అమెరికా టెక్ ప్రపంచాన్ని షేక్ చేస్తోన్న తెలుగోళ్ల పవర్
ప్రత్యేకంగా, వాల్‌మార్ట్‌లో నియామకానికి అసలు అర్హత ‘తెలుగు వాడివేనా?’ అన్న ప్రశ్నే అనిపిస్తుందని సంచలనం సృష్టించాడు.
By: A.N.Kumar | 11 Oct 2025 10:00 PM ISTఅమెరికాలోని దిగ్గజ టెక్ కంపెనీల్లో నియామకాల విధానంపై ఓ వైరల్ రెడిట్ పోస్ట్ ఇప్పుడు పెను దుమారం రేపింది. ముఖ్యంగా H-1B వీసా వ్యవస్థ దుర్వినియోగం, కమ్యూనిటీ ఆధారిత నియామకాల ఆరోపణలు చర్చకు దారి తీశాయి. అమెరికన్ టెక్ రంగంలో భారతీయుల ఆధిపత్యం, ముఖ్యంగా కొన్ని నిర్దిష్ట భారతీయ వర్గాల ప్రాబల్యంపై ఈ పోస్ట్ సంచలన ఆరోపణలు చేసింది.
మాజీ అమెజాన్ ఉద్యోగి సంచలన ఆరోపణలు
తాను మాజీ అమెజాన్ ఉద్యోగినని చెప్పుకున్న ఓ రెడిట్ యూజర్, అమెజాన్‌లో తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వివరించాడు. అక్కడ నియామకాల్లో ప్రధాన ప్రమాణం నైపుణ్యం లేదా అనుభవం కాదని, ‘ఏ కమ్యూనిటీకి చెందినవాడివి?’ అనే అంశమే కీలకంగా మారిందని ఆరోపించాడు.
తెలుగు మేనేజర్ల ఆధిపత్యం
ప్రత్యేకంగా, వాల్‌మార్ట్‌లో నియామకానికి అసలు అర్హత ‘తెలుగు వాడివేనా?’ అన్న ప్రశ్నే అనిపిస్తుందని సంచలనం సృష్టించాడు.
గుజరాతీ ప్రాబల్యం:
ఇంటెల్‌లో గుజరాతీ మేనేజర్లు కూడా తమ కమ్యూనిటీ వారినే ప్రోత్సహిస్తారని, క్రికెట్ వంటి సామాజిక కార్యకలాపాల ద్వారా ఇంటర్న్‌షిప్‌లు వచ్చాయని ఉదాహరించాడు.
* H-1B వీసా ఉద్యోగులపై ఒత్తిడి, దుర్వినియోగం
ఈ వివాదానికి ప్రధాన కేంద్ర బిందువు H-1B వీసా పై ఉన్న భారతీయ ఉద్యోగులేనని ఆ యూజర్ పేర్కొన్నాడు.
“కొన్ని భారతీయ మేనేజర్లు.. ముఖ్యంగా H-1B వీసాపై ఉన్నవారు లేదా ముందు అలా ఉన్నవారు.. అమెరికన్లను నియమించరట. ఎందుకంటే వారు 24 గంటలు పని చేయమని ఒత్తిడి చేయలేరు. అలాగే, హక్కులు ఉల్లంఘించినా చట్టపరంగా ఎదురు నిలబడతారు” అని తెలిపాడు.
వీసాపై ఉన్న భారతీయ ఉద్యోగులు వీసా స్టేటస్ కోల్పోతారనే భయంతో కంపెనీ దుర్వినియోగం చేసినా తిరగబడలేరని లేదా నిశ్శబ్దంగా ఉంటారని ఆరోపించాడు.. ఇది కమ్యూనిటీ ఫేవరిటిజానికి, అధిక పని గంటలకు, వేతన అసమానతలకు దారి తీస్తుందని వాపోయాడు.
* అసమానతలకు కారణమవుతున్న వీసా వ్యవస్థ
ఈ పోస్ట్ తక్షణం వైరల్ అవ్వడంతో, H-1B వీసా వ్యవస్థపై విమర్శలు మరింత పెరిగాయి. ఈ వ్యవస్థ అమెరికా ఉద్యోగ రంగంలో విపరీతమైన అసమానతలకు దారి తీస్తుందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆ యూజర్ తన పోస్ట్‌ను ముగిస్తూ “అమెరికాలో జీవన ప్రమాణాలు ఉన్నతంగా ఉన్నా, వీసా వ్యవస్థ దుర్వినియోగానికి అవకాశమిస్తుంది. కొత్త H-1B నియమాలు ఈ విధమైన పరిస్థితులను తగ్గిస్తాయి. బయటకు ఇది గ్లామరస్‌గా కనిపించినా, లోపల పరిస్థితి చాలా కఠినంగా ఉంటుంది,” అని హెచ్చరించాడు.
* రెడిట్‌లో చర్చనీయాంశమైన వైవిధ్యం
ఈ పోస్ట్‌పై వందలాది మంది రెడిట్ యూజర్లు తమ అనుభవాలను పంచుకున్నారు. కమ్యూనిటీ ఫేవరిటిజం, వీసా మోసాలు, గ్రీన్‌కార్డు దుర్వినియోగాల గురించి విస్తృతంగా చర్చించారు. ఈ సంఘటనతో అమెరికా టెక్ కంపెనీలలో వైవిధ్యం , కమ్యూనిటీ ఆధారిత నియామకాలు, వీసా ఆధారిత శక్తి అసమానతలు అనే అంశాలు మళ్లీ ప్రధాన చర్చగా మారాయి.
