Begin typing your search above and press return to search.

జ‌న‌సేన నేత‌ల్లో అసంతృప్తి.. రీజ‌నేంటి..!

ఎమ్మెల్యేల నుంచి నాయ‌కుల వ‌ర‌కు.. అంద‌రిదీ ఇదే మాట‌గా వినిపిస్తోంది. గ‌త ఎ న్నిక‌ల‌కు ముందు పొత్తు పెట్టుకుని అయినా.. అధికారంలోకి వ‌స్తే.. త‌మ ప్ర‌భావం పెరుగుతుంద‌ని నాయ‌కులు ఆశించిన మాట వాస్త‌వం.

By:  Garuda Media   |   22 Jan 2026 12:00 AM IST
జ‌న‌సేన నేత‌ల్లో అసంతృప్తి.. రీజ‌నేంటి..!
X

అధికారంలో ఉన్నా.. త‌మ‌కు ఎలాంటి ప‌వ‌ర్ లేకుండా పోయింద‌న్న ఆవేద‌న జ‌న‌సేన నాయ‌కుల్లో స్ప ష్టంగా క‌నిపిస్తోందా? ఎమ్మెల్యేల‌తోపాటు.. ఇత‌ర నాయ‌కులు కూడా ఇదే విష‌యంపై చ‌ర్చిస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన పార్టీ నాయ‌కులు ఏ ఇద్ద‌రు క‌లిసినా.. ఇదే విష‌యంపై చ‌ర్చిస్తున్నారు. పార్టీ ప‌రంగా వారికి ఎలాంటి ఇబ్బందులు లేక‌పోయినా.. ప్ర‌భుత్వంలో ఉన్నా.. త‌మ‌కు ప్రాధాన్యం లేద‌న్న ఆవేద‌న వారిని వేధిస్తోంది.

ఎమ్మెల్యేల నుంచి నాయ‌కుల వ‌ర‌కు.. అంద‌రిదీ ఇదే మాట‌గా వినిపిస్తోంది. గ‌త ఎ న్నిక‌ల‌కు ముందు పొత్తు పెట్టుకుని అయినా.. అధికారంలోకి వ‌స్తే.. త‌మ ప్ర‌భావం పెరుగుతుంద‌ని నాయ‌కులు ఆశించిన మాట వాస్త‌వం. కానీ, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. ఆధిప‌త్య రాజ‌కీయాల ముందు తాము నిలువ‌లే క పోతున్నామ‌న్న ఆవేద‌న అయితే.. వారిలో క‌నిపిస్తోంది. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. దాదాపు పార్టీలో ఉన్న అంద‌రినీ ఇదే స‌మ‌స్య వెంటాడుతోందన్న చ‌ర్చ సాగుతోంది.

పోల‌వ‌రంలో ఓ నాయ‌కుడు ఇటీవ‌ల బ‌హిరంగ వ్యాఖ్య‌లుచేయ‌డానికి ఈ అసంతృప్తే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. సొంత ప్ర‌భుత్వంలోనే టీడీపీని కార్న‌ర్ చేస్తూ.. స‌ద‌రు నేత చేస్తున్న వ్యాఖ్య‌లు.. వైసీపీని మించిపోయిన రేంజ్‌లో ఉన్నాయి. అలాగ‌ని పార్టీ నుంచి బ‌య‌ట‌కు పంపిస్తే.. ఈ విమ‌ర్శ‌ల దాడి మ‌రింత పెరుగుతుంద‌న్న ఆందోళ‌న కూడా ఉంది. అయితే.. బ‌య‌ట‌కు క‌నిపిస్తున్నంది ఒక‌రిద్ద‌రే అయినా.. ఎంతో మంది నాయ‌కులు ఇదే అభిప్రాయంతో ఉన్నార‌న్న‌ది తెలుస్తోంది.

ఏం చేయాలి..?

ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో జ‌న‌సేన నాయ‌కుల‌ను క‌లుపుకొని పోయేలా క్షేత్ర‌స్థాయిలో కూట‌మి ప్ర‌య‌త్నా లు చేయాలి. ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న ఎవ‌రితో ఎవ‌రికి అవ‌స‌రం.. అనే విష‌యంపైనా క్లారిటీ ఇవ్వాలి. ఇరు పార్టీలూ క‌లిసి ఉంటే ప్ర‌యోజ‌నం ఎలా ఉంటుందో గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో రుజువైనందున‌.. మ‌రోసారి ఇదే ప్ర‌యోజ‌నాన్ని పార్టీ నాయ‌కుల‌కు వివ‌రించాలి. అదేస‌మ‌యంలో గ్రౌండ్ లెవిల్లో ఉన్న చిన్న‌పాటి లోపాల‌ను స‌రిదిద్ద‌డం ద్వారా.. అధికారాన్ని అంద‌రికీ పంచ‌డ‌మో.. నియంత్రించ‌డ‌మో చేయాలి. లేక‌పోతే.. మున్ముందు మ‌రింత మంది నాయ‌కులు రోడ్డెక్క‌డం ఖాయ‌మ‌ని స్ప‌ష్టంగాతెలుస్తోంది.