ఇండిగో రగడ : రూ.610 కోట్లు రీఫండ్
భారీ స్థాయిలో విమాన సర్వీసులు రద్దు కావడం.. వాయిదాలతో ఇండిగో ఎయిర్ లైన్స్ ఇటీవల తీవ్ర విమర్శలను ఎదుర్కొంది.
By: A.N.Kumar | 8 Dec 2025 1:00 AM ISTభారీ స్థాయిలో విమాన సర్వీసులు రద్దు కావడం.. వాయిదాలతో ఇండిగో ఎయిర్ లైన్స్ ఇటీవల తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. దీని కారణంగా ప్రయాణికులు ఎదుర్కొన్న గందరగోళం అసౌకర్యం వర్ణించలేనిది.. ప్రణాళికలో లోపం కారణంగా కమ్యూనికేషన్ లేక కనెక్షన్లు మిస్సయి వేలాది మంది ప్రయాణికుల ప్రయాణాలు తారుమరయ్యాయి..
610 కోట్లు రీఫండ్ తో ఉపశమనం
ఈ విమాన సేవల రద్దు ప్రభావంతో ఇండిగో ప్రయాణికులకు పెద్దమొత్తంలో డబ్బులనురీఫండ్ చేస్తోంది. విమానయాన శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకూ రూ.610 కోట్లు రీఫండ్ చేసినట్లుగా పేర్కొన్నారు. ప్రస్తుతం 95 శాతం సర్వీసులను పునరుద్దరించినట్లు ఇండిగో ఎయిర్ లైన్స్ తెలిపింది. డిసెంబర్ 10 నుంచి 15 మధ్యలో సేవలు సాధారణ స్థితికి చేరుకుంటాయని సంస్థ పేర్కొంది.
డీజీసీఏ జోక్యం.. షోకాజ్ నోటీస్
భారీ స్థాయిలో విమాన సేవలకు అంతరాయం ఏర్పడటంపై డీజీసీఏ దృష్టి సారించింది. ఈ సమస్యపై డీజీసీఏ ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ కు షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇటీవలి రద్దుల వల్ల ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులను కలిగించాయని రెగ్యులేటర్ పేర్కొంది. ప్రత్యామ్మాయ ఏర్పాట్లు లేకపోవడం.. అవసరమైన సమయంలో ఎయిర్ లైన్స్ మద్దతు అందించడంలో విఫలం కావడంపై డీజీసీఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఇండిగోపై ఎందుకు చర్య తీసుకోకూడదో 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని పీటర్ ఎల్బర్స్ ను డీజీసీఏ ఆదేశించింది.
ప్రణాళిక లోపం ఎక్కడ జరిగింది?
ఈ సంక్షోభం తలెత్తడానికి ప్రధాన కారణం ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ పథకంలో చేసినమార్పులకు ఇండిగో తగినట్లుగాసిద్ధంకాకపోవడమే.. ఇతర విమానయాన సంస్థలు ఈ కొత్త నిబంధనలకు సులభంగా అనుగుణంగా మారగా.. ఇండిగో మాత్రం సిబ్బంది షెడ్యూల్ లు, విమానయాన కేటాయింపులను నిర్వహించడంలో ఇబ్బంది పడింది. ప్రణాళికలో జరిగిన ఈ లోపం ప్రయాణికులకు ఆకస్మిక రద్దులు,సరైన సమాచారం లేకుండా సుధీర్ఘ నిరీక్షణగా మారింది.
కార్యాచరణ విశ్వసనీయత, ప్రయాణీకుల సంరక్షణకు సీఈవో నేరుగా బాధ్యత వహించాలని డీజీసీఏ పేర్కొంది. ఈ వ్యవస్థలు విఫలమైనప్పుడు.. జవాబుదారీతనం తప్పక ఉంటుంది. అంతర్గత ప్రణాళిక సమస్యలు ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాయని స్పష్టమైంది. పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఇలాంటి లోపాలు మళ్లీ పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విమాన సేవలను సాధారణ స్థితికి తీసుకురావడానికి తమ నెట్వర్క్ ను రీసెట్ చేయడంలో భాగంగానే తాము విమానాలను రద్దు చేశామని ఇండిగో అంగీకరించింది. అంతరాయం తారాస్థాయిలో ఉన్నప్పుడు 700 సర్వీసులు మాత్రమే నడపగా..తర్వాత రోజు 1500 కిపైగా సర్వీసులతో కార్యకలాపాలు మెరుగుపడ్డాయి.
ఈ టోటల్ఎపిసోడ్ చూస్తే.. ఇండిగో ప్రణాళిక, సంక్షోభ నిర్వహణలో ఉన్నలోపాలను బహిర్గతం చేసింది. ప్రయాణికుల నమ్మకాన్ని తిరిగి సంపాదించుకోవడానికి మెరుగైన ప్రణాళిక , స్పష్టమైన కమ్యూనికేషన్, ప్రయాణికుల సమాయానికి గౌరవం ఇవ్వడం అత్యవసరం. కేవలం వివరణలు ఇవ్వడం కాకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి.
