వణికిపోతున్న పాక్...యుద్ధమట !
భారత్ లో ఢిల్లీలో జరిగిన భారీ పేలుడు తరువాత పాకిస్థాన్ భయం ఏ రేంజిలో ఉందో అక్కడ పరిస్థితులు ప్రభుత్వం సైన్యం చేస్తున్న ముందస్తు సన్నాహాలు అన్నీ చూసిన తరువాత అర్ధం అవుతోంది.
By: Satya P | 14 Nov 2025 2:00 AM ISTదాయాది నిలువెల్లా వణికిపోతోంది. ఏ క్షణం ఏమి ముంచుకు వస్తుందో అర్ధం కాక సతమతమవుతోంది. భారత్ లో దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం బాంబు బ్లాస్టింగ్ ఘటనలో ఏకంగా 13 దాకా మరణించారు. మరో ఇరవై మంది దాకా తీవ్ర గాయాల పాలు అయ్యారు. ఈ ఘటన వెనక ఎంతటి బాధ్యులు ఉన్నా వదిలిపెట్టేది లేదని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. ఇక తవ్వి తీస్తున్న కొద్దీ ఉగ్ర మూలాలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. దీని వెనక పాక్ కేంద్రంగా పనిచేసే ఉగ్ర వాద సంస్థల హస్తం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. దాంతో వీటి ఆధారాలను సరిగ్గా పట్టుకుని ప్రకటిస్తే అపుడు పాక్ కే నిలువెల్లా చమటలు పడతాయి.
ఢిల్లీ బ్లాస్ట్ తరువాత :
భారత్ లో ఢిల్లీలో జరిగిన భారీ పేలుడు తరువాత పాకిస్థాన్ భయం ఏ రేంజిలో ఉందో అక్కడ పరిస్థితులు ప్రభుత్వం సైన్యం చేస్తున్న ముందస్తు సన్నాహాలు అన్నీ చూసిన తరువాత అర్ధం అవుతోంది. సైన్యాన్ని భారీగా మోహరించడంతో పాటు ఎలాంటి పరిస్థితులు అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఇస్తున్న ఆదేశాలు అన్నీ చూస్తే కనుక భారత్ ఏమి చేస్తుందో అన్న కంగారు భయం కనిపిస్తున్నాయని అంటున్నారు. సరిగ్గా ఆరేడు నెలల క్రితం ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ పాక్ మీద ఎటాక్ చేసింది. ఆ సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉగ్రవాదుల స్థావరాలతో పాటు కీలక ప్రదేశాలలో సైతం వాటిని మట్టు పెట్టింది. అయితే ఈ మధ్య కాలంలో తిరిగి అక్కడ చేసిన ఉగ్రవాదులు వారి క్యాంపుల నుంచి తిరిగి బంకర్లలోకి వెళ్తున్నారు అని అంటున్నారు. అంతే కాదు భారత్ దాడి చేస్తే ఎలా అన్న ఆందోళనతో ఉగ్ర మూకలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నాయని కూడా ప్రచారం అయితే సాగుతోంది.
సరిగ్గా రెండు వారాలు :
ఇక ఏప్రిల్ లో 22న పహిల్గాం దాడి జరిగింది. ఆ తరువాత రెండు వారాలకు మే 7 న భారత్ సడెన్ గా ఆపరేషన్ సింధూర్ తో పాక్ కి ఊహించని విధంగా దెబ్బ తీసింది. ఇపుడు కూడా చూస్తే కనుక అదే రకమైన పరిస్థితి ఉండుచ్చు అని ముందే అనుమానిస్తున్న పాక్ పైకి బింకంగా ఉన్నా లోపల కలవరంతో ఉందని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఆర్భాటం ప్రకటనలు చేస్తోంది అని అంటున్నారు.
యుద్ధానికి సిద్ధమంటూ :
తాము భారత్ ఆఫ్ఘనిస్థాన్ తో యుద్ధానికి సిద్ధం అంటూ పాక్ రక్షణ మంత్రి తాజాగా ప్రకటించడం వెనక ముందస్తు వ్యూహాలే ఉన్నాయని అంటున్నారు. భారత్ తమ మీద దాడి చేస్తుందని అనుమానిస్తున్న పాక్ తామే యుద్ధానికి సిద్ధమని బీరాలు పోతోంది అని అంటున్నారు. అయితే పాక్ లో ఉన్న జైషే మహమ్మద్ వంటి అనేక ఉగ్ర మూకలు భారత్ లో ఉగ్ర లింకులను పెట్టుకుని అనేక మందిని ప్రోత్సహిస్తూ అశాంతిని సృష్టిస్తున్నాయని అంటున్నారు. ఆపరేషన్ సింధూర్ తో పాక్ అన్నీ పోయి చతికిలపడినా ఇంకా లేస్తే మనిషిని కాను అంటూ ప్రకటనలు చేస్తోంది. మరో వైపు చూస్తే పాక్ ప్రభుత్వానికి అక్కడి ఉగ్ర మూకల మీద ఎంత వరకూ కంట్రోల్ లో ఉందో తెలియదు అని అంటున్నారు మరో వైపు చూస్తే సైన్యం విషయంలో కూడా అదే పరిస్థితి ఉంది. ఈ రకమైన అయోమయ పరిస్థితులలో పాక్ యుద్ధానికి సిద్ధం అంటోంది. అది కూడా ప్రత్యక్ష యుద్ధం అంటోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
