ఇరాన్ కి ముహూర్తం పెట్టిన ట్రంప్
వెనిజులా అధ్యక్షుడిని బంధించి కొత్త ఏడాదితో అంతర్జాతీయ సంచలనానికి తెర లేపిన అమెరికా పెద్దన్న ఇపుడు తన ఫోకస్ మొత్తం ఇరాన్ మీద పెట్టేశారు.
By: Satya P | 15 Jan 2026 3:00 PM ISTవెనిజులా అధ్యక్షుడిని బంధించి కొత్త ఏడాదితో అంతర్జాతీయ సంచలనానికి తెర లేపిన అమెరికా పెద్దన్న ఇపుడు తన ఫోకస్ మొత్తం ఇరాన్ మీద పెట్టేశారు. ఏ క్షణాన అయినా ఇరాన్ మీద రాకెట్ దాడులతో విరుచుకు పడేందుకు అమెరికా భారీ స్కెచ్ గీస్తోంది. దీంతో ఇరాన్ కూడా ధీటుగా బదులివ్వడానికి సిద్ధపడుతోంది. అమెరికా సైనిక దాడులకు దిగితే మధ్య ప్రాచ్యంలోని అమెరికా సైనిక స్థావరాల మీద తాము దాడులు చేస్తామని ఇరాక్ హెచ్చిరిస్తోంది. ఈ క్రమంలో ఖతర్ బహ్రెయిన్, సౌదీ అరేబియా, కువైట్ ఇరాక్ టర్కీ వంటి చోట్ల ఉన్న తమ సైనిక స్థావరాల నుంచి అమెరికా సిబ్బందిని ఖాళీ చేయిస్తోంది. అంటే ఇరాన్ కి ముహూర్తం పెట్టేసింది అని అంటున్నారు.
తీవ్ర ఉద్రిక్తంగా :
ఇదిలా ఉంటే గత డిసెంబర్ నెల నుంచి ఇరాన్ లో పరిస్థితులు దిగాజరిపోతున్నాయి. అక్కడ అంతర్గత సంక్షోభం తలెత్తుతోంది. దాంతో మారణ హోమం సాగుతోంది. ఆందోళనలను ఇరాన్ భద్రతా దళాలు అణచివేసే క్రమంలో వేలది మంది హతమవుతున్నారు. దీంతో అమెరికా రంగ ప్రవేశం చేయడానికి ఇదే అదనుగా చూస్తోంది. అక్కడ అధికారంలో ఉన్న ఖమేనీ ప్రభుత్వాన్ని కూల్చి రెజా పహ్లావీకి అధికారం అప్పగించాలని చూస్తోంది. ఈ నేపధ్యంలో సైనిక చర్యకు అమెరికా దిగి పోయేందుకు సమాయత్తం అవుతోంది అని అంతర్జాతీయంగా ప్రచారం సాగుతోంది.
కఠినంగానే అన్న ట్రంప్ :
ఇరాన్ దేశంలో కొనసాగుతున్న అశాంతి మధ్య ఇరాన్ అధికారులు నిరసనకారులను ఉరితీస్తే అమెరికా కఠినంగా స్పందిస్తుందని దఅధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. ఆయన ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ మేరకు హెచ్చరికలు జారీ చేయడం విశేషం. ఇరాన్ లో నిరసనకారులను ఉరితీయడంలో ఇరాన్ సిద్ధపడితే వాషింగ్టన్ చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. అంతకుముందు, సోషల్ మీడియా పోస్ట్‌లో సైతం ఆయన ఇరాన్‌లో రక్తపాతం కొనసాగుతోందని పూర్తి సమాచారం కోసం తాను ఎదురు చూస్తున్నానని ఆయన అన్నారు. ఇక నిరసనకారులను చంపితే వాషింగ్టన్ జోక్యం చేసుకుంటుందని ట్రంప్ గతంలో కూడా హెచ్చరించారు. అశాంతిని అణిచివేసేందుకు ఇరాన్ లో ఉరిశిక్షలను అమలు చేయవచ్చు అనే ఆందోళనలు తీవ్రమయ్యాయి. దాంతో ట్రంప్ తాజాగా చేసిన ప్రకటనలు మరింత తీవ్రంగా పరిస్థితులను మార్చేస్తున్నాయి.
భారత్ అలెర్ట్ :
ఇదిలా ఉంటే ఇరాన్ లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతల నేపధ్యంలో భారత్ అలెర్ట్ అయింది. ఇరాన్ లో నివసించే భారతీయ పౌరులను వెంటనే ఇండియా తిరిగి వచ్చేయాలని కోరుతోంది. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ నుంచి సందేశం వెళ్ళింది. అందుబాటులో ఉన్న రవాణా సదుపాయాలు ఉపయోగించుకుని ఇరాన్ ని వీడడం ఉత్తమమని భారత విదేశాంగ శాఖ చెబుతోంది. ఇక చూస్తే ఇరాన్ లో ఎస్ఎంఎస్‌లు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దాంతో ఆ దేశంలో నివసిస్తున్న భారతీయులను అక్కడి భారత రాయబార కార్యాలయం అప్రమత్తం చేసింది. ఇరాన్‌లోని భారత పౌరులుగా ఉన్న విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు అందుబాటులో ఉన్న విమానాల ద్వారా వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లిపోవాలని కోరుతోంది
