ఖమేనీ ఫస్ట్ స్పీచ్...హై ఓల్టేజ్ హీట్ !
ఎవరితోనైనా పెట్టుకోండి, మాతో కాదు అంటున్నాడు మొజ్తబా ఖమేనీ. తన తండ్రి కంటే ఆరు ఆకులు ఎక్కువే చదివాను అని తన మాటల ద్వారానే చెప్పేస్తున్నాడు.
By: Satya P | 12 March 2026 11:13 PM ISTఎవరితోనైనా పెట్టుకోండి, మాతో కాదు అంటున్నాడు మొజ్తబా ఖమేనీ. తన తండ్రి కంటే ఆరు ఆకులు ఎక్కువే చదివాను అని తన మాటల ద్వారానే చెప్పేస్తున్నాడు. తాను తగ్గేది లేదంటూ బిగ్ సౌండ్ చేస్తున్నాడు. ఏకంగా అమెరికానే హెచ్చరిస్తూ స్వీట్ అండ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేశాడు. అమెరికాకే డెడ్ లైన్లు పెడుతున్నాడు. యాక్షన్ కి మేము రెడీ అంటున్నాడు. నిన్న మొజ్తబా ఖమేనీని ఎన్నుకున్నారు. నేడు అతను గొంతు విప్పాడు. దాంతో ఇరాన్ కొత్త సుప్రీం రూట్ ఏంటో వేటు ఎవరితో కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు.
అమెరికాకే వార్నింగ్స్ :
గల్ఫ్ దేశాలలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలు మూసేయాలని మొజ్తబా ఖమేనీ తీవ్ర స్వరంతోనే స్పష్టం చేసాడు. అలా కాదు కూడదు అనుకుంటే వాటి మీద తమ దాడులు భీకరంగా ఉంటాయని ఆపైన మీ ఇష్టమని కూడా తేల్చి చెప్పేశాడు. దీంతో అమెరికా ఏమి చేస్తుంది అన్నదే పెద్ద ప్రశ్నగా ఉంది. అమెరికా చాలా కాలంగా తమ మిత్ర దేశాలుగా గల్ఫ్ కంట్రీస్ ని చేసుకుని అక్కడ మిలటరీ క్యాంప్స్ ని నిర్వహిస్తోంది. వాటి ఆసరాతోనే ఇరాన్ మీద ఎటాక్స్ చేస్తోంది. ఇపుడు మొజ్తబా ఖమేనీ హెచ్చరికలు అమెరికాకు ఏ విధంగా రీ సౌండ్ చేస్తాయా అన్న చర్చ సాగుతోంది.
శతృవులను వదిలేది లేదు :
ఇరాన్ మీద దాడి చేసి తీరని హాని చేసిన శతృవులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ అంటున్నారు. తమను ఇంతలా సర్వ నాశనం చేసిన శతృవుల నుంచి నష్ట పరిహారం పూర్తి స్థాయిలో తీసుకుంటామని ఆయన కుండ బద్ధలు కొట్టేశాడు. లేదంటే మాత్రం వారి ఆస్తులను అయినా ద్వంశం చేసి సర్వ నాశనం ఏంటో కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తామని అంటున్నాడు.
ఉలిక్కి పడే పరిస్థితి
ఇరాన్ వంటి దేశం మీద దాడులు చేసిన వారి మీద ఇంతకు ఇంత ప్రతీకారం దాడులు చేస్తామని ఇది తప్పదని కూడా మొజ్తబా ఖమేనీ తన మొదటి ప్రసంగంలోనే హెచ్చరించడంతో అంతర్జాతీయ సమాజాన్ని సైతం ఉలిక్కిపడేలా చేస్తోంది. మొజ్తబా ఖమేనీ ఏమి చేస్తారు ఎలాంటి ప్రతీకారం దాడులు ఉంటాయన్నది ఇపుడు ప్రపంచం ఆలోచించుకునేలా చేస్తోంది.
జలసంధి మూసేయడమే :
ఇరాన్ వ్యూహాంతకంగానే హర్మూజ్ జల సంధిని మూసి వేయాలనుకుంటోంది. ఇది మూసి ఉంచుతామని జూనియర్ ఖమేనీ స్పష్టంగా చెబుతున్నాడు. ఈ మూసివేత అన్నది కొనసాగుతుందని అంటున్నాడు. ఇది ఎందుకు అంటే శతృవుల మీద ఒత్తిడి పెంచడం కోసమే అని ఆయన చెప్పుకొచ్చాడు. దీనిని బట్టి చూస్తే ఖమేనీని లేకుండా చేశామన్న ఆనందం అయితే ప్రత్యర్ధులకు లేకుండా ఉంది. అంతే కాదు సీనియర్ ఖమేనీని మించిన తీరుతో జూనియర్ ఖమేనీ మాటలతోనే నిప్పులు కురిపించేస్తున్నాడు. మరి ఆయన కనుక ఫీల్డ్ లోకి దిగితే ఇక ఏమవుతుంది అన్నదే మరో చర్చ. ఏది ఏమైనా మొదటి స్పీచ్ లోనే హై ఓల్టేజ్ హీట్ ని పెంచేసిన మొజ్తబా ఖమేనీ అయితే ఒక విషయం స్పష్టం చేసినట్లు అయింది. అవతల వారు తగ్గి రావాలి కానీ తాము ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేది లేదని. మరి ఈ పరిణామాలను ప్రపంచం ఎలా అర్ధం చేసుకోవాలి. మరీ ముఖ్యంగా అమెరికా ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అన్నదే చర్చగా ఉంది.
