Begin typing your search above and press return to search.

బంగ్లా చేసిన పిచ్చి పని...భారత్ ఆగ్రహం

భారతదేశం ఎంతో సహన వంతమైన దేశంగా చెప్పుకుంటారు. అందరూ బాగుండాలి అందులో తాను ఉండాలని నమ్మే దేశంగా ప్రపంచంలో పేరుంది.

By:  Satya P   |   29 Oct 2025 9:13 AM IST
బంగ్లా చేసిన పిచ్చి పని...భారత్ ఆగ్రహం
X

భారతదేశం ఎంతో సహన వంతమైన దేశంగా చెప్పుకుంటారు. అందరూ బాగుండాలి అందులో తాను ఉండాలని నమ్మే దేశంగా ప్రపంచంలో పేరుంది. విశ్వానికి మిత్రుడు అన్న పదం ఒక్క భారత్ కే సరిపోతుంది. శతృవు అన్న మాట భారత్ వైపు నుంచి ఉండదు, తమ జోలికి ఎవరైనా వస్తేనే మూడో కన్ను తెరుస్తుంది. పాక్ దాయాదిగా ఉంటూ శతృవుగా మారినా కూడా భారత్ ఎన్నో అవకాశాలు ఇచ్చింది. మారాలని కోరింది అయినా వినిపించుకోక తన బుద్ధి చూపించుకోగ్వడంతోనే ఆపరేషన్ సింధూర్ లాంటి గట్టి ప్రయోగం చేయాల్సి వచ్చింది. అలాగే సింధు జలాలను నిలుపు చేసి పాక్ గొంతు ఎండబెట్టాల్సి వచ్చింది.

ఊపిరి పోసిన చోట :

ఇక మరో పొరుగు దేశం బంగ్లాదేశ్ గురించి చెప్పాలంటే ఆ దేశం ప్రతీ రోజూ భారత్ పేరు తలచుకోవాల్సిందే అని అంటారు. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్తే కనుక పాక్ కబంధ హస్తాల నుంచి తూర్పు పాకిస్తాన్ ని కాపాడి ఒక ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసిన మంచితనం భారత్ ది అని చెబుతారు. తూర్పు పాకిస్తాన్ ని అలా కనుక వదిలేసి ఉంటే ఈ రోజున బెలూచిస్తాన్ మాదిరిగా అన్ని విధాలుగా అణచివేతకు గురి అయి పాక్ చేతిలో హింస పడుతూ దిన దిన గండంగా ఉండేది. అంతకు ముందు కూడా మొదటి మూడు దశాబ్దాల పాటు అలాగే తూర్పు పాకిస్తాన్ హింసకు గురి అయింది భారత్ ని శరణు కోరడంతో న్యాయ సమ్మతంగా అది ఉండడంతో భారత్ శ్రీమతి ఇందిరాగాంధీ నాయకత్వంలో పాక్ తో యుద్ధం చేసి 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి నాంది పలికింది. ఒక కొత్త దేశం ప్రపంచ పటం మీద ఊపిరి పోసుకోవడానికి దోహదదం అయింది. అంతటితో ఊరుకోలేదు నిన్నా మొన్నటి వరకూ ఆర్థికంగా అన్ని విధాలుగా బంగ్లాదేశ్ ని ఆదుకుంటూనే వచ్చింది. కానీ గత ఏడాదిన్నరగా మారిన పరిణామాలతో బంగ్లాదేశ్ భారత్ కి శతౄవుగా మారిపోయింది.

విషం చిమ్ముతూ :

తన ఒకనాటి శత్రువు అయిన పాక్ తో చేతులు కలిపి భారత్ మీద విషం చిమ్మడం తో పోటీ పడుతోంది బంగ్లాదేశ్. ఆ దేశం తాజాగా చేసిన పిచ్చి పనికి భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పాక్ కి టెంపరరీగా ఒక ప్రధాని ఉన్నారు. ఆయనే మహమ్మద్ యూనస్. ఆయన భారత్ మీద అదే పనిగా తన వ్యతిరేకతను చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఈ పెద్ద మనిషి ఇంకో సారి భారత్ పై తనకు ఉన్న అసూయను వ్యతిరేకతను చాటుకున్నారు. భారత్ కు చెందిన కీలకమైన భూభాగాలను బంగ్లాదేశ్ దేశం మ్యాప్ లో ఆయన చూపించారు. ఇది ఒక విధంగా బరితెగింపు అని చెప్పాల్సి ఉంటుంది. అంతే కాదు చాలా గొప్పగా దానిని పాక్ నేస్తాలకు బహూకరించారు.

పెడ ధోరణికి :

ఇదంతా బంగ్లాదేశ్ పెడ ధోరణికి నిదర్శనం అని అంటున్నారు తమది కానిది తమకు చెందనిది అయిన భూములను ప్రాంతాలను ఎలా కలుపుకుంటారు అని భారత్ లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇది దిగజారుడు తనం చౌకబారుతనం బరితెగింపు అని అంటున్నారు. ఈ విధంగా తయారు చేసిన మ్యాప్ ని ఆయన పాకిస్థాన్ జనరల్ షంషాద్ మీర్జాకు ఇవ్వడం మరో రకమైన పైత్యానికి నిదర్శనంగా చూస్తున్నారు. ఇక బంగ్లా ఈ విధంగా రూపొందించిన మ్యాప్ లో చూస్తే భారత దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు అన్నీ ఉండడం గమనార్హం. వాటిని తమ సొంతంగా సొత్తుగా బంగ్లా తాత్కాలిక పాలకుడు చూపించుకుంటూ మురిసిపోవడం కంటే తెంపరితనం వేరొకటి ఉండదని అంటున్నారు

బంగ్లాకు తగిన గుణపాఠం :

ఈ మధ్యనే పాకిస్థాన్ కు చెందిన జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాప్ కమిటీ ఛైర్ పర్సన్ జనరల్ షంషాద్ మీర్జా బంగ్లాదేశ్ లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగానే ఆయనకు ఈ తాత్కాలిక ప్రధాని అయిన యూనస్ మహాశయుడు ఒక బుక్ ని ప్రజెంట్ చేశారు. ఆ బుక్ కి వేసిన కవర్ పేజి చిత్రంలో భారత్ లోని భూభాగాలను కలుపుకుంటూ ఉన్న మ్యాప్ లో ఉంది. భారత్ లో ఈశాన్యంలో ఏకంగా ఏడు రాష్ట్రాలు మావే అంటూ చేసిన ఈ మ్యాప్ ప్రదర్శన బంగ్లా బుద్దిని బయట పెట్టింది. అంతే కాదు పిచ్చి తనాన్ని బయటపెట్టింది అని అంటున్నారు. దీని మీద మొత్తం భారతదేశం ఆగ్రహంగా ఉంది. సమయం చూసి భారత్ బంగ్లాకు తగిన గుణపాఠం చెప్పాలని అంతా కోరుకుంటున్నారు.