Begin typing your search above and press return to search.

రీఫండ్ పై ఇండిగోకు కేంద్రం స్టిక్ట్ ఆర్డర్.. టికెట్ రేట్స్ ప్రకటన.. మిస్ అయిన వాటి సంగతేంటి?

ఇండిగో విమానయాన సంస్థ నిర్వాకం వల్ల ప్రయాణాలు కోల్పోయి చాలా మంది ప్రయాణికులు ఎంతో కోల్పోయారు.

By:  A.N.Kumar   |   6 Dec 2025 5:58 PM IST
రీఫండ్ పై ఇండిగోకు కేంద్రం స్టిక్ట్ ఆర్డర్..  టికెట్ రేట్స్ ప్రకటన.. మిస్ అయిన వాటి సంగతేంటి?
X

ఇండిగో విమానయాన సంస్థ నిర్వాకం వల్ల ప్రయాణాలు కోల్పోయి చాలా మంది ప్రయాణికులు ఎంతో కోల్పోయారు. ఈ కథలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. తల్లి మరణించినా వెళ్లలేని దుస్థితి ఒక వ్యక్తిది. ఏకంగా స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ మిస్సైన టీమ్.. విదేశాల్లో జాబ్ కు వెళుతూ నిలిచిపోయిన యువకులు..ప్రయాణాలు వాయిదా పడడంతో నష్టపోయిన కుటుంబాలున్నాయి.. ఇక ఇదే ఎయిర్ పోర్టుల్లో ఎదురుచూసి చూసి అనారోగ్యం బారిన పడ్డ వృద్ధులు ఎంతో మంది ఉన్నారు.

ఇలా ఎయిర్ పోర్టుల్లో ఇండిగో చేసిన నిర్వాకం వల్ల బాధితులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి ఉద్విగ్న వాతావరణం వేళ సోషల్ మీడియాలో కేంద్రం, విమానయాన శాఖ, విమానయాన మంత్రిపై మండిపడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది.

*రాత్రి లోపు రీఫండ్ చేయాలని ఇండిగోకు కేంద్రం ఆదేశం

ఇండిగో సంస్థ రద్దయిన విమానాల నుంచి ప్రయాణికులకు రీఫండ్ గా ఫుల్ అమౌంట్ ఇవ్వడం లేదు.. జనరల్ గా విమాన టికెట్ క్యాన్సిల్ అయితే జనరల్ ఫీజుగా 2700 వరకూ విమానయాన సంస్థలు కట్ చేసుకొని రీఫండ్ ను బుక్ చేసిన వినియోగదారుల ఖాతాల్లో వేస్తాయి. ఈ క్యాన్సలైజేషన్ చార్జీలు విధిస్తాయి. ఫ్లైట్ సంస్థ తరుఫున వివిధ కారణాల వల్ల క్యాన్సిల్ అయినా కూడా ఈ చార్జీలను విమానయాన సంస్థలు తీసుకుంటాయి. ఇండిగో కూడా అదే చేసినట్టు సమాచారం. దీంతో కేంద్రం రంగంలోకి దిగింది.

టికెట్లు రద్దు అయిన ప్రయాణికులందరికీ ఆలస్యం లేకుండా రీఫండ్ చేయాలని ఇండిగో సంస్థను కేంద్ర విమానయాన సంస్థ ఆదేశించింది. అందుకు రేపు రాత్రి 8 గంటల వరకూ గడువు విధించింది. ప్రయాణికులకు ఎలాంటి రీషెడ్యూలింగ్ ఛార్జీలు విధించివద్దని స్పష్టం చేసింది. రీఫండ్ ప్రాసెస్ లో అలసత్వం వహిస్తే తక్షణ చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఇవాళ కూడా ఇండిగోకు చెందిన వందల ఫ్లైట్లు రద్దు అయ్యాయి. దీంతో ఇండిగో వివాదం మరింత ముదురుతోంది. కేంద్రం కూడా రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపడుతోంది.

*విమాన టికెట్ రేట్లు ప్రకటించిన కేంద్రం

ఇండిగో సంక్షోభం వేళ టికెట్ల చార్జీలపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది. దేశీయ విమాన సర్వీసులకు రేట్లను ప్రకటించింది. 500 కి.మీల వరకూ టికెట్ ధరను రూ.7500 గా నిర్ధారించింది. 500-1000 కి.మీలకు రూ.12 వేల వరకూ, 1000-1500 కి.మీలకు రూ.15వేల వరకూ , 1500 కి.మీల పైన ఉంటే రూ.18వేల వరకూ మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఇండిగో ఫ్లైట్లు రద్దు కావడంతో మిగతా ఎయిర్ లైన్స్ టికెట్ ధరలను భారీగా పెంచగా కేంద్రం ఈ దిద్దుబాటు చర్యలకు దిగి రేట్లను స్థిరీకరించే పని చేపట్టింది.

అయితే టికెట్ డబ్బులను రీఫండ్ చేస్తున్న ఇండిగో సంస్థ క్యాన్సేలేషన్ తన వల్ల జరిగినా డబ్బులను కట్ చేయడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. తాము కోల్పోయిన వాటిని ఇండిగో తిరిగి తీసుకురాగలదా? అంటూ ప్రయాణికులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

మొత్తంగా ఇండిగో వ్యవహారం వల్ల ఇప్పుడు ప్రయాణికులు అవస్థలు పడ్డారు. రేట్లు పెరిగి తిరిగి ప్రయాణికుండా పరిస్థితులు ఎదురయ్యాయి. కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టినా వినియోగదారులు కోల్పోయిన దానికి ఏమీ ఇచ్చినా ఈ సమస్య పరిష్కారం అయ్యే సూచనలు కనిపించడం లేదు.