ఢిల్లీ గగనతలంలో రక్షణ వలయం... ఏమిటీ 'క్యాపిటల్ డోమ్'!
అవును... దేశ రాజధాని ఢిల్లీతో సహా మొతం జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్.సీ.ఆర్)ను అభేద్యమైన భద్రతా కవచంలో కప్పి ఉంచడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
By: Raja Ch | 28 Dec 2025 2:05 PM ISTఈ ఏడాదిలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సమయంలో సరిహద్దుల్లో ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో.. శత్రుదేశానికి చెందిన డ్రోన్లు, రాకెట్ లాంచర్లు దేశ రాజధాని వైపు దూసుకొచ్చేలా ప్రయోగించారనే కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే! అయితే.. మన దుర్భేధ్యమైన గగనతల రక్షణ వ్యవష వాటికి సక్సెస్ ఫుల్ గా అడ్డుకొని, నిర్వీర్య చేసింది. ఈ నేపథ్యంలో హస్తిన గగనతలంలో ఓ రక్షణ వలయం ఏర్పాటు చేయనున్నారు!
అవును... దేశ రాజధాని ఢిల్లీతో సహా మొతం జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్.సీ.ఆర్)ను అభేద్యమైన భద్రతా కవచంలో కప్పి ఉంచడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. హైస్పీడ్ క్షిపణుల నుంచి, తక్కువ ధర డ్రోన్ల వరకూ వైమానిక ముప్పుల నుంచి రాజధానిని రక్షించడానికి భారతదేశం స్పెషల్ మల్టిపుల్ లేయర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం ను మొహరిస్తోంది. దీనికే అనధికరికంగా క్యాపిటల్ డోమ్ అని పేరు పెట్టారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రక్షణ పరిశోధన & అభివృద్ధి సంస్థ (డీ.ఆర్.డీ.ఓ) అభివృద్ధి చేసిన ఈ మల్టిపుల్ లేయర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం.. జాతీయ రాజధాని ప్రాంతాన్ని సమీపించే ఏదైనా వైమానిక ముప్పును రిమోట్ గా నాశనం చేసే అధునాతన రాడార్, నిఘా వ్యవస్థలతో మొహరించబడుతుంది. ఇది సరిహద్దు అవతల నుంచి వచ్చే ఏదైనా ముప్పును చాలా దూరం నుంచే గుర్తిస్తుంది. ఈ క్రమంలో ఈ మొత్తం ప్రాంతం 24/7 పర్యవేక్షించబడుతుంది.
ఈ క్యాపిటల్ డోన్ లో రెండు అధునాతన క్షిపణి వ్యవస్థలు ఉంటాయి. ఇందులో భాగంగా ఒకటి క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి (క్యూ.ఆర్.ఎస్.ఏ.ఎం) కాగా.. రెండోది, వర్టికల్లీ లాంచ్డ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ క్షిపణి (వీఏల్-ఎస్.ఆర్.ఎస్.ఏ.ఎం) ఉంటాయి! దీంతో.. ఇప్పుడు ఈ మొత్తం ప్రాంతం ఒక అభేద్యమైన కవచం ద్వారా రక్షింపబడుతుందన్నమాట.
ఏమిటీ క్యూ.ఆర్.ఎస్.ఏ.ఎం..?:
క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ (క్యూ.ఆర్.ఎస్.ఏ.ఎం.) అనేది డిఫెన్స్ గ్రిడ్ హెవీ మొబిలిటీ వెహికల్స్ పై అమర్చబడిన క్షిపణి వ్యవస్థ. దీనిని వేగంగా మోహరించవచ్చు.. ఇది లక్ష్యాలను వేగంగా గుర్తించగలదు.. నిర్వీర్యం చేయగలదు. ఈ క్షిపణి సుమారు 25-30 కి.మీ పరిధిని కలిగి ఉంటుంది. క్రూయిజ్ క్షిపణులు, హెలికాప్టర్లు, ఫైటర్ జెట్ లు వంటి వైమానిక ముప్పులను ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా అభివృద్ధి చేయబడింది.
వీఎల్-ఎస్.ఆర్.ఎస్.ఏ.ఎం.. అంటే ఏంఇటి..?:
వీఎల్-ఎస్.అర్.ఎస్.ఏ.ఎం ను మొదట భారత వైమానికదళం కోసం అభివృద్ధి చేయగా.. భూ ఆధారిత ఎయిర్ డిఫెన్స్ లో కూడా ఉపయోగిస్తున్నారు. నిలువు ప్రయోగ సామర్థ్యంలో ఈ రక్షణ వ్యవస్థ 350 డిగ్రీల్లో లక్ష్యాలను ఛేదించగలదు. ఇది అధిక ఖచ్చితమైన అడ్డగింపు కోసం యాక్టివ్ రాడార్ హోమింగ్ తో అమర్చబడి ఉంటుంది.
