పురుషుల దినోత్సవం ఎందుకు...?
నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. కానీ ఆ హడావిడి ఎక్కడ కనిపించదు. ఏ ఒక్కరూ మెన్స్ డే గురించి కనీసం సోషల్ మీడియాలోనూ పోస్ట్‌లు పెట్టడం లేదు.
By: Ramesh Palla | 19 Nov 2025 2:21 PM ISTమహిళా సాధికారత, సమానత్వం కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా ఉమెన్స్ డే ను జరుపుకోవడం అందరికీ తెలిసిందే. 1965 నుంచి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ను అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఉమెన్స్ డే కి ఉన్నంత ప్రచారం, ప్రాచుర్యం ఇంటర్నేషనల్ మెన్స్ డే కి ఉండదు అనే విషయం అందరూ ఒప్పుకునే నిజం. మహిళ దినోత్సవం ఎప్పుడు అంటే చాలా మంది వెంటనే చెప్పేస్తారు, కానీ మెన్స్ డే ఎప్పుడు అంటే మాత్రం వెంటనే చెప్పే పరిస్థితి లేదు. చాలా అరుదుగా మాత్రమే మెన్స్ డే కి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇండియాలో చాలా తక్కువగా మెన్స్ డే కార్యక్రమాలు జరుగుతాయి. నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. కానీ ఆ హడావిడి ఎక్కడ కనిపించదు. ఏ ఒక్కరూ మెన్స్ డే గురించి కనీసం సోషల్ మీడియాలోనూ పోస్ట్‌లు పెట్టడం లేదు.
ఇంటర్నేషనల్ మెన్స్ డే స్పెషల్...
1999 నుంచి ఇంటర్నేషనల్ మెన్స్ డే ను జరుపుకోవడం జరుగుతుంది. డాక్టర్ జెరోమ్ తిలక్ సింగ్ ఈ మెన్స్ డే ను ప్రతిపాధించారు. ఆడవారికి, ఇతర సామాజిక వర్గాల వారికి, పిల్లలకు, అందరికీ ప్రత్యేక రోజులు ఉన్నాయి. అలాంటప్పుడు ఎందుకు పురుషులకు ప్రత్యేక రోజు ఉండకూడదు అని ఆయన భావించారు. ముఖ్యంగా పురుషుల్లో కొందరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గురించి మాట్లాడేందుకు ఒక రోజు ఉండాలి అనే ఉద్దేశంతో డాక్టర్ జోరెమ్ తిలక్ సింగ్ నవంబర్ 19ని అంతర్జాతీయ పురుషుల దినోత్సవం గా నిర్ణయించారని అంటారు. పురుషుల్లో ఉన్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం సూచనల కోసం అన్నట్లుగా ఈ మెన్స్ డే జరుపుకోవాలి అనేది ఆయన అభిప్రాయం. కానీ ఆయన అనుకున్నట్లుగా మెన్స్ డే రోజున అలాంటి కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా ఎక్కడా కనిపించడం లేదు అనేది పురుషుల ఆవేదన.
మహిళ దినోత్సవం కు పోటీగా...
పేరుకు ఇంటర్నేషనల్ మెన్స్ డే ఉంది, కానీ పురుషులు సమాజంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆడవారి వల్ల పడుతున్న కష్టాలను ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లింగ సమానత్వం అనేది పురుషులకు సైతం అవసరం అనేది తిలక్ సింగ్ అభిప్రాయం. పురుషుల యొక్క ఆరోగ్యం, మానసిక సమస్యలపై శ్రద్ధ పెట్టాలనే ఉద్దేశంతో ప్రత్యేక రోజును నిర్ణయించారు. డాక్టర్ తిలక్ సింగ్ అనుకున్న లక్ష్యాలు నెరవేరాయా అనేది మాత్రం ఇప్పటికీ అనుమానంగానే ఉందని చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉంటారు. సమాజంలో పురుషుని పాత్ర అత్యంత కీలకం అనే విషయం అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. కానీ వారికి దక్కాల్సిన గౌరవం, గుర్తింపు ఏ మేరకు దక్కుతుంది అనేది మాత్రం పెద్ద ప్రశ్నగా ఉంది.
స్పెషల్ కార్యక్రమాలు ఎక్కడ?
ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సదర్భంగా జరిగే కార్యక్రమాలు, నిర్వహించే వేడుకల్లో కనీసం సగం అయినా ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా జరగడం లేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మగాళ్లు అంటే సమాజంలో గుర్తింపు గౌరవంతో ఉంటారు. కానీ వారు ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉంటాయి. వారి సమస్యల పరిష్కారం కోసం మెన్స్ డే సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆడవారితో సమానంగా మగవారికి ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పురుషులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం మొదలైన మెన్స్ డే ఏ మేరకు పని చేస్తుంది అంటే సమాధానం వెంటనే రావడం కష్టమే.
