Begin typing your search above and press return to search.

ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో.. బంధానికి తెరదించిన స్మృతి మంధానా, పలాష్ ముచ్చల్

టీమిండియ మహిళా క్రికెట్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానా, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ తమ వివాహాన్ని అధికారికంగా రద్దు చేసుకున్నారు.. వీరిద్దరూ తమ సుధీర్ఘకాల సంబంధానికి ముగింపు పలికారు.

By:  A.N.Kumar   |   7 Dec 2025 5:48 PM IST
ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో..  బంధానికి తెరదించిన స్మృతి మంధానా, పలాష్ ముచ్చల్
X

టీమిండియ మహిళా క్రికెట్ వైస్ కెప్టెన్ స్మృతి మంధానా, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ తమ వివాహాన్ని అధికారికంగా రద్దు చేసుకున్నారు.. వీరిద్దరూ తమ సుధీర్ఘకాల సంబంధానికి ముగింపు పలికారు. ఈరోజు ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో అధికారికంగా ప్రకటించారు. ఆదివారం విడివిడిగా ప్రకటనలు విడుదల చేశారు. ఈ ప్రకటనలు విడుదలైన కొద్దిసేపటికే వారు తమ ఇన్ స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం గమనార్హం.




కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట నవంబర్ 23న వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే మంధాన తండ్రికి గుండెపోటు రావడంతో వివాహం నిరవధికంగా వాయిదా పడింది. దీని తర్వాత వరుడు పలాష్ కూడా అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో వీరి పెళ్లికి బ్రేక్ పడింది.

అయితే ఈ ఘటన తర్వాత మంధానా తన ఖాతా నుంచి వివాహానికి సంబంధించిన అన్ని పోస్టులను తొలగించడంతో వీరి బంధంపై సోషల్ మీడియాలో ఊహాగానాలు పెరిగాయి.

తాజాగా ఈ వందతుల వేళ మంధాన, ముచ్చల్ ఇద్దరూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో అధికారిక ప్రకటనలు విడుదల చేశారు. తమ వివాహం రద్దు అయినట్టు ధ్రువీకరించి గోపత్యను కోరారు. స్మృతి మంధానా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ విషయాన్ని వదిలేయాలని... తన కెరీర్ పై తన దృష్టి కొనసాగుతానని స్పష్టం చేసింది. ‘గత కొన్ని వారాలుగా నా జీవితం గురించి చాలా ఊహాగానాలు వచ్చాయి. ఈ సమయంలో మాట్లాడడం నాకు ముఖ్యం అనిపించింది. నేను చాలా వ్యక్తిగతమైన వ్యక్తిని అలాగే ఉండాలని కోరుకుంటున్నా.. పెళ్లి రద్దు అయ్యిందని నేను స్పష్టం చేయాలి ’ అని ఆమె రాసింది.

పలాష్ ముచ్చల్ కూడా తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో నోట్ ను పంచుకున్నారు. ‘నా జీవితంలో ముందుకు సాగాలని.. నా వ్యక్తిగత సంబంధం నుంచి వైదొలగాలని నేను నిర్ణయించకున్నాను’ అని ముచ్చల్ పేర్కొన్నారు. నిరాధారమైన వార్తలు రాసే వారికి తన టీం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ముచ్చల్ ధ్రువీకరించారు.

ఇక విడిపోతున్నట్టు.. పెళ్లి రద్దు చేసుకున్నట్టు స్పష్టం చేస్తూ ప్రకటనలు విడుదల చేసిన కొద్దిసేపటికే ఈ మాజీ జంట ఇన్ స్టాగ్రామ్ లో ఒకరికొకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఈ చర్య వారి బహిరంగ , వ్యక్తిగత సంబంధానికి ముగింపు పలికింది. వారు విడిపోవడంలో ఇది చివరి అడుగు.. వారి ప్రొఫైల్స్ నుంచి జంట ఫొటోలు కూడా చాలా వరకూ తొలగించబడ్డాయి. దీంతో వీరి బంధానికి శాశ్వత ముగింపు పడింది.