ప్రియుడు కోసం వెళ్లి మరో వ్యక్తితో పెళ్లి.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన తండ్రి!
ఈ జనరేషన్ లో ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్. ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకుంటే ఓకే లేకపోతే తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు.
By: Madhu Reddy | 30 Aug 2025 1:09 PM ISTఈ జనరేషన్ లో ప్రేమ పెళ్లిళ్లు చాలా కామన్. ఇంట్లో వాళ్ళు పెళ్లికి ఒప్పుకుంటే ఓకే లేకపోతే తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్లిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే అలా వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న వాళ్ళలో కొంతమంది హ్యాపీగా ఉంటే.. మరి కొంతమంది పెళ్లైన రెండు మూడు నెలలకి అడ్జస్ట్ కాకపోవడంతో విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఆ అమ్మాయి అందరిలాగే ఓ అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయితో పెళ్లికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరని నిర్ణయించుకొని లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంది. అలా రైల్వే స్టేషన్ వెళ్లి ప్రియుడి కోసం వెయిట్ చేసిన సమయంలో ఆమెకి ప్రియుడి నుండి ఫోన్ కాల్ వచ్చింది.ఆ కాల్ విన్న ఆ అమ్మాయి గుండె పగిలినంత పనైంది. కట్ చేస్తే ఆ అమ్మాయి ప్రియుడిని వదిలేసి మరో వ్యక్తిని పెళ్లాడింది. మరి ఇంతకీ ప్రియుడి కోసం వెళ్లి వేరే వ్యక్తిని ఆ అమ్మాయి ఎందుకు పెళ్లి చేసుకుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రస్తుతం మనం చెప్పుకోబోయే ఈ విషయం మన ఇండియాలోనే జరిగింది. అది కూడా మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో.. ఇండోర్ లోని స్థానిక ఎంఐజి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఓ యువతి చాలా రోజుల నుండి ఓ అబ్బాయిని ప్రేమిస్తోంది. అలా వీళ్ళిద్దరూ చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారు. చివరికి పెళ్లి చేసుకోవాలనే సమయంలో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదనో లేక ఇంట్లో చెప్పడానికి భయపడిందో ఏమో తెలియదు కానీ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకుంది. అలా ఆ యువతి తన ప్రియుడితో కలిసి ప్లాన్ వేసి ఇంటి నుండి పారిపోయి రైల్వే స్టేషన్ కి వచ్చింది. అయితే రైల్వే స్టేషన్ లో చాలాసేపటి నుండి ఆ యువతి వెయిట్ చేస్తున్నప్పటికీ తన ప్రియుడు రాకపోయేసరికి అనుమానం వచ్చి ఒకసారి ప్రియుడికి ఫోన్ చేసింది.కానీ ఆ ప్రియుడి నుండి షాకింగ్ రిప్లై వచ్చింది.నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను అక్కడికి రాలేను. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళిపో అని చెప్పారట. ప్రియుడు చెప్పిన మాటలకి ఆ యువతీ గుండె పగిలినంత పని అయింది. ఆ సమయంలో ఎవరైనా ఎక్కడికి వెళ్తారు. తిరిగి మళ్లీ ఇంటికి వెళ్తారు. కానీ ఈ అమ్మాయి మాత్రం ఇంటికి వెళ్లకుండా రైలు ఎక్కి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో చివరికి రత్లామ్ స్టేషన్లో దిగిపోయింది.ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ యువతికి ఒక తెలిసిన వ్యక్తి కనిపించారు..
ఆ వ్యక్తి తాను చదువుకున్న కాలేజీలో ఎలక్ట్రిషన్ గా పని చేసేవాడు. ఇద్దరికీ పరిచయం ఉండడంతో ఆ వ్యక్తికి తాను చేసిన తప్పు, ప్రియుడి వల్ల మోసపోయిన విషయం ప్రతి ఒక్కటి చెప్పింది. ఈ విషయం చెప్పడంతోనే వెంటనే నువ్వు ఇంటికి వెళ్ళిపో కరణ్ దీప్ నచ్చ జెప్పారట. కానీ ఆ అమ్మాయి మాత్రం నేను ఇలా ఇంటికి వెళ్తే మా నాన్న నన్ను బతకనివ్వరు. నేను కచ్చితంగా పెళ్లి చేసుకునే వెళ్తాను అంటూ ఏడ్చేసరికి ఆ యువతి బాధను అర్థం చేసుకున్న కరణ్ దీప్ నీకు నచ్చితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ సడన్ గా ప్రపోజ్ చేశారట. ఇక కరణ్ దీప్ ప్రపోజ్ చేయడంతోనే ఆ అమ్మాయికి ప్రాణం లేచి వచ్చినట్లయితే. ఎందుకంటే కష్టాల్లో ఉన్నవాడికి దేవుడే దిక్కు అన్నట్లు ఇంట్లో నుండి పెళ్లి చేసుకుంటానని పారిపోయి వచ్చిన అమ్మాయిని ప్రియుడు మోసం చేయడంతో చివరికి కరణ్ దీప్ దేవుడిలా వచ్చి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఆ యువతి అంగీకరించి చివరికి ఆ స్టేషన్ నుండి మహేశ్వర్ మండలేశ్వర్ కి వెళ్లి పెళ్లి చేసుకొని అక్కడి నుండి తిరిగి మందసౌర్ కి వచ్చారు.
అయితే తన కూతురు ఎక్కడికి వెళ్ళిందో తెలియని ఆ తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కూతురు ఆచూకీ కోసం వెతకడం స్టార్ట్ చేశారు.ఇక అదే సమయంలో యువతి తండ్రికి ఫోన్ చేసి నాన్న నేను ఎక్కడికి పోలేదు బానే ఉన్నాను మీరు కంగారు పడకండని చెప్పడంతో ఆ తండ్రి ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత స్థానిక ఎంఐజి పోలీస్ స్టేషన్ కి ఆ యువతి కరణ్ దీప్ తో కలిసి వచ్చింది. జరిగిందంతా చెప్పాక ఆ యువతి తండ్రి మీరిద్దరూ పెళ్లి చేసుకోవడాన్ని నేను ఒప్పుకుంటున్నాను. కానీ మీరిద్దరు 10 రోజులు విడివిడిగా ఉండండి. ఈ పది రోజుల తర్వాత కూడా మీ మధ్య ప్రేమ అలాగే ఉంటే నేనే మీకు పెళ్లి చేస్తానని కండిషన్ పెట్టారట.ఇక తండ్రి కండిషన్ తో ఆ యువతి తండ్రితో వెళ్లిపోయింది. ఇలా ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికని ఇంటి నుండి పారిపోయిన యువతి సినిమా స్టైల్ లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకోని వచ్చింది. ఇక ఇదంతా చూస్తూ ఉంటే బాలీవుడ్ లో ఒకప్పుడు వచ్చిన సూపర్ హిట్ మూవీ జబ్ వీ మెట్ అనే సినిమాలాగే ఉంది ఈ విషయం తెలిసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
