ఏపీలో `ఐఫోన్ల బాడీ` తయారీ యూనిట్.. ఎక్కడంటే
ఐఫోన్- దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత సురక్షిత మొబైల్‌కు ఐఫోన్ కేరాఫ్.
By: Garuda Media | 29 Aug 2025 9:55 PM ISTఐఫోన్- దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అత్యంత సురక్షిత మొబైల్‌కు ఐఫోన్ కేరాఫ్. అమెరికాకు చెందిన ఈ సంస్థ.. పలు దేశాల్లో విస్తరించేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుంది. దీనిలో భాగంగా ఏపీలోనూ ఐఫోన్ తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. దీనిద్వారా అల్యూమియన్ ముడి ఉత్పత్తులతో పాటు.. ఐఫోన్‌లలో వినియోగించే బాడీ(ఛాసిస్)లను తయారు చేస్తారు. దీనిద్వారా ప్రస్తుతానికి స్థానికంగా 1000 ఉద్యోగాలు అభించనున్నట్టు తెలుస్తోంది.
ఎక్కడంటే..
ఈ యూనిట్‌ను సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ఐఫోన్ బాడీ తయారీని హిందాల్కో ఇండస్ట్రీస్ ప్లాంట్ చేపట్టింది. ఈ సంస్థ కుప్పంలో హిందాల్కో ఇండస్ట్రీస్ ప్లాంట్ ను ఏర్పాటు చేసి.. ఇక్కడే అల్యూమినియం ఉత్పత్తులను ప్రారంభించనుంది. ముఖ్యంగా ఐఫోన్ చాసిస్ తయారీకి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మొత్తం 585 కోట్ల రూపాయలకు పైగానే పెట్టుబడులు పెట్టనున్నారు. మెజారిటీ భాగం అంతా ఎక్స్‌పోర్టులపైనే ఈ కంపెనీ నడవ నుంచి
అదేవిధంగా ఈ ప్లాంటు కింద అత్యాధునిక అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా అల్యూమినియం ఉత్పత్తులతో పాటు ఐఫోన్ బాడీలను తయారు చేస్తారు. ఈ కంపెనీ రాకతో కుప్పం నియోజకవర్గం `యాపిల్ గ్లోబల్ సప్లై చైన్`లో భాగస్వామ్యం అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలో మహారాష్ట్రలో మాత్రమే ఉన్న ఈతరహా కంపెనీ.. ఇప్పుడు కుప్పంలో డబుల్ సామర్థ్యంతో ఏర్పాటు అవుతోందని చెబుతున్నారు. దీనివల్ల స్థానికంగా ఉపాధి, ఉద్యోగాలు లభించనున్నట్టు పేర్కొన్నారు.
