దేశంలో బిగ్ డిబేట్: ఒక దుఖం-ఒక ఆనందం!
దేశంలో బుధవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారత దిగ్గజ పారా(దివ్యాంగ) క్రీడాకారుడు నీరజ్ యాదవ్ ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నారు.
By: Garuda Media | 29 Oct 2026 12:00 AM ISTఒకే రోజు జరిగిన రెండు ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. వీటిలో ఒకటి తీవ్ర విషాద ఘటన అయితే.. మరొకటి అమితానందైన సందర్భం. ఈ రెండు ఒకే రోజు.. దాదాపు ఒకే సమయంలో జరగడం గమనార్హం. అంతేకాదు.. అంతర్జాతీయంగా కూడా ఈ రెండు ఘటనలకు ప్రాధాన్యం ఉండడం.. ఇంటర్నేషనల్ మీడియా సైతం.. వీటికి ప్రాధాన్యం ఇవ్వడం మరింత చర్చీకు దారితీసింది.
ఒక సంతోషం..
గత సెప్టెంబరు 30న ఇజ్రాయెల్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఫై-దుబాయ్ విమానంలో ఉగ్రవాద ప్రేరేపిత కో పైలట్ చేసిన దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ కెప్టెన్.. స్మిత్ మచ్చర్‌కు.. దుబాయ్ ప్రభుత్వం అత్యున్న పౌర పురస్కారాన్ని అందించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు, పాలకుడు.. షేక్ మహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తరఫున దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్.. స్మిత్‌కు 'ఫస్ట్ క్లాస్ ఆర్డర్ ఆఫ్ జాయెద్ II' పురస్కారాన్ని ప్రదానం చేశారు.
ఆ నాడు.. విమానంలో 130 మంది ప్రయాణికులు ఉన్నారు. ఉగ్రవాద ప్రేరేపిత కో పైలట్.. విమానాన్ని హైజాక్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే.. దీనిని ప్రతిఘటించిన.. స్మిత్ తాను తీవ్రంగా గాయపడినా.. ప్రయాణికులను రక్షించారు. అప్పట్లో ఈ ఘటన అంతర్జాతీయంగా చర్చకు, స్మిత్‌కు ప్రశంసలు తీసుకువచ్చింది. నాటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న స్మిత్.. తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో దుబాయ్ పాలకుడు పౌర సన్మానం చేశారు. ఇది సంతోషం.
ఒక విషాదం..
దేశంలో బుధవారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారత దిగ్గజ పారా(దివ్యాంగ) క్రీడాకారుడు నీరజ్ యాదవ్ ఆత్మహత్యకు పాల్పడి ప్రాణాలు తీసుకున్నారు. ఈయన ప్రతిభ అనన్య సామాన్యమని.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొనియాడిన విషయం ప్రస్తావనార్హం. మూడు సార్లు ఏకంగా స్వర్ణ పతకాలు తీసుకువచ్చిన నీరజ్.. మానసికంగా కుంగిపోయి.. 42వ ఏట ఇంట్లోనే.. విషం గుళికలు తీసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఇటీవల పారా ఆసియా క్రీడలు జరిగాయి. అయితే.. డోపింగ్ టెస్టులో పాజిటివ్ రావడంతో ఆయనను క్రీడల నుంచి నిషేధించారు. ఈ వ్యవహారంతో మానసికంగా కుంగిపోయి ఉంటారని తోటి క్రీడాకారులు చెబుతున్నారు. నీరజ్ మృతి పట్ల ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
