భారత 'అగ్ని-5'కి చుచ్చుపోసుకుంటున్న పాకిస్తాన్.. కాళ్లబేరం
భారత్ ఇటీవల అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన తర్వాత పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లో ఆందోళన మొదలైంది.
By: A.N.Kumar | 24 Aug 2025 10:12 AM ISTభారత్ ఇటీవల అగ్ని-5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన తర్వాత పాకిస్తాన్ రాజకీయ వర్గాల్లో ఆందోళన మొదలైంది. భారత్ సైనిక శక్తిని చూసి ఒకవైపు భయపడుతూ.. మరోవైపు చర్చల కోసం విజ్ఞప్తి చేయడం పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని స్పష్టం చేస్తోంది.
-భద్రతా ఆరోపణలు, ఆందోళన
అగ్ని-5 పరీక్ష తర్వాత పాకిస్తాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి షఫ్కత్ అలీ ఖాన్ మాట్లాడుతూ ఈ క్షిపణి కేవలం పాకిస్తాన్‌కే కాకుండా ప్రపంచ శాంతి, స్థిరత్వానికి కూడా ముప్పు అని ఆరోపించారు. అంతర్జాతీయ సమాజం భారత్ సైనిక శక్తి పెరుగుదలపై మౌనం వహించడం సరికాదని ఆయన విమర్శించారు. పాకిస్తాన్ భయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది, ఎందుకంటే అగ్ని-5 క్షిపణి దాదాపు 5,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదు.
-చర్చల కోసం మృదువైన స్వరం
భారత్ శక్తిని చూసి భయపడుతున్న పాకిస్తాన్, మరోవైపు తమ వైఖరిని మార్చుకున్నట్లుగా వ్యవహరిస్తోంది. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ కాశ్మీర్‌తో సహా అన్ని అంశాలపై భారత్‌తో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ఉగ్రవాదం నుంచి వాణిజ్యం వరకు అన్ని రంగాల్లో సహకారం కావాలని ఆయన కోరారు. ఇది పాకిస్తాన్ రాజకీయ నాయకులు తమ దేశ ప్రజలకు, అంతర్జాతీయ సమాజానికి ఒక వైఖరి చూపించడానికి, అసలు విషయానికి దూరంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.
-భారత్ స్పష్టమైన వైఖరి
పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిపై భారత్ చాలా స్పష్టంగా ఉంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ఏ దేశంతోనూ భారత్ చర్చలు జరపదు అని స్పష్టం చేశారు. చర్చలు జరగాలంటే ముందుగా ఉగ్రవాదం ఆగిపోవాలని ఆయన అన్నారు. అలాగే పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) సమస్య, సరిహద్దు ఉగ్రవాదం సమస్య పరిష్కారం అవ్వాలని భారత్ పదేపదే చెబుతోంది.
-పాక్ మాయగాళ్ల ఆట
పాకిస్తాన్ తరచుగా క్రీడలు, సంస్కృతి, రాజకీయాలను కలపవద్దని చెబుతూ ఉంటుంది. కానీ షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో భారత్-పాక్ నేతల మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సమావేశం జరగదని భారత్ స్పష్టం చేసింది. భారత్ యొక్క బలమైన సైనిక శక్తి, దౌత్య వైఖరి పాకిస్తాన్‌పై ఒత్తిడిని పెంచుతోంది. పాక్ ఎన్ని చర్చల పిలుపులు ఇచ్చినా ఉగ్రవాదాన్ని ఆపకుండా, PoK ఆక్రమణను వదులుకోకుండా ఆ పిలుపులు కేవలం రాజకీయ మాయగాళ్ల ఆటగానే మిగిలిపోతాయి.
భారత్ శక్తి ప్రదర్శన పాకిస్థాన్‌ను గట్టిగా కుదిపేసింది. ఒకవైపు భారత్‌పై ఆరోపణలు చేస్తూనే, మరోవైపు చర్చలు కోరుకోవడం పాక్ నిజ స్వరూపాన్ని బయటపెడుతోంది.
