ఉద్యోగరీత్యా మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్న టాప్ - 10 స్టేట్స్ ఇవే!
అలాంటి స్థాయి నుంచి మహిళలు ప్రస్తుతం చాలా ఎత్తుకు ఎదిగారు. వంట గదిలో పొగలో మగ్గిపోయే స్థాయి నుంచి అంతరిక్షంలో అడుగుపెట్టే వరకు మహిళలు ఎంతో వృద్ధి సాధించారని చెప్పవచ్చు.
By: Madhu Reddy | 24 Oct 2025 1:00 PM ISTస్వాతంత్ర్యం రాకముందు మహిళలు అంటే ఒక ఆట బొమ్మలాగే చూసేవారు. ముఖ్యంగా చాలామంది అమ్మాయిలకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేవారు. అమ్మాయిలు ఒక ఏజ్ కు వచ్చేసరికి భర్త చనిపోతే.. భార్యని కూడా చితిపై పెట్టి దహనం చేసిన పరిస్థితులు ఉండేవి. అలాంటి సతీ సహగమనం పరిస్థితులను ఆనాటి సంఘ సంస్కర్త రాజారాం మోహన్ రాయ్ రూపుమాపాడు. అయినా మహిళలకు కొన్ని తిప్పలు తప్పలేదు. ఒకవేళ భర్త చనిపోతే ఆ మహిళ ఇంట్లో నుంచి బయటకు వెళ్లకూడదు. తెల్ల చీర కట్టుకొని ఇంట్లోనే ఓ మూలన కూర్చొని ఉండాలి. బయటకు వెళ్తే ఈసడింపులు ఛీత్కారాలు ఉండేవి..
అలాంటి స్థాయి నుంచి మహిళలు ప్రస్తుతం చాలా ఎత్తుకు ఎదిగారు. వంట గదిలో పొగలో మగ్గిపోయే స్థాయి నుంచి అంతరిక్షంలో అడుగుపెట్టే వరకు మహిళలు ఎంతో వృద్ధి సాధించారని చెప్పవచ్చు. ప్రస్తుత సమాజంలో మగవారితో సమానంగా అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారు మహిళలు. మహిళా అంటే అబల కాదు సబల అని చాటి చెప్పే స్థాయికి ఎదిగారు. అలాంటి మహిళలు కేవలం భార్యలు గానే కాకుండా కుటుంబాలను సాకే స్థాయిలో ఉన్నారు. ప్రస్తుతం మగవారితో సమానంగా ఉద్యోగాలు చేయడమే కాకుండా విమానాన్ని నడిపే స్థాయిలో, అంతరిక్షానికి వెళ్లే స్థాయిలో ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు. మహిళలు ఇంత అభివృద్ధి చెందుతున్నా కూడా.. ఇప్పటికి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలలో మహిళలపై చిన్న చూపు ఉన్నా కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం మహిళల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకువచ్చి వారికి పెద్ద పీట వేస్తున్నారు.
మరి మన భారతదేశంలో మహిళలకు అత్యధిక స్థాయిలో ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పిస్తున్న రాష్ట్రాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. మహిళల ఉద్యోగాల కోసం పెద్దపీట వేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత కేరళ రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. గుజరాత్ మూడవ స్థానం, తమిళనాడు నాలుగవ స్థానం, మహారాష్ట్ర ఐదవ స్థానం, ఢిల్లీ ఆరవ స్థానం, ఉత్తరప్రదేశ్ ఏడవ స్థానం, కర్ణాటక ఎనిమిదవ స్థానం, మధ్యప్రదేశ్ 9వ స్థానం, హర్యానా పదవ స్థానంలో నిలిచింది.
అలా భారతదేశంలోనే మహిళలకు ఉద్యోగరీత్యా అధిక ప్రాధాన్యత కల్పిస్తున్న టాప్ 10 రాష్ట్రాలు ఇవే. ఈ రాష్ట్రాల్లో మహిళలకు పెద్దపీట వేస్తూ వారు అన్ని రంగాల్లో డెవలప్ కావాలని ప్రభుత్వాలు కూడా సహకారం అందిస్తున్నాయి. ముఖ్యంగా ఒక మహిళ ఏదైనా పెద్ద రంగంలో ఉందంటే ఆమె కింద ఉండే ప్రతి ఒక్కరు డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా మహిళా అంటే ఒకప్పటి వంట మనిషి కాదు, ఆదిపరాశక్తి అనే విధంగా ఈ రాష్ట్రాలు చాటి చెబుతున్నాయి. ఇక వీళ్లే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా మహిళలకి ఉద్యోగరీత్యా అధిక ప్రాధాన్యత కల్పించి వారికి పెద్దపీట వేసి వాళ్లకు తగిన సహకారం అందించాలని కొంతమంది మేధావులు కోరుతున్నారు.
