Begin typing your search above and press return to search.

ఐఫోన్ లవర్స్ కి షాక్.. ఐఫోన్ 17 సిరీస్ ధరల పెంపు!

అసలు విషయంలోకి వెళ్తే.. టెక్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు సెప్టెంబర్ 9న లాంఛ్ కానున్నాయి.

By:  Madhu Reddy   |   30 Aug 2025 12:00 AM IST
ఐఫోన్ లవర్స్ కి షాక్.. ఐఫోన్ 17 సిరీస్ ధరల పెంపు!
X

ఒకప్పుడు కీప్యాడ్ ఫోన్ అంటేనే పెద్ద సంగతిగా చూసేవారు. కానీ కాలం మారుతున్న కొద్దీ పెద్దలు మొదలుకొని చిన్న పిల్లల వరకు చాలామంది చేతుల్లో స్మార్ట్ ఫోన్ కచ్చితంగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో స్కూల్ హోంవర్క్ కూడా ఆఖరికి స్మార్ట్ ఫోన్ కి సెండ్ చేస్తున్నారు అంటే టెక్నాలజీ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇటు స్మార్ట్ ఫోన్ లవర్స్ ఏ రేంజ్ లో అయితే పెరిగిపోతున్నారో అటు ఐఫోన్ వాడకం కూడా అంతే పెరిగిపోయింది. ప్రస్తుతం ఈ ఐఫోన్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో రూ.20,000 జీతం అందుకునే వ్యక్తి కూడా ఐఫోన్ ఉపయోగిస్తూ తమ కోరికను నెరవేర్చుకుంటున్నారు. అలా అందరికీ సరసమైన ధరల్లో లభిస్తూ అందరికీ చేరువ అవుతున్న ఈ ఐఫోన్ ఇప్పుడు సడన్ గా షాక్ ఇచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా ఐఫోన్ 17 సిరీస్ ధరల పెంపుతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. టెక్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు సెప్టెంబర్ 9న లాంఛ్ కానున్నాయి. ఈ సిరీస్ లో మొత్తం నాలుగు మోడల్స్ రానున్నట్లు తెలుస్తోంది.. అందులో బాగానే ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఉండనున్నట్లు సమాచారం. ఇకపోతే గతంతో పోల్చుకుంటే ఈసారి వచ్చే మోడల్స్ లో భారీ అప్ గ్రేడ్లు ఉంటాయని, అందుకే ధరల పెరుగుదలకు కూడా అవకాశం ఉందని టెక్ నిపుణులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఐఫోన్ 17, ఐఫోన్ 17 ప్రో మోడల్స్ ధరలు.. అమెరికాలో లీకయ్యాయి. దాదాపు 50 డాలర్ల పెంపు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే లీకైన వివరాలను బట్టి చూస్తే.. ఐఫోన్ 17 సిరీస్ ల ధరలు ఎంత ఉండవచ్చు అనే విషయం ఇప్పుడు చూద్దాం..

ఐఫోన్ 17 128 జీబీ వేరియంట్ ధర 849 డాలర్లుగా ఉండనున్నట్లు సమాచారం. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.84,990 అన్నమాట.

ఐఫోన్ 16 ప్రో ధర 999 డాలర్లు ఉండగా.. ఈసారి ఐఫోన్ 17 ప్రో ధర సుమారుగా 1,049 డాలర్లుగా ఉండబోతున్నట్లు సమాచారం..అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.1,24,990

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర 1,249 డాలర్లు కాగా.. ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.1,50,000.

ఇకపోతే ప్రస్తుతం ధరలు ఇలా ఉండబోతున్నాయని అందరూ అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆపిల్ సంస్థ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక ఐఫోన్ 17 సిరీస్ లాంచ్ ఈవెంట్ సెప్టెంబర్ 9 రాత్రి 10:30 గంటలకు లాంచ్ కానుంది.Apple.com, Apple TV ద్వారా ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.