Begin typing your search above and press return to search.

ఒకవైపు ఎర్రటి ఎండలు....మరోవైపు భారీ పిడుగులు ..ఇదీ భారతం !

భారతదేశాన్ని రాజకీయ నేతలు ఉత్తరం దక్షిణం అంటూ విభజిస్తూంటారు. ఈ రాజకీయ లెక్కలు ఎలా ఉన్నాయి. ప్రకృతి పరమైన విభజన మాత్రం వింతగా విడ్డూరంగా ఉంది.

By:  Satya P   |   25 Sept 2026 4:04 PM IST
ఒకవైపు ఎర్రటి ఎండలు....మరోవైపు  భారీ పిడుగులు ..ఇదీ  భారతం !
X

భారతదేశాన్ని రాజకీయ నేతలు ఉత్తరం దక్షిణం అంటూ విభజిస్తూంటారు. ఈ రాజకీయ లెక్కలు ఎలా ఉన్నాయి. ప్రకృతి పరమైన విభజన మాత్రం వింతగా విడ్డూరంగా ఉంది. ఇది వివక్ష అనుకోవాలా లేక ప్రకృతి ప్రకోపంగా భావించాలా తెలియదు కానీ వాతావరణం మాత్రం దేశమంతా ఒక్కలా లేదు అన్నది నిజం. ఒక చోట చుర్రుమనిపించే ఎర్రటి ఎండలు కాస్తూంటే మరోచోట చెవులు చిల్లులు పడే భారీ పిడుగులు ఉరుములు మెరుపులతో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అదీ ఇదీ కూడా భారతమే. ఇది ప్రకృతి సృష్టించిన విచిత్ర వాతావరణంగా అంతా చూస్తున్నారు. ఇలా దేశంలో భిన్న ప్రాంతాలు విభిన్న వాతావరణ వైఖరుల మీద భారత్‌కు చెందిన ఇన్సాట్-3డీఎస్ శాటిలైట్ పిక్చర్ ఇలా క్యాప్చర్ చేసింది. ఇదిపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఎల్ నినో ప్రభావం :

ఇక దేశంలో ఎల్ నినో ప్రభావంతో సతమతం అవుతోంది. అది రాజస్థాన్ గుజరాత్ వంటి వాయువ్య ప్రాంతాలలో కొనసాగుతోంది. అక్కడ చూస్తే వాతావరణం పొడిగా ఉంది. మరో వైపు అంటే తూర్పు మధ్య దక్షిణ ప్రాంతంలో తుఫాను ప్రభావంతో వానలు పడుతున్నాయి. ఇలా భారతదేశంలో ప్రస్తుతం ఒకే సమయంలో రెండు విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో దేశంలోని సగం ప్రాంతం మేఘావృతమై భారీ వర్షాలతో తడిసిముద్దవుతుంటే మరోవైపు ఉత్తర భారతదేశంలో ఎండల తీవ్రత అంతకంతకు పెరుగుతోంది.

ఐఎండీ అంచనాలు :

భారత వాతావరణ శాఖ నివేదికల ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాల వాతావరణ సమాచారం చూస్తే చిత్ర విచిత్రంగానే ఉంది. ఒకవైపు భారీ వర్షాలతో తుపాను హెచ్చరికలు జారీ చేస్తున్నరు. ఓవైపు ఎల్‌నినో ప్రభావం, మరోవైపు బంగాళఖాతంలో వాయుగుండం ఏర్పడిన వేళ భారత్ పరిస్థితిపై ఓ ఇంట్రెస్టింగ్ శాటిలైట్ ఫొటో రిలీజైంది. భారత్‌లోని తూర్పు, సెంట్రల్, దక్షిణాదిలో కొంత భాగం పూర్తిగా మబ్బుల్లో కవర్ అయింది. కానీ రాజస్థాన్, గుజరాత్ సహా వాయవ్య ప్రాంతాల్లో మాత్రం వాతావరణం పొడిగా ఉంది. భారత్‌కు చెందిన ఈణ్శాట్-3డ్శ్ శాటిలైట్ దీనిని క్యాప్చర్ చేసింది.

దట్టమైన మబ్బులతో :

ఇక దేశంలోని మధ్య భాగం, అలాగే తూర్పు దక్షిణ భారత ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు కమ్మేస్తున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో భారీ వానలు పడుతున్నాయి. ఇక్కడ తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో కోస్తా ఆంధ్రా తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆకాశం పూర్తిగా మేఘావృతమై మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఒడిశా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో భారత వాతావరణ శాఖ రెడ్ ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది. ఇక్కడ అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే పశ్చిమ బెంగాల్ లో చూస్తే అక్కడ కూడా వాయుగుండం ప్రభావంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదంతా దేశంలో ఒక భాగంగా ఉంటే మరో వైపు సూర్య ప్రతాపంతో మండిపోతున్న రాష్ట్రాలు ఉన్నాయి.

భారీగా ఎండలు :

ఇక దేశంలో చూస్తే వివిధ రాష్ట్రాలలో పొడి వాతావరణం ఇంకా కొనసాగుతోంది. ఇదంతా ఎల్ నినో ప్రభావం వల్ల సంభవించింది. దక్షిణ మధ్య భారతంలో వర్షాలు దంచికొడుతుంటే ఉత్తర వాయువ్య భారతంలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. నైరుతి తురు పవనాలు క్రమంగా నిష్క్రమిస్తుండటంతో వాతావరణం పొడిగా మారింది. పగటి ఉష్ణోగ్రతలు పెరిగి ఏకంగా 34 డిగ్రీల సెల్సియస్ నుంచి 36 డిగ్రీల సెల్సియస్ దాకా నమోదవుతూ జనాలను హడలెత్తిస్తున్నాయి. ఉక్కపోత కూడా ఎక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితి రాజస్థాన్ గుజరాత్ లలో కనిపిస్తోంది. ఈ రాష్ట్రాలలో ఆకాశం నిర్మలంగా ఉండి ఎండ తీవ్రత సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెల్సియస్ ఎక్కువగానే నమోదవుతోంది.

ఇలా ఎండలు మండించే ప్రధాన నగరాల్లో దేశ రాజధాని దేశ రాజధాని ముందుంది. ఇక్కడ న్యూఢిల్లీలో 33 డిగ్రీల సెల్సియస్ నుంచి 36 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. మిగిలిన నగరాలలో ఎండలు తీవ్రంగానే ఉన్నాయని వాతావరణ అంచనాలు ఉన్నాయి.