Begin typing your search above and press return to search.

అందుకే యుద్ధానికి వెనక్కి తగ్గాం.. చిదంబరం సంచలన వ్యాఖ్యలు..

‘26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులు’ తలుచుకుంటే ఒక్కసారిగా నరాలు ఉడికిపోతాయి. ఈ దాడులు భారతదేశానికి మాత్రమే కాదు, అంతర్జాతీయ సమాజాన్ని సైతం తీవ్ర షాక్ కు గురి చేసింది

By:  Tupaki Political Desk   |   30 Sept 2025 3:35 PM IST
అందుకే యుద్ధానికి వెనక్కి తగ్గాం.. చిదంబరం సంచలన వ్యాఖ్యలు..
X

‘26/11 ముంబై టెర్రరిస్ట్ దాడులు’ తలుచుకుంటే ఒక్కసారిగా నరాలు ఉడికిపోతాయి. ఈ దాడులు భారతదేశానికి మాత్రమే కాదు, అంతర్జాతీయ సమాజాన్ని సైతం తీవ్ర షాక్ కు గురి చేసింది. దేశ భద్రతను ప్రశ్నించేవిగా మారాయి. ఆ దాడుల్లో ప్రాణనష్టం తీవ్రంగా జరిగింది. అప్పటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ఈ దాడుల గురించి ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘26/11 దాడుల తర్వాత తీవ్ర కోపోద్రేక్తమైన భారత్ పాక్‌పై యుద్ధం ప్రకటించాలని అనుకుంది. అయితే, ఆ దశలో కొన్ని అంతర్జాతీయ, రాజకీయ కారణాల వల్ల యుద్ధానికి వెనక్కి తగ్గాల్సి వచ్చింది’ అన్నారు.

యుద్ధం వద్దన్న అమెరికా..

అప్పటి అమెరికా విదేశాంగ కార్యదర్శి కండోలిజా రైజ్ భారత్ పాక్‌పై దాడి చేసే ఆలోచనలో ఉన్నట్లు గమనించి అంతర్జాతీయ పరిణామాల కారణంగా శాంతియుత రీతిలో పరిష్కరించాలని సూచించారు. ‘అందుకే ఆ యుద్ధ నిర్ణయం వెంటనే అమలు చేయలేదు.’ అని చిదంబరం స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయ వాతావరణంలో దుమారానికి కారణమైంది. ఎందుకంటే ప్రజలకు, మీడియాకు, రాజకీయ పార్టీలకు ఇప్పటి వరకూ పూర్తి సమాచారం తెలియదు.

తీవ్ర చర్చకు దారి తీసిన చిదంబరం వ్యాఖ్యలు..

చిదంబరం వ్యాఖ్యలు భారత రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చివరి దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు తీసుకురావాలని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలు బీజేపీ అనుకూలంగా మలుచుకుంది. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ పైకే ఎక్కు పెట్టారు. జాతీయ భద్రత కంటే మీకు విదేశీయుల మాటలు ఎక్కువగా తోచాయా? అంటూ నిలదీస్తున్నారు. 26/11 తరహా దాడులు జరిగిన సందర్భంలో యుద్ధం చేయాలన్న నిర్ణయం తీసుకొని వెనక్కు తగ్గడం వెనుక మండిపడ్డారు.

కొట్టచ్చినట్లుగా భద్రతా లోపం..

ఇది కేవలం దేశీయ రాజకీయ వ్యవహారం మాత్రమే కాదు, భద్రతా విధానంలో గల అంతర్జాతీయ మానవీయ, రాష్ట్రీయ, వ్యూహాత్మక సమన్వయాల సమస్యను ప్రతిబింబిస్తుందని చిదంబరం వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నాయి. ప్రజలు, రాజకీయ విశ్లేషకులు, భద్రతా నిపుణులు ఈ వ్యాఖ్యలను పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి సీరియస్ దాడులకు ప్రతిస్పందనగా వ్యూహాత్మక, సరైన తీర్మానాలు తీసుకోవడంలో అవసరాన్ని మళ్లీ గుర్తుచేసుకున్నారు.

రాజకీయ దుమారం..

చిదంబరం సంచలన వ్యాఖ్యలు రాజకీయ, భద్రతా, అంతర్జాతీయ అంశాలను వెలికితీశాయి. 26/11 దాడుల తర్వాత తీసుకోవలసిన నిర్ణయాలు, అంతర్జాతీయ ఒత్తిళ్ల క్రమంలో భారత వ్యూహాలు, రాజకీయ వ్యూహాల వల్ల సమయానుకూలంగా చర్యలు చేపట్టలేకపోవడాన్ని ఈ వ్యాఖ్యలు వివరిస్తున్నాయి.