడం దేశ భద్రతకు గొడ్డలి పెట్టు అని భావిస్తున్నారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ అనేది ఇరాన్ సైనిక విభాగం. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో సైన్యం జోక్యం ఎక్కువ అవుతుంది. ఎన్నికైన ప్రతినిధుల కంటే సైనిక కమాండర్ల మాటే చెల్లుబాటు అవుతుండటాన్ని నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇరాన్ అనుసరిస్తున్న మొండి వైఖరి వల్ల ప్రపంచ దేశాల నుంచి ఒంటరి అవుతున్నామని, విదేశాంగ విధానంలో మార్పులు చేసి దౌత్యపరంగా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు.

చీలికపోతున్న నాయకత్వం..

ఇరాన్ ఇప్పుడు రెండు బలమైన ధృవాలుగా విడిపోయింది. ఒకటి మొండివర్గంగా, మరోటి సంస్కరణవాదులుగా అందులో మొదటి వర్గం మొండి వర్గం ఐఆర్‌జీసీ, సుప్రీం నేతకు సన్నిహితంగా ఉండే వర్గం. వీరు యుద్ధానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. ఇజ్రాయెల్, అమెరికాను తుదముట్టించడమే వీరు లక్ష్యంగా పని చేస్తున్నారు. ఇక రెండో వర్గం అధ్యక్షుడు పెజెష్కియాన్ నేతృత్వంలోని ఈ వర్గం ప్రజల ఇబ్బందులను గమనిస్తోంది. ప్రపంచంతో సంబంధాలను పునరుద్ధరించాలని, ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవాలని కోరుతున్నారు.

యుద్ధంపై చీలిక ప్రభావం

బయటకు పక్కన పెడితే ఇరాన్ లోపల (దేశం ఆర్థిక వ్యవస్థ) తీవ్రంగా బలహీణపడుతుంది. దీని వల్ల అది నేరుగా యుద్ధ క్షేత్రంపై ప్రభావం చూపుతుంది. నాయకత్వంలో ఏకాభిప్రాయం లేకపోతే ఇజ్రాయెల్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కోవడం కష్టం అవుతుంది. ఆర్థిక కష్టాల వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగి, అది అంతర్గత కల్లోలానికి దారితీసే ప్రమాదం ఉంది. దీన్ని అమెరికా, ఇజ్రాయెల్ తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ రహస్య లేఖపై సుప్రీం నేత మొజ్తాబా ఎలా స్పందిస్తారనే దానిపై ఇరాన్ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆయన రాజకీయ నేతల మాట విని విదేశాంగ విధానంలో మార్పులు చేస్తారా..? లేక ఐఆర్‌జీసీకి మద్దతిచ్చి వారిపై చర్యలు తీసుకుంటారా..? అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ ప్రభుత్వంపై సైన్యం పట్టు బిగిస్తే, ఇరాన్ పూర్తిగా మిలిటరీ నియంతృత్వ దేశంగా మారే ప్రమాదం ఉంది. అంతర్గత విభేదాలు పశ్చిమాసియా యుద్ధ గమనాన్ని మార్చివేసే అవకాశం ఉంది.