జగన్ కోసం టీడీపీ టీమ్.. ఛాన్స్ ఇవ్వకుండా.. !
క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తుంది. వచ్చే ఏడాదిన్నర తర్వాత..జగన్ పాదయాత్ర కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.
By: Garuda Media | 25 Jan 2026 7:00 AM ISTవైసీపీ అధినేత జగన్ ఏం చేసినా సంచలనమే. అది ప్రజల కోసం అయినా.. పార్టీ కోసమే అయినా.. ఆయన అడుగు తీసి అడుగు వేసినా.. ఇంట్లోనే కూర్చున్నా.. వార్తల రూపంలోవస్తూనే ఉంటాయి. ప్రత్యర్థి పార్టీ గా టీడీపీ నేతలు ఆయనకు కౌంటర్లు ఇస్తూనే ఉంటారు. ఇది గత పదేళ్లుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామం. ఇక, ఇప్పుడు టీడీపీ నుంచి కొత్తగా రెండు టీమ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు కూడా మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచే పనిచేయనున్నాయి.
1) క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తుంది. వచ్చే ఏడాదిన్నర తర్వాత..జగన్ పాదయాత్ర కు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు పాదయాత్ర ద్వారా ఆయన ఎలాంటి వైఖరిని అవలంభించనున్నారు? ప్రజలు ఎలాంటి సమస్యలను ప్రస్తావించే అవకాశం ఉందన్నది ఈ టీమ్ ముందుగానే పసిగట్టనుంది. క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల నాడిని పట్టుకోనుంది. తద్వారా.. క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించేలా సూచనలు చేయనుంది.
2) సోషల్ మీడియా టీం: ఇది క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనించి.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా కౌంటర్లు ఇవ్వనుంది. దీనికి గాను భారీ కసరత్తు చేస్తారు. జగన్ పర్యటనలకు ముందు గానే క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం చేస్తున్న మంచిని మరింతగా ప్రజల మధ్యకు తీసుకువెళ్లనున్నారు. తద్వారా.. జగన్ ఆరోపణలు చేసేందుకు.. విమర్శలకు .. అవకాశం ఇవ్వకుండా.. చూడాలన్నది టీడీపీ సంకల్పం. అటు క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారాన్ని ఇక్కడి బృందం సమన్వయం చేయనుంది.
అంటే.. మొత్తంగా ఈ రెండు బృందాలు కూడా.. ముందస్తుగానే ప్రభుత్వానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయనున్నాయి. అదేసమయంలో సంక్షేమ పథకాలు అందని వారి వివరాలను కూడా సేకరించి ప్రభుత్వానికి ఇవ్వనున్నాయి. తద్వారా.. జగన్ పాదయాత్ర చేసే సమయానికి అంతా బాగుందన్న విధంగా ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చేలా చేయనున్నారు. ఈ రెండు బృందాల నియామకాలను త్వరలోనే చేపట్టనున్నారు. బీటెక్ సహా.. ఐటీలో నిపుణులైన వారిని ఈ బృందాల్లో చేర్చుకుంటారు. దీనికి పార్టీ కార్యకర్తలే కావాల్సిన అవసరం లేదని అంటున్నారు.
