Begin typing your search above and press return to search.

భారత్ కూడా యుద్ధంలోకి దిగాల్సిందే ?

ఈ రోజున ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. పరస్పర అవసరాలు ఉన్నాయి. అలాగే ఒకరి మీద మరొకరు ఆధార పడడం అన్నది అనివార్యంగా ఉంది.

By:  Satya P   |   9 March 2026 11:00 AM IST
భారత్ కూడా యుద్ధంలోకి దిగాల్సిందే ?
X

ఈ రోజున ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయింది. పరస్పర అవసరాలు ఉన్నాయి. అలాగే ఒకరి మీద మరొకరు ఆధార పడడం అన్నది అనివార్యంగా ఉంది. అందువల్ల ఎక్కడో యుద్ధం మనకెందుకు అని చేతులు ముడుచుకునే పరిస్థితి లేదు. అంతే కాదు యుద్ధం ఏ రెండు దేశాల మధ్య జరిగినా ఆధునిక కాలంలో అవి ప్రపంచ దేశాలను అటూ ఇటూ విభజించేస్తున్నాయి. న్యూట్రల్ గా ఉంటూ తమ వాదనను బలపరచుకునే అవకాశాలు అయితే తక్కువగానే ఉంటున్నాయి.

ఉక్రెయిన్ రష్యా ఎపిసోడ్ :

మూడేళ్ళ క్రితం మొదలైన ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో భారత్ న్యూట్రల్ గానే వ్యవహరించింది. అమెరికా పెద్దన్న ఎంత ఒత్తిడి పెట్టినా భారత్ తన విధానం ఇదే అని చాటి చెప్పింది. ఇక రష్యా నుంచి చమురుని కూడా దిగుమతి చేసుకుంది. అది అమెరికాకు ఆగ్రహం కలిగించింది. ఆ పరిణామాలు నేటికీ కొనసాగుతూ వస్తున్నాయి. ఇక అధిక వాణిజ్య సుంకాలతో భారత్ మీద అమెరికా పెట్టిన ఒత్తిళ్ళు అన్నీ ఇన్నీ కావు. ఏది ఎలా ఉన్నా భారత్ అయితే ఈ యుద్ధం విషయంలో చాలా వరకూ తటస్థంగా వ్యవహరించింది అని చెప్పాల్సి ఉంది.

ఇరాన్ విషయంలో అలా కాదు :

ఇపుడు చూస్తే మొత్తం అంతర్జాతీయంగా పరిస్థితి మారుతోంది. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ కలసి యుద్ధం చేస్తున్నాయి. పది రోజుల పాటు ఈ యుద్ధం సాగుతున్నా ఇంకా ఎక్కడా చల్లారడం లేదు, పైపెచ్చు ఈ ఏడాది అంతం వరకూ యుద్ధం కొనసాగుతుందని అమెరికా కచ్చితంగా చెబుతోంది. దాంతో ఈ యుద్ధం వల్ల భారత్ లాంటి దేశాలు ఎక్కువగా ఇబ్బంది పడబోతున్నాయి అని అర్ధం అవుతోంది ఎందుకంటే హర్మూజ్ జల సంధిని ఇరాన్ మూసివేసింది. దాంతో భారత్ కి దిగుమతి అయ్యే చమురు ఓడలకు ప్రతిష్టంబన ఏర్పడింది.

అనివార్యంగా మారుతోందా :

అయితే రష్యాతో భారత్ చేసుకున్న అవగాహన మేరకు అక్కడ నుంచి చమురుని భారత్ తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే భారత్ లో ఇందన నిల్వలు మరో నెల రోజుల పాటు సరిపడేలా ఉన్నాయి. కానీ యుద్ధం అంతకంతకు ముదిరితే మాత్రం రష్యా కూడా రంగంలోకి దిగుతుంది అని అంటున్నారు. అపుడు రష్యా నుంచి వచ్చే చమురు కూడా ఆగిపోయే ప్రమాదం భారత్ కి ఉంది. మరో వైపు చూస్తే చైనా పాకిస్తాన్ కూడా యుద్ధంలోకి దిగబోతున్నాయి అని ప్రచారం సాగుతోంది. ఈ రెండు దేశాలు ఇరాన్ కి మద్దతుగా యుద్ధం చేస్తాయని అంటున్నారు. దాంతో సహజంగా ఈ రెండు దేశాలు భారత్ వ్యతిరేక వైఖరితో ఉంటాయి కాబట్టి భారత్ కూడా యుద్ధానికి సిద్ధపడాల్సి రావచ్చు అని అంటున్నారు.

అమెరికాకు మద్దతుగా :

ఇక ఇపుడు ప్రపంచ దేశాలు కూడా ఇది సుదీర్ఘ కాలం కొనసాగే యుద్ధం గా భావిస్తూ తమకు అనుకూల పక్షానికి మద్దతుగా ముందుకు వస్తున్నాయి. అలా అమెరికాకు ఫ్రాన్స్ దేశం మద్దతు ఇస్తోంది అని అంటున్నారు ఫ్రాన్స్ తొందరలోనే యుద్ధానికి దిగబోతోంది అని అంటున్నారు గత నెలలో ఇజ్రాయెల్ వెళ్ళి వచ్చి ఒప్పందాలు చేసుకున్న భారత్ ఇపుడు ఎటు వైపు అంటే అది ఆసక్తికరమే అని అంటున్నారు అయితే భారత్ తన ప్రాంతీయ పరమైన అవసరాలు అవకాశాలు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఈ యుద్ధంలోకి కనుక దిగితే మాత్రం చైనా పాక్ లకు వ్యతిరేకంగానే ఉండొచ్చు అని అంటున్నారు

ఆయుధాలు రెడీ :

యుద్ధం వస్తుంది అన్న ఆలోచనలు అంచనాలు ఉన్న భారత్ ఎపుడూ సన్నద్ధంగా ఉంటోంది. అందుకే వేయి కిలోమీటర్ల మేర లక్ష్యాలను చేదించే శేష్ నాగ్ 150 వంటి ఆయుధ సామగ్రిని అమ్ముల పొదిలో ఉంచుకుంది అని అంటున్నారు దీనిని సదూర స్మాల్ స్ట్రిక్ డ్రోన్ వ్యవస్థగా చెబుతున్నారు. ఇది అనుకున్న టార్గెట్లను చేదిస్తుంది. అలా భారత్ కనుక వార్ ఫీల్డ్ లోకి దిగితే కచ్చితంగా పరిమిత స్థాయిలో అయినా సమరం తప్పదని అంటున్నారు. మరి భారత్ న్యూట్రల్ విధానానికి ఈ విధంగా భంగం కలిగితే ఫ్యూచర్ లో లాభమా నష్టమా ప్రాంతీయంగా కొత్త సమస్యలు వస్తాయా అంటే వేచి చూడాల్సిందే.