ఇండియన్ డీఎన్ఏ...నా శరీరం కదిలిపోతుంది !
ఈ ప్రపంచంలో ఏ దేశ అధ్యక్షుడు కానీ ప్రధాని కానీ అనని అతి గొప్ప మాటలను ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో అన్నారు.
By: Satya P | 8 July 2026 8:09 AM ISTఈ ప్రపంచంలో ఏ దేశ అధ్యక్షుడు కానీ ప్రధాని కానీ అనని అతి గొప్ప మాటలను ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటో అన్నారు. మొత్తం 140 కోట్లకు పైగా ఉన్న భారతీయులు అంతా రోమాలు నిక్కబొడుచుకుని ఆనందించేలా గర్వించేలా ఇండోనేసియా అధ్యక్షుడి మాటలు ఉన్నాయి. అంతే కాదు ప్రపంచానికి కూడా భారత్ అంటే ఏంటో చాలా గ్రేట్ గా అభివర్ణించి చెప్పారు. ఆ గొప్ప మాటలు ఏంటి అంటే నాది ఇండియన్ డీఎన్ఏ అని సుబియాంటో బిగ్గరగా ప్రవాస భారతీయుల సమావేశంలో చెప్పడం.
ఇండియా గొప్పతనం అంటే :
మన దేశం గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం, కానీ ప్రపంచంలోని ఇతర దేశాల వారు మరీ ముఖ్యంగా అధినేతలు వర్ణించి చెబుతూంటే కలిగే ఆ ఆనందం వర్ణనాతీతం అని చెప్పాలి. ఇపుడు అదే జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా తాజా పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు భారత్ ని ఎంతగానో ప్రశంసించారు. ఆయన మాట్లాడిన మాటలు అన్నీ ఆయన గుండె లోతుల్లో నుంచి వచ్చినవే అని ఆయన బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన భావోద్వేగాలు కానీ తెలియచేస్తున్నాయి. సుబియాంటో మాట్లాడుతూ భారత్ గొప్ప ప్రజాస్వామిక దేశమని అన్నారు. ఆ దేశం నుంచి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాల్సి ఉందని కూడా అన్నారు.
డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే :
ఇదిలా ఉంటే తాను 2025లో ఇండియాలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు వెళ్ళాను అని గుర్తు చేసుకున్నారు. దాని కంటే ముందే తాను డీఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే అందులో తనది ఇండియన్ డీఎన్ఏ అని తేలింది అని చెప్పి సుబియాంటో షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతే కాదు భారతీయ సంగీతం విన్నప్పుడల్లా తన శరీరం కదులుతుందని అన్నారు. భారత్ గురించి ఈ విధంగా ఆయన చెప్పిన గ్రేట్ వర్డ్స్ ఇపుడు భారత్ మాత్రమే కాదు ప్రపంచమంతా వింటోంది. ఇది చాలు కదా భారత్ ఎంత గొప్ప దేశమో మరోసారి తలచుకుని ప్రతీ భారతీయుడు మురిసిపోవడానికి.
మోడీని కాపీ కొడుతూ :
అంతే కాదు సుబియాంటో మరో మాట కూడా అన్నారు. తాను ప్రధాని నరేంద్ర మోడీ పాలనను ఆయన పాలసీలను గురించి పూర్తిగా ఫాలో అవుతాను అని. వాటిని తాను కాపీ కొడుతున్నాను అని కూడా చెప్పారు. ఈ విషయంలో కాపీ రైట్స్ కూడా లేవు అని ఆయన చలోక్తి విసిరారు. ఆ తరువాత మాట్లాడిన నరేంద్ర మోడీ కూడా భారత్ ఇండోనేషియాలది సరిహద్దులను చెరిపేసిన స్నేహ బంధం అన్నారు. ఈ రెండు దేశల మధ్య ఎంతో దోస్తీ ఉందని అన్నారు. కాపీ రైట్స్ అవసరం లేని ప్రేమాభిమానాలు రెండు దేశాల మధ్య ఉన్నాయని మోడీ కూడా సరదాగా వ్యాఖ్యానించారు. మొత్తం మీద చూస్తే నా డీఎన్ఏ ఇండియన్ అని గొప్పగా గర్వంగా చెప్పుకున్న ఒక దేశాధినేత భారత్ ఖ్యాతిని ప్రపంచం ముందు కళ్ళకు కట్టారు అని చెప్పాల్సి ఉంది.
