ఆస్ట్రేలియా క్రికెటర్లను అసభ్యం తాకినోడి దూల తీర్చేసిన పోలీసులు
ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు అకీల్ ఖాన్‌ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే అసలు సంచలనం పోలీసులే సృష్టించారు.
By: A.N.Kumar | 25 Oct 2025 10:15 PM ISTఇండోర్ నగరంలో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లపై జరిగిన దారుణ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని, ఆందోళనను రేకెత్తించింది. ఇద్దరు ఆస్ట్రేలియా విదేశీ మహిళా ఆటగాళ్లు వీధిలో నడుస్తున్నప్పుడు, ఓ వ్యక్తి వారిని అసభ్యంగా తాకి, వేధించిన ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి. ఈ ఘటన దేశ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉండటంతో, పోలీసులు తక్షణమే స్పందించారు.
ఈ దారుణానికి పాల్పడిన నిందితుడు అకీల్ ఖాన్‌ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అయితే అసలు సంచలనం పోలీసులే సృష్టించారు. అకీల్‌ను అరెస్టు చేసిన తర్వాత పోలీసులు విడుదల చేసిన ఓ వీడియోలో అతడు చేయి, కాలుకు కట్లతో కుంటుతూ కనిపించాడు. ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
నెటిజన్ల ప్రశంసలు
“దేశం పరువు తీసిన వాడికి పోలీసుల ట్రీట్‌మెంట్ సరిగ్గా ఇచ్చారు” అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున వ్యాఖ్యానిస్తున్నారు. మధ్యప్రదేశ్ పోలీసుల చర్యను ప్రజలు ప్రశంసిస్తూ, సోషల్ మీడియాలో "ఈసారి ఇండోర్ పోలీస్ జైహో" అంటూ కామెంట్లు పెడుతున్నారు. ప్రజల్లో మహిళా భద్రత, విదేశీ అతిథుల పట్ల గౌరవం ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. అయితే, పోలీసులు వేగంగా స్పందించి దేశ ప్రతిష్ఠను కాపాడారు అన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.
క్రికెట్ బోర్డుల స్పందన
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (CA) ఇప్పటికే ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. “భారతదేశంలో ఉన్నప్పుడు మా ఆటగాళ్లకు జరిగిన ఈ ఘటన చాలా బాధాకరం. భారత పోలీసులు తక్షణమే స్పందించినందుకు ధన్యవాదాలు” అని CA తెలిపింది. అదే విధంగా భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (BCCI) కూడా “ఇది దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ఘటన” అని పేర్కొని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఇండోర్‌లో ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్లను అకీల్ ఖాన్ అనే యువకుడు అసభ్యంగా తాకాడు. పోలీసులు వెంటనే నిందితుడు అకీల్ ఖాన్‌ను అరెస్టు చేశారు. విడుదలైన వీడియోలో నిందితుడు చేయి, కాలు కట్లతో కుంటుతూ కనిపించాడు.
దేశ ప్రతిష్ఠకు భంగం కలిగించిన వ్యక్తికి పోలీసులు ఇచ్చిన 'ట్రీట్‌మెంట్' ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మధ్యప్రదేశ్ పోలీసులు తమ చర్య ద్వారా స్పష్టం చేశారు.
