Begin typing your search above and press return to search.

ఎక్కువ సెలవులు ఉన్న దేశం...భారత్ ప్లేస్ ఇదే !

ప్రపంచంలో ఎక్కువ సెలవులు ఇచ్చే దేశాలు ఏవి ఉన్నాయి, అందులో భారత దేశం ఎక్కడ ఉంది అంటే చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి.

By:  Satya P   |   19 Jan 2026 9:23 AM IST
ఎక్కువ సెలవులు ఉన్న దేశం...భారత్ ప్లేస్ ఇదే !
X

ప్రపంచంలో ఎక్కువ సెలవులు ఇచ్చే దేశాలు ఏవి ఉన్నాయి, అందులో భారత దేశం ఎక్కడ ఉంది అంటే చాలా ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ ప్రపంచంలో ఎక్కువ సెలవులు ఇచ్చే దేశంగా భారత్ మొదటి స్థానంలో ఉంది అంటే నమ్మాలి అదే నిజం. ఎందుకంటే భారత్ అంటేనే భిన్నమైన సంస్కృతి, ఎన్నో మతాలు ఉన్నాయి. మరెన్నో రకాలైన సాంస్కృతిక వైఖరులు ఉన్నాయి. దాంతో భారత్ లో అనేక ఈవెంట్స్ ప్రాంతీయ జాతీయ స్థాయిలో ముఖ్య పండుగలు జాతీయ పండుగలు ఇలా చాలా ఉంటాయి. దాంతో భారత్ సెలవులు ఇవ్వడంలో నంబర్ వన్ గా ఉంది అని తేలింది.

హాలీడేస్ ఎన్నంటే :

భారత దేశంలో హాలీ డేస్ ఎన్ని అంటే ఏకంగా 42 గా నంబర్ ఉంది. జాతీయ స్థాయిలో ప్రాంతీయ స్థాయిలో కూడా ఈ సెలవులు చూస్తే ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదని అంటున్నారు. ఎందుకంటే భారత దేశం సమాఖ్య వ్యవస్థలో సాగుతోంది. రాష్ట్రాలు కూడా స్థానికంగా జరిగే పండుగలకు సెలవులు ఇస్తాయి. అలా అన్నీ కలుపుకుంటే యాభై దాకా ఈ సెలవులు ఉంటాయని అంటున్నారు. అంటే మొత్తం ఏడాదిలో 50కి పైగా సెలవులు పోతే పనిచేసేది ఎంత అంటే అందులో మరో యాభై ఆదివారాలు రెండవ శనివారాలు కూడా తీసేయాలి అని అంటున్నారు. అలా చూస్తే టోటల్ గా 125 దాకా సెలవులే ఉంటాయి అని అంటున్నారు. ఈ లెక్కన మరే దేశంలో ఎక్కువ సెలవులు లేవని అంటున్నారు.

నేపాల్ సైతం :

ఇక భారత్ తరువాత స్థానం నేపాల్ దేశానిది అవుతోంది. ఇక్కడ ఏకంగా ఏడాదికి 35 రోజులు సెలవులు ఇస్తారు. ఈ దేశంలో హిందూపరమైన క్యాలెండర్ అమలు చేస్తారు. ఎక్కువ మంది హిందువులు ఉంటారు. కాబట్టి అన్ని పండులకు సెలవులు ఇస్తూ ఉంటారు. దసరా దీపావళి, సంక్రాంతి వంటి పండుగలకు ఎక్కువ సెలవులు ఇస్తారని అంటున్నారు. దాంతో భారత్ తర్వాత ఎక్కువ సెలవులు నేపాల్ దే అని చెప్పాల్సి ఉంది.

ఈ దేశాలలో సెలవులు ఇలా :

ఇక మూడవ స్థానంలో ఇరాన్ ఉంది. ఇక్కడ సెలవులు అన్నీ కూడా ఇరాన్ క్యాలండర్ ప్రకారం ఉంటాయి. మత పరమైన పండుగలకు అలాగే వారి మతపరమైన సంవత్సరాదికి ఎక్కువగా సెలవులు ఇస్తారు. మయన్మార్ లో మతపరమైన సెలవులు ఇస్తారు. ఇక్కడ భౌద్ధం అనుసరిస్తారు, దాంతో ఆ సెలవులు ఎక్కువే. సో ఇక్కడ కూడా ఏడాదికి 26 సెలవు దినాలు పండుగలకు ఉంటాయి. శ్రీలంకలో ఏటా 25 దాకా సెలవులు ఇస్తారు. ఈ సెలవులు అన్నీ కూడా క్రిస్మస్, దీపావళి పండుగలతో పాటు ఈద్ వంటి ముస్లిం పండుగలకు కూడా ఇస్తారు. అన్ని మతాల పండుగలకు ఇక్కడ సెలవులు ఇస్తారు. ఇక సెలవులు బాగా తక్కువగా ఇచ్చే దేశాల లిస్ట్ చూస్తే బ్రిటన్ లో 10, నెదర్లాండ్ లో 9, సెర్బియాలో 9, మెక్సికోలో 8, వియత్నాంలో 6 రోజుల సెలవులు ఉన్నాయని అంటున్నారు.