Begin typing your search above and press return to search.

6 జీ నెట్ వర్క్ దిశగా భారత్ అడుగులు

భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న కమ్యూనికేషన్ టెక్నాలజీలలో అగ్రగామిగా మార్చడానికి కేంద్రం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.

By:  Satya P   |   9 Dec 2025 10:24 PM IST
6 జీ నెట్ వర్క్ దిశగా భారత్ అడుగులు
X

దేశంలో ఇప్పటికే 5వ తరం తరంగాలు టెలి కమ్యూనికేషన్ రంగంలో ఊపందుకున్నాయి. చాలా చోట్ల 5జీ నెట్ వర్క్ అన్నది అందుబాటులో ఉంది. బీఎస్ఎన్ఎల్ అయితే 4 జీ నుంచి 5జీ వైపుగా సాగుతోంది. ఇక ప్రైవేట్ నెట్ వర్క్ అంతా 5జీ ని ముందుకు తీసుకుని వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో 6జీ ని ఆవిష్కరించే దిశగా భారత్ కొత్త అడుగులు వేస్తోంది. దానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన రంగాన్ని సిద్ధం చేస్తోంది. ప్రపంచంతో పోటీ పడే విధంగా 6 జీ ఆవిష్కరణలకు భారత్ నాయకత్వం వహించాలని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కోరుకున్నారు. . 6 జీ ఆవిష్కరణలకు నాయకత్వం వహించాలనే భారతదేశ నిబద్ధతను ఆయన గట్టిగానే చాటుతున్నారు.

కమ్యునికేషన్స్ టెక్నాలజీలో :

భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న కమ్యూనికేషన్ టెక్నాలజీలలో అగ్రగామిగా మార్చడానికి కేంద్రం అనేక కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఈ క్రమంలో 6 జీ ఆవిష్కరణలను వేగవంతం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని అంటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన భారత్ 6 జీ మిషన్ కింద అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్భంగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ 6 జీ నెట్ వర్క్ దిశగా సాగాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఇండియా 6 జీ సామర్థ్యాన్ని అందుకోవడానికి రంగం సిద్ధం అవుతోందని అన్నారు.

ప్రపంచ ధోరణులను చూస్తూ :

ఇదిలా ఉంటే భారతదేశం కేవలం ప్రపంచ ధోరణులను అనుసరించడం కంటే టెలికాం టెక్నాలజీల భవిష్యత్తును రూపొందించడానికే అధిక ప్రాముఖ్యత ఇస్తుందని కేంద్ర మంత్రి అంటున్నారు. దానికి సంబంధించి అవసరమైన సహకారాన్ని పెంపొందించడానికి, ఆ దిశగా సాగుతున్న ప్రయత్నాలను బలోపేతం చేయడానికి కేంద్రం అంతా రెడీగా ఉందని చెప్పారు.

ఏఐ రంగంలోకి :

ప్రపంచంలో చూస్తే ఏఐ ఆవిష్కరణతో టెక్నాలజీ రంగంలో దశ దిశ మారుతోంది. దాంతో ఇప్పటిదాకా ఉన్న కమ్యూనికేషన్ రంగంలో కూడా అనూహ్యమైన మార్పులు సంభవిస్తున్నాయి. దాంతో ఆరవ తరం తరంగాల వైపుగా అంతా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఉంది. దాని మీద భారత్ 6 జీ మిషన్ కింద అపెక్స్ కౌన్సిల్ చేయాల్సిన కసరత్తు అంతా చేస్తోంది. ఆ దిశగా కేంద్రం నుంచి పూర్తి ప్రోత్సాహం లభిస్తోంది. రానున్న కాలంలో దేశంలో 6 జీ నెట్ వర్క్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. అది కనుక వస్తే మొత్తానికి మొత్తం పరిస్థితి అయితే మారిపోతుంది అని అంటున్నారు.

లక్ష్యం ఆ దిశగా :

ఇక దేశంలో సైతం 6 జీ విజన్ మార్గనిర్దేశంతో, 2030 నాటికి విస్తరణ లక్ష్యంగా భారతదేశం 6 జీ టెక్నాలజీని చురుకుగా అభివృద్ధి చేస్తోంది. హోలోగ్రాఫిక్ కమ్యూనికేషన్ స్మార్ట్ ట్రాన్స్ పోర్ట్ అప్లికేషన్ల కోసం అతి వేగవంతమైన, నమ్మదగిన కనెక్టివిటీని సాధించడానికి దేశీయ ఆవిష్కరణలు, బలమైన ఆర్ అండ్ డీ పర్యావరణ వ్యవస్థను నిర్మించడంపై దృష్టి సారిస్తున్నారు. చూడాలి కేంద్రం ఈ విషయంలో ఎటువంటి విప్లవాత్మకైన అడుగులు వేస్తుందో.