Begin typing your search above and press return to search.

16 ఏళ్ల ఉమ్మడి జీవితం ఒక్క క్షణంలో ముగిసిన వేళ..!

దుబాయ్ ఎయిర్ షో లో విన్యాసాలు నిర్వహిస్తుండగా తేజస్ జెట్ కూలి, అందులోని పైలట్ వింగ్ కమాండర్ నమాంశ్ సయాల్ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   23 Nov 2025 7:00 PM IST
16 ఏళ్ల ఉమ్మడి జీవితం  ఒక్క క్షణంలో ముగిసిన వేళ..!
X

దుబాయ్ ఎయిర్ షో లో విన్యాసాలు నిర్వహిస్తుండగా తేజస్ జెట్ కూలి, అందులోని పైలట్ వింగ్ కమాండర్ నమాంశ్ సయాల్ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన నివాసం వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మరోవైపు దేశం మొత్తం ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తోంది.

అవును... దుబాయ్ ఎయిర్ షోలో జరిగిన ప్రదర్శనలో భారత వైమానిక దళ పైలట్ వింగ్ కమాండర్ నామాంశ్ సయాల్ మరణించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తమ ధైర్యవంతుడైన కుమారుడు ఇకపై తమతో లేడని కుటుంబం ఇప్పటికీ నమ్మలేకపోతోంది. ఈ సందర్భంగా నామాంశ్ ప్రేమ వివాహం చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన భార్య, కుమార్తె గురించి అయినవారు మరింత కన్నీరుమున్నీరవుతున్నారు.

హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాకు చెందిన నామ్నాష్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన భార్య అఫ్సానా కూడా భార వైమానిక దళలో అధికారిణి కావడం గమనర్హం. వీరిద్దరూ తమ ప్రయాణంలో ఎన్నో కలలు కన్నారు, దేశాన్ని రక్షించడానికి కలిసి ప్రమాణం చేసి, ప్రయాణిస్తున్నారు. అయితే తేజస్ కూలిపోవడంతో వీరి 16 ఏళ్ల ఉమ్మడి జీవితం ఒక్క క్షణంలో ముగిసింది! వీరికి 7ఏళ్ల కుమార్తె ఉంది.

చివరి క్షణంలో దూకే ప్రయత్నం!:

దుబాయ్ ఎయిర్ షోలో తేజస్ జెట్ విమానం తక్కువ ఎత్తులో వైమానిక విన్యాసం చేస్తుండగా.. అది నేలపైకి దూసుకెళ్లిన వెంటనే భారీ అగ్నిగోళంగా మారిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన తాజా వీడియో సంచలనంగా మారింది. ఈ క్రమంలో.. ఈ ప్రమాదం చివరి సెకన్లలో ఏమి జరిగిందో కొత్త వీడియో స్పష్టంగా చూపిస్తుందనే చర్చ తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... విమానంలో మంటలు వ్యాపించిన సమయంలో పారాచూట్ లాంటి వస్తువు కనిపిస్తుంది! అంటే... ప్రమాదాన్ని గ్రహించిన పైలెట్ బయటకు రావడానికి ప్రయత్నించాడని.. కానీ, అప్పటికే చాలా ఆలస్యం అయ్యిందనే విషయాన్ని ఇది సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పైలెట్ తిరిగి కంట్రోల్ సాధించడానికి, విమానాన్ని కాపాడటానికి ప్రయత్నించడంవల్ల ఇది జరిగి ఉంటుందని అంటున్నారు.

తేజాస్ లో మొదటి మరణం!:

భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ తేలికపాటి మల్టీరోల్ ఫైటర్ జెట్ అయిన తేజాస్.. దాని 10 సంవత్సరాల సేవలో ఇదే మొదటి మరణంగా నిలిచింది. వాస్తవానికి గత ఏడాది మార్చిలో జైసల్మేర్ సమీపంలో ఒక తేజస్ కుప్పకూలినపటికీ.. ఆ ఘటనలో పైలట్ సురక్షితంగా బయటపడగలిగారు.