పెట్రోల్ మంటలు: ట్రంప్ గాలి తీసేసిన ఇరాన్!
ఇరాన్‌పై జరుగుతున్న ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం కారణంగా.. పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి.
By: Garuda Media | 21 March 2026 6:31 PM ISTఇరాన్‌పై జరుగుతున్న ఇజ్రాయెల్-అమెరికా యుద్ధం కారణంగా.. పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కల్లోలం ఆయా దేశాలకే పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సమస్యలు తలెత్తాయి. పెట్రోలు, డీజిల్ సహా.. గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో అమెరికాపై ప్రపంచ దేశాల నుంచి తీవ్రమైన ఒత్తిడి నెలకొంది. ``అంతా నీవల్లే`` అంటూ నాటో దేశాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై విరుచుకుపడుతున్నాయి.
ఈ పరిణామాలకు తోడు.. ఇరాన్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మరింత బలంగా పోరాటానికి రెడీ అవుతోం ది. ఈ పరిణామాలతో ఉక్కిరిబిక్కిరికి గురవుతున్న అధ్యక్షుడు ట్రంప్.. ఎట్టకేలకు తన మనసు మార్చుకు న్నారు. ప్రస్తుతం సముద్రంలో రవాణాకు రెడీగా ఉన్న ఇరాన్ చమురును తక్షణమే విక్రయించుకోవచ్చని .. శనివారం నుంచి 30 రోజుల వరకు అవకాశం ఇస్తున్నానని ప్రకటించారు. అమెరికాలెక్కల ప్రకారం.. పశ్చిమాసియా సముద్రలో ఇరాన్ చమురు నౌకలలో 14 కోట్ల బ్యారెళ్ల మేరకు చమురు ఉంది.
అయితే.. ఇక్కడే ఇరాన్ యూటర్న్ తీసుకుంది. అమెరికా తమకు చెప్పాల్సిన అవసరం లేదని.. తమకు నిర్దేశించాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అంతేకాదు.. అమెరికా అంచనాలు కూడా తప్పేనని వ్యాఖ్యానించింది. అమ్ముకునేందుకు తమ వద్ద చమురు మిగిలి లేదని.. సముద్రంలో ఉన్న చమురును ఇప్పటికే ఆయా దేశాలకు తరలించేశామని పేర్కొంది. దీంతో తమ వద్ద అమ్ముకునేందుకు.. ముడి చమురు లేదని స్పష్టం చేసింది. అమెరికా అంచనాలు తప్పని ఇరాన్ ఇంధన శాఖ ఓ ప్రకటన చేసింది.
ఇదంతా నాటకమేనా?
ఈ పరిణామాలతో అమెరికాపై మరింత ఒత్తిడి పెరిగింది. తమ ఆంక్షలతోనే ఇరాన్ చమురు విక్రయించలే దని.. ఇప్పుడు ప్రపంచ దేశాల మేలు కోరి .. తాము ఇరాన్‌పై ఆంక్షలు సడలించామని ట్రంప్ ప్రకటించడం.. ఆ వెంటనే ఇరాన్ ప్రతిస్పందించి.. అసలు తమ వద్ద చమురులేదని చెప్పడంతో ప్రపంచ దేశాలు ట్రంప్‌ను తూర్పారబడుతున్నాయి. ఇందంతా నాటకమేనా? అంటూ.. సోషల్ మీడియా వేదికగా పలు దేశాధినేతలు.. ట్రంప్‌ను ట్యాగ్ చేస్తున్నారు.
