Begin typing your search above and press return to search.

టీమిండియాను ఎగతాళి చేశారు.. ఆస్ట్రేలియన్లు మీ బుద్ది మారదా?

క్రీడాస్ఫూర్తి కన్నా గెలుపుకే ప్రాధాన్యతనిచ్చే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రత్యర్థులను మాటలతో, చేష్టలతో ఇబ్బందులకు గురి చేయడం కొత్త విషయం కాదు.

By:  A.N.Kumar   |   15 Oct 2025 4:09 PM IST
టీమిండియాను ఎగతాళి చేశారు.. ఆస్ట్రేలియన్లు మీ బుద్ది మారదా?
X

క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా “జెంటిల్మెన్ గేమ్‌” అని పిలుస్తారు. ఈ ఆటలో క్రీడాస్ఫూర్తి, గౌరవం, మర్యాద అనేవి ప్రధానమైన విలువలు. కానీ ఈ విలువలను కడగండ్లలా తుంచిన జట్టు ఏదైనా ఉందంటే అది ఆస్ట్రేలియా. ప్రారంభం నుంచీ ఆ జట్టు ధోరణి ఒకటే.. ఏమైనా చేసి గెలవాలి! గెలుపు కోసం ఏ స్థాయికి అయినా దిగజారడమే వారి స్వభావంగా మారిపోయింది.

క్రీడాస్ఫూర్తి కన్నా గెలుపుకే ప్రాధాన్యతనిచ్చే ఆస్ట్రేలియా ఆటగాళ్లు ప్రత్యర్థులను మాటలతో, చేష్టలతో ఇబ్బందులకు గురి చేయడం కొత్త విషయం కాదు. ప్రత్యర్థి ఆటగాళ్లు పరుగులు తీయగానే దూషణలు, వ్యంగ్య వ్యాఖ్యలు, అర్థరహిత సంకేతాలు.. ఇవన్నీ ఆస్ట్రేలియా ఆటగాళ్ల సాధారణ ఆయుధాలే. ఇదే కారణంగా చాలా దేశాల ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో తలపడేటప్పుడు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు.

అయితే గత కొంత కాలంగా ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కారణం టీమ్ ఇండియా! భారత ఆటగాళ్లు ఇప్పుడు ఆస్ట్రేలియాకు తగ్గట్టుగానే సమాధానం చెబుతున్నారు. స్లెడ్జింగ్‌కైనా, సెటైరికల్ వ్యాఖ్యలకైనా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. దీంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఇప్పుడు భారత జట్టుతో తలపడడానికే భయపడుతున్నారు.

ఇటీవల జరిగిన ఒక ఘటన ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చూపించింది. ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడిన మూడు మ్యాచుల్లోనూ భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లతో షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు. మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా వారు సంప్రదాయ గ్రీటింగ్స్‌ను పక్కన పెట్టారు. క్రీడాస్ఫూర్తి కంటే దేశ గౌరవాన్ని ముందు ఉంచిన ఈ నిర్ణయం భారత అభిమానులచే ప్రశంసలందుకుంది.

కానీ దీనిపై ఆస్ట్రేలియా ఆటగాళ్లు, యాంకర్లు వ్యంగ్యంగా మాట్లాడారు. “భారత ఆటగాళ్లకు ట్రెడిషనల్ గ్రీటింగ్స్ తెలియవు, వారిని బౌలింగ్ చేయకపోతే ఓడించవచ్చు” అని ఒక ఆస్ట్రేలియా యాంకర్ వ్యాఖ్యానించగా, అక్కడున్న పురుష, మహిళ ఆటగాళ్లు చేతులతో విచిత్రమైన సంకేతాలు చేస్తూ నవ్వుకున్నారు.

ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో భారత అభిమానులు ఆస్ట్రేలియా జట్టుపై మండిపడ్డారు. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించినందుకు తీవ్రంగా ఖండించారు. ఫలితంగా “Kayo Sports” అనే ఆస్ట్రేలియా ఛానల్ ఆ వీడియోను తమ ప్లాట్‌ఫారమ్‌ నుండి తొలగించాల్సి వచ్చింది.

ఇలాంటి వ్యవహారం ఆస్ట్రేలియా జట్టు “జెంటిల్మెన్ గేమ్” అనే పేరుకి తగినది కాదని మరోసారి రుజువైంది. గెలుపు కోసం క్రీడా విలువలను త్యజించే ఆ జట్టు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విమర్శల పాలవుతోంది.

భారత జట్టు చూపించిన గౌరవం, నియంత్రణ, క్రమశిక్షణ. ఇవే నిజమైన క్రీడాస్ఫూర్తి! కానీ ఆస్ట్రేలియా మాత్రం ఇంకా ఆ స్థాయికి చేరలేదు. బీ గ్రేడ్ కంటే హీనంగా, క్రీడాస్ఫూర్తి లేకుండా ప్రవర్తించే ఆ జట్టు మళ్లీ “జెంటిల్మెన్ గేమ్” అనే పదానికి అవమానం తీసుకువచ్చింది.

టీం ఇండియా ఫ్యాన్స్ మాటలో చెప్పాలంటే.. క్రికెట్ గేమ్ ఆడే వాళ్లు జెంటిల్మెన్ కావచ్చు, కానీ ఆస్ట్రేలియా మాత్రం కాదు!"