Begin typing your search above and press return to search.

ఇన్ స్టాగ్రామ్ సెక్యూరిటీ వైఫల్యంపై డార్క్ వెబ్ లో షాకింగ్ వివరాలు.!

అవును.. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ సెక్యూరిటీకి సంబంధించిన ఓ కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది.

By:  Raja Ch   |   11 Jan 2026 9:00 AM IST
ఇన్  స్టాగ్రామ్  సెక్యూరిటీ వైఫల్యంపై డార్క్  వెబ్  లో షాకింగ్  వివరాలు.!
X

డబ్బులే కాదు ఆన్ లైన్ లో ఉన్న పేరు, ఊరు, చిరునామా, ఫోన్ నెంబర్స్ కి కూడా సెక్యూరిటీ లేని రోజుల్లో ఉన్నామనే సంగతి తెలిసిందే! ఈ అత్యంత సున్నితమైన డేటాను భద్రపరచడం కోసం ఆయా సంస్థలు అత్యంత జాగ్రత్తగా బలమైన సెక్యూరిటీ చర్యలు తీసుకుంటుంటాయి. అయినప్పటికీ జరిగే ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి! ఈ క్రమంలో ఇన్ స్టాగ్రామ్ లో కోట్ల మంది పర్సనల్ డేటా చోరీకి గురైందనే షాకింగ్ విషయం తెరపైకి వచ్చింది.

అవును.. ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్టాగ్రామ్ సెక్యూరిటీకి సంబంధించిన ఓ కీలక అప్ డేట్ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... ఇన్‌ స్టాగ్రామ్‌ లో పెద్ద భద్రతా ఉల్లంఘన జరిగిందని.. ఫలితంగా 1.75 కోట్ల మంది వినియోగదారుల డేటా లీక్ అయినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ మాల్వేర్‌ బైట్స్ నివేదించింది! ఈ మేరకు.. వినియోగదారుల పేరు, ఊరు, ఫోన్ నెంబర్, మొదలైన సమాచారం లీక్ అయ్యి, ఇవన్నీ డార్క్ వెబ్‌ లో అమ్మకానికి ఉంచబడ్డాయని తెలిపింది!

ఈ సందర్భంగా లీకైన వినియోగదారుల సమాచారంలో.. అకౌంట్ నేమ్, ఫుల్ నేమ్, ఇ-మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ వంటి వ్యక్తిగత సమాచారం ఉన్నట్లు చెబుతున్నారు. డార్క్ వెబ్ ను పర్యవేక్షిస్తున్నప్పుడు మాల్వేర్ బైట్స్ ఈ లీకులను కనుగొందని అంటున్నారు. ఈ నేపథ్యంలో.. లీక్ అయిన సమాచారాన్ని అమ్మకానికో, మరిదేనికైనానో ఉపయోగించుకోవచ్చని కూడా హెచ్చరించింది. అయితే.. ఇన్ స్టాగ్రామ్ మాతృసంస్థ మేటా నుంచి ఈ లీక్ కు సంబంధించి ఎలాంటి సమాచారం ప్రస్తుతానికి రాలేదు!

ఈ క్రమంలో.. చాలా మంది వినియోగదారుల నుంచి తమ పాస్‌ వర్డ్‌ లను రీసెట్ చేయమని అడుగుతూ సందేశాలు వస్తున్నట్లు చెబుతున్నారు. మరోవైపు... 2024లో జరిగిన ఇన్‌ స్టాగ్రామ్ డేటా లీక్ సమాచారం ఇప్పుడు డార్క్ వెబ్‌ లో మళ్లీ ప్రత్యక్షమైందని ఇంకొంతమంది అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. భద్రతా ముప్పు దృష్ట్యా కస్టమర్లు తమ పాస్‌ వర్డ్‌ లను వెంటనే మార్చుకోవాలని, అనుమానాస్పద సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు.