ఇండస్ట్రీ మారుతుంది.. స్కిల్స్ అప్‌డేట్ చేసుకుంటేనే భవిష్యత్తు సేఫ్.
కాలం మారుతోంది. ఆ కాలానికి అనుగుణంగా మనం మారాలి. మారకుంటే వెనుకబడిపోతాం.. ఉద్యోగాల్లోంచి దిగిపోతాం. అందుకే ఫోన్లు అప్టేట్ అయినట్టు మనం కూడా అప్టేట్ కావాలి.
By: A.N.Kumar | 15 Dec 2025 10:00 PM ISTకాలం మారుతోంది. ఆ కాలానికి అనుగుణంగా మనం మారాలి. మారకుంటే వెనుకబడిపోతాం.. ఉద్యోగాల్లోంచి దిగిపోతాం. అందుకే ఫోన్లు అప్టేట్ అయినట్టు మనం కూడా అప్టేట్ కావాలి. లేకుంటే కష్టమే. స్కిల్స్ డెవలప్ చేసుకుంటేనే భవిష్యత్తు సేఫ్ గా ఉంటుంది. ఇండస్ట్రీలో మనుగడ సాధ్యమవుతుంది. కంపెనీలు వాళ్ల అవసరాలకు అనుగుణంగా మనం మారాల్సి ఉంటుంది.
అయితే ఇప్పుడు సాఫ్ట్ వేర్ కంపెనీలు సైతం ఉద్యోగులను చీట్ చేస్తున్నాయి. అవి డాలర్లలో సంపాదిస్తున్నాయి. కానీ ఉద్యోగులకు రూపాయల్లోనే జీతాలు ఇస్తున్నాయి. ఈ కరెన్సీ గ్యాప్ నే భారతీయ ఐటీ రంగాన్ని దశాబ్ధాలుగా నడిపింది. అయితే 2000-2010 గోల్డెన్ ఎరా ముగిసింది. ఏఐ, ఆటో మేషన్ తెచ్చిన మార్పుల మధ్య నిలబడాలంటే స్కిల్స్ అప్ డేట్ చేసుకోవడమే ఏకైక మార్గంగా కనిపిస్తోంది.
బిజినెస్ మోడల్ : డాలర్ వర్సెస్ రూపాయి
సాఫ్ట్ వేర్ కంపెనీల బిజినెస్ మోడల్ ని పరిశీలిస్తే ఒక ఆసక్తికరమైన సత్యం స్పష్టంగా కనిపిస్తోంది. సర్వీసులు, ప్రోడక్స్ , ఎస్.ఏఏఎస్ , డిజిటల్ యాడ్స్ ద్వారా ప్రధానంగా డాలర్లలో సంపాదిస్తాయి. అయితే అదే సమయంలో ఉద్యోగులకు రూపాయల్లో జీతాలు చెల్లిస్తాయి. ఈ కరెన్సీ గ్యాప్ వల్ల అంటే తక్కువ ఖర్చుతో కూడిన మానవ వనరులు.. గత రెండు దశాబ్ధాలుగా భారతీయ ఐటీ రంగాన్ని ప్రపంచంలోనే అత్యంత ఆకర్షనీయమైన ఔట్ సోర్సింగ్ కేంద్రంగా నిలబెట్టింది.
2000-2010 సాఫ్ట్ వేర్ గోల్డెన్ ఏరా
2000 వ సంవత్సరం నుంచి 2010 మధ్య కాలాన్ని భారతీయ ఐటీకి నిజమైన గోల్డెన్ ఏరాగా చెప్పవచ్చు. దీనికి పలు కారణాలున్నాయి. Y2K సమస్యతో మిలినియం బగ్ ను పరిష్కరించడానికి ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల అవసరం పెరిగింది. ఖర్చు తగ్గించుకోవడం కోసం అమెరికా , యూరప్ కంపెనీలు తమ ఐటీ పనులను భారతదేశానికి ఔట్ సోర్స్ చేయడం ప్రారంభించాయి. తక్కువ ఖర్చుతో అత్యధిక నైపుణ్యం కలిగిన భారతీయ ఇంజినీర్లు అందుబాటులోకి రావడం కంపెనీలకు ప్లస్ అయ్యింది.ఈ అంశాలన్నీ కలిసి లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించాయి. అప్పట్లో ప్రెషర్ అయినా.. సాధారణ స్కిల్ ఉన్నా సరే.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం దొరికేది. ఐటీ అంటే లైఫ్ సెట్ అనే భావన బలంగా నాటుకుపోయింది.
మారుతున్న కాలం.. ఏఐ-ఆటోమేషన్
కాలం ఇప్పుడు మారుతోంది. టెక్నాలజీ ప్రపంచం నిరంతరం మారుతూ ఉంటోంది. నేటి పరిస్థితిని గమనిస్తే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ఆటోమేషన్ , క్లౌడ్ కంప్యూటింగ్, లో కోడ్/నో కోడ్ టూల్స్ కారణంగా అనేక రోటీన్ పనులు ఇప్పుడు యంత్రాలే చేస్తున్నాయి.ఒకప్పుడు 10 మంది ఇంజినీర్లు చేస పని ఇప్పుడు కేవలం 2,3 మందితోనే లేదంటే అధునాతన టూల్స్ తోనే పూర్తవుతోంది. ఫలితంగా పాత స్కిల్స్ ఉన్న ఉద్యోగులను తగ్గిస్తున్నారు. కొత్తగా ఉద్యోగ నియామకాలను నిలిపివేస్తున్నారు. పాత స్కిల్స్ ఉన్నవారికి బదులు, కొత్త డీప్ స్కిల్స్ ఉన్న వారికి మాత్రమే అవకాశాలు లభిస్తున్నాయి. ఇది సాప్ట్ వేర్ రంగం పతనమవుతోందనే సంకేతం కాదు. కానీ ఇకపై పాత పద్ధతులతోనే కేవలం డిగ్రీతోనే కొనసాగడం కష్టమనే హెచ్చరిక మాత్రం ఖచ్చితంగా ఇస్తోంది. దీన్ని బట్టి మీ స్కిల్స్ ను మీరు నిరంతరం అప్టేట్ చేసుకుంటనే మీ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది.
సాఫ్ట్ వేర్ రంగం ఇప్పటికీ అత్యంత శక్తివంతమైన, అత్యధిక అవకాశాలున్న రంగమే.. కానీ ఇది ఇక పై ‘ఈజీ జాబ్స్’ దొరికే రంగం మాత్రం ఎంత మాత్రం కాదు. ఇది తెలివైన, వేగంగా నేర్చుకోగల, కొత్త టెక్నాలజీలకు అడాప్ట్ అయ్యే వ్యక్తులను కోరుకునే రంగం.
