Begin typing your search above and press return to search.

ఆపిల్ యూజర్స్ కి బ్యాడ్ న్యూస్.. ఆ మోడల్ ఇక రానట్టేనా?

ఐఫోన్ బ్రాండ్ నుంచి కొత్త సిరీస్ లాంఛ్ అవుతోందంటే చాలు యూజర్స్ చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తుంటారు.

By:  Madhu Reddy   |   11 Sept 2025 11:17 AM IST
ఆపిల్ యూజర్స్ కి బ్యాడ్ న్యూస్.. ఆ మోడల్ ఇక రానట్టేనా?
X

ఐఫోన్ బ్రాండ్ నుంచి కొత్త సిరీస్ లాంఛ్ అవుతోందంటే చాలు యూజర్స్ చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తుంటారు. అదే సమయంలో యూజర్స్ అనుకున్న స్థాయిలో మొబైల్ లేకపోతే.. ఆ మొబైల్ కొనడానికి కూడా ఆసక్తి చూపించరు.. అలా ఇప్పుడు తాజాగా ఆపిల్ సంస్థ ఐఫోన్ 17 ఆవిష్కరణ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ బ్రాండ్స్ పైన పలు రకాల విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. దాంతో ఈ మొబైల్ కొనడానికి చాలామంది మక్కువ చూపలేదు. ఇదిలా ఉండగా మరోవైపు.. ఐఫోన్ -17 సిరీస్ మొబైల్స్ ని ఇండియాలో ఈనెల 12వ తేదీ నుంచి బుక్ చేసుకోవచ్చు. 19వ తేదీ నుంచి ఈ మొబైల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఇండియాలోని తన ఆన్లైన్ స్టోర్ నుంచి ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ మొబైల్స్ ని తొలగించడమే కాకుండా ఐఫోన్ - 15,15 ప్లస్ మోడల్స్ ను సైతం అధికారికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

అలాగే పాత మోడల్స్ కలిగిన ఆపిల్ వాచ్ తో పాటు ఎయిర్ పాడ్స్ ప్రో సైతం స్టోర్లో కనిపించలేదు. కేవలం ఐఫోన్లలో విడుదల చేసిన ఐఫోన్ 16, 16 ప్లస్, 16E మోడల్స్ మొబైల్స్ మాత్రమే ఆన్లైన్ స్టోర్ లో కొనసాగిస్తోంది. ప్రముఖ దిగ్గజ ఆన్లైన్ ఈ - కామర్స్ సంస్థలు అయిన ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లో మాత్రం 16 ప్రో, ప్రో మ్యాక్స్ వంటి మొబైల్స్ స్టాక్ పూర్తి అయ్యేవరకు మాత్రమే ఉండవచ్చు. ఏదేమైనా 16 ప్రో పై చాలామంది కస్టమర్లు మంచి రివ్యూలు ఇచ్చారు కానీ అలాంటి మోడల్స్ ని ఏకంగా స్టోర్ నుంచే తొలగించడం పై యాపిల్ పై కస్టమర్లలో కాస్త వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. మొత్తానికి అయితే ఇక భవిష్యత్తులో కూడా 16 సిరీస్ మోడల్స్ ను రూపొందించరేమో అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఐఫోన్ 17 సిరీస్ విషయానికి వస్తే.. సెప్టెంబర్ 9న విడుదల చేసిన ఐఫోన్ - 17 సిరీస్ నుంచి విడుదలైన మొబైల్స్ ఇండియాలో రూ .82,900 నుంచి రూ.2,29,000 లక్షల ధర పలికనున్నాయి. 128 GB మోడల్స్ ని ఈ మొబైల్స్ లో తీసుకురాకుండా.. స్టార్టింగ్ స్టోరేజ్ 256 GB ఉండే మొబైల్స్ ని విడుదల చేసింది. 17 ప్రో మ్యాక్స్ మొబైల్..256 GB, 512 GB, 1TBతో పాటుగా మొట్టమొదటిసారిగా 2Tb స్టోరేజ్ కలిగిన మొబైల్స్ ని తీసుకువచ్చింది ఆపిల్ సంస్థ..

ఆపిల్ - 17 pro Max.. మొబైల్ ధర విషయానికి వస్తే రూ .1,49,900 రూపాయల నుంచి మొదలవుతుంది.. యాపిల్ 17- pro మొబైల్ విషయానికి వస్తే.. రూ.1,34,900 ప్రారంభమవుతుంది. అతి సన్నని మొబైల్ గా ప్రకటించిన ఆపిల్ దీనిని.. ఆపిల్ ఎయిర్ అంటూ ప్రకటించింది. ఇక ఈ మోడల్ మొబైల్ (256GB నుంచి 1TB) ప్రారంభం ధర రూ.1,19,900 రూపాయలుగా నిర్ణయించింది. ఈ మోడల్స్ కలిగిన మొబైల్స్ అన్ని కూడా సెప్టెంబర్ 19 నుంచి భారత్ లో అందుబాటులోకి రానున్నాయి.