Begin typing your search above and press return to search.

బడ్జెట్ లో రక్షణ రంగానికి పెద్ద నంబర్...మ్యాటర్ క్లియర్

ప్రపచం పరిస్థితులు ఇపుడు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పాలి. ఉక్రెయిన్ రషా యుద్ధం కొనసాగుతోంది.

By:  Satya P   |   13 Jan 2026 1:00 AM IST
బడ్జెట్ లో రక్షణ రంగానికి పెద్ద  నంబర్...మ్యాటర్ క్లియర్
X

ప్రపచం పరిస్థితులు ఇపుడు చూస్తే చాలా ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పాలి. ఉక్రెయిన్ రషా యుద్ధం కొనసాగుతోంది. అమెరికా పెద్దన్న వెనిజులా అధ్యక్షుడు మదురోని తీసుకుని వచ్చి న్యూయార్క్ కోర్టు ముందు పెట్టారు. ఇరాన్ మీద యుద్ధానికి అమెరికా సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటిస్తోంది. మరో వైపు చూస్తే ప్రచ్చన్న యుద్ధాలకి లెక్కలేవు, భారత్ పాక్ ల మధ్యన ఉగ్ర భూతం సాగుతోంది. ఉగ్రవాదానికి ప్రోత్సాహం అందిస్తూ భారత్ మీద సమరానికి పాక్ ఎపుడూ రెడీగానే ఉంటోంది. దాంతో పాటు మరో కొత్త శత్రువుగా బంగ్లాదేశ్ తయారైంది. దాంతో భారత్ మీద ఇరుగూ పొరుగూ ఒత్తిడితో పాటు అన్ని విధాలుగానూ రక్షణ కోసం తగిన విధంగా సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది.

రక్షణ రంగంలో :

ఈ పరిస్థితుల నేపధ్యంలో రక్షణ రంగంలో అధిక నిధులు అవసరం పడుతున్నాయి. భారత్ అయితే దేశీయంగానే చాలా వరకూ అభివృద్ధి చేస్తోంది. వాటి పరిశోధనలకు కూడా నిధులు పెద్ద ఎత్తున అవసరం అవుతాయి. దాంతో ఈసారి బడ్జెట్ లో రక్షణ రంగానికి పెద్ద పీట వేస్తారు అని అంటున్నారు. ఇక సైనిక పాటవాలను మరింతగా పటిష్టం చేసుకోవాలి. అదే విధంగా ఆయుధ సంపత్తిని ఆధునీకరణ చేసుకోవాల్సి ఉంది. దాంతో రక్షణ రంగం విషయంలో భారత్ ఇంకా అలెర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది.

లక్షల కోట్లతోనే :

గతసారి ఆరు లక్షల కోట్ల దాకా రక్షణ రంగంలో కేటాయింపులు చేశారు. అయితే ఈసారి ఆ నంబర్ ని మరింతగా పెంచుతారని అంటున్నారు. దేశీయ బడ్జెట్ చూస్తే 2024-25 ఆర్ధిక సంవత్సరంలో దాదాపుగా యాభై లక్షల కోట్ల దాకా ఉంది. అందులో ఎనిమిదవ వంతు గతంలో కేటాయింపు చేశారు. ఈసారి అయిదవ వంతునకు పెంచుతారు అని అంటున్నారు. రక్షణ సంపత్తితోనే శతృవులను కట్టడి చేయడం జరుగుతోంది. సంప్రదాయ యుద్ధానికి కాలం చెల్లిన ఈ రోజులలో ఏ దేశానికి ఆ దేశం తమకు ఉన్న బలాన్ని బలగాన్ని పెంచుకోవడం అనే వ్యూహాత్మకమైన వైఖరితోనే శత్రువులను కట్టడి చేసే ప్రయత్నం జరుగుతోంది.

అనివార్యంగా మారింది :

రక్షణ రంగానికి అధిక నిధులు కేటాయింపులు చేయడం అనివార్యంగా మారుతోంది. ముందు దేశం తరువాతనే మిగిలినవి అన్నీ అన్నట్లుగానే వాతావరణం ఉంది. దేశం సురక్షితంగా ఉంటేనే ఏమైనా చేయడానికి వీలు కలుగుతుంది. దాంతో రక్షణ రంగం మీద ఫోకస్ చేయడం భారత్ కి కూడా తప్పనిసరి అవుతోంది అని అంటున్నారు ఈ క్రమంలో ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఆమె బడ్జెట్ లో రక్షణ రంగానికి చేసే కేటాయింపుల మీదనే అందరి దృష్టి ఉంది. చూడాలి మరి ఆ నంబర్ ఎంత పెద్దగా ఉండబోతోందో.