ఇండోర్ ఎయిర్ పోర్టులో టెకీ ప్యాంటులోకి దూరిన ఎలుక
భార్యతో కలిసి ఇండోర్ నుంచి బెంగళూరు వెళుతున్నాడు. ఇందులో భాగంగా భార్యతో కలిసి డిపార్చర్ హాల్ లో ఫ్లైట్ ఎక్కేందుకు వెయిట్ చేస్తున్నాడు.
By: Garuda Media | 25 Sept 2025 9:32 AM ISTఒక విమానాశ్రయంలో ఇలాంటి చేదు అనుభవం ఎవరికి ఎదురు కాదేమో? చదివినంతనే అసలిలా జరుగుతుందా? అన్న భావన కలిగేలా ఉన్న ఈ ఉదంతం సిత్రంగా ఉండటమే కాదు.. ఇదేం ఎయిర్ పోర్టురా బాబు? అనుకోకుండా ఉండలేం. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకున్న ఈ పరిణామం గురించి తెలిసిన వారంతా విస్తుపోతున్నారు. అసలేం జరిగిందంటే.. భోపాల్ కు చెందిన అరుణ్ మోడీ హైదరాబాద్ లోని ఒక ఐటీ సంస్థలో పని చేస్తున్నాడు.
భార్యతో కలిసి ఇండోర్ నుంచి బెంగళూరు వెళుతున్నాడు. ఇందులో భాగంగా భార్యతో కలిసి డిపార్చర్ హాల్ లో ఫ్లైట్ ఎక్కేందుకు వెయిట్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తన ఫ్యాంటులోకి ఏదో కదులుతున్నట్లుగా అనిపించింది. వెంటనే కంగారు పడిన అతను.. ఎంత దులిపినా రాకపోవటం.. కరిచినట్లుగా నొప్పి రావటంతో కంగారు పడిన అతన్ని.. తోటి ప్రయాణికుల సాయంతో ప్యాంటు విప్పారు
ప్యాంటు లోపలకు దూరిన ఎలుక పిల్లను పట్టుకున్నారు. దాన్ని ఒక కవరులో ఉంచి ఎయిర్ పోర్టు సిబ్బందికి అప్పగించారు. ప్యాంటు లోపలకు దూరిన ఎలుక కరవటంతో అరుణ్ కు గాయమైంది. ఎయిర్ పోర్టులో రేబిస్ ఇంజెక్షన్ అందుబాటులో లేకపోవటంతో ఫస్ట్ ఎయిడ్ చేశారు. అతను నొప్పితోనే ఫ్లైట్ ఎక్కాడు. బెంగళూరుకు చేరుకున్న అతడికి అక్కడి ఎయిర్ పోర్టులో రేబిస్ ఇంజక్షన్ చేశారు. ఇలాంటి ఉదంతం ఎయిర్ పోర్టులో చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది.
